ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆహార శుద్ధి రంగం వృద్ధి

Posted On: 06 FEB 2024 4:50PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థలో ఆహార శుద్ధి రంగం కీలక రంగంగా మారింది. జీడీపీ పెరుగుదలకు సహకరిస్తున్న ఆహార శుద్ధి రంగం ఉపాధి అవకాశాలు , ఎగుమతుల పెరుగుదలకు అవకాశాలు అందిస్తోంది. గత ఏడు సంవత్సరాలుగా ఆహార శుద్ధి రంగం 

 సగటు వార్షిక వృద్ధి రేటు (AAGR) వద్ద దాదాపు 7.26% వృద్ధి చెందుతోంది. ఆహారశుద్ధి రంగంలో స్థూల విలువ ఆధారిత (GVA) గణనీయంగా పెరిగింది. ఆహార శుద్ధి రంగం  స్థూల ఆధారిత విలువ   2013-14 లో 1.30 లక్షల కోట్లుగా ఉంది.  2021-22 నాటికి ఇది 2.08 లక్షల కోట్లకు పెరిగింది.

కేంద్ర ప్రాయోజిత పథకంగా కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ భూముల నుంచి  రిటైల్ అవుట్‌లెట్ వరకు సమర్థవంతమైన సరఫరా గొలుసు నిర్వహణ కోసం  ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడానికి పథకం  ద్వారా చర్యలు అమలు జరుగుతున్నాయి.ఆహార శుద్ధి   పరిశ్రమల , ఉపాధి అవకాశాల కల్పన, వ్యవసాయ ఉత్పత్తుల వృథాను తగ్గించడం, ప్రాసెసింగ్ స్థాయిని పెంచడం , ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఎగుమతి చేయడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది. 

  2 లక్షల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు/అప్‌గ్రేడేషన్ కోసం సాంకేతిక, ఆర్థిక, వ్యాపార సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ (PMFME)  పథకాన్ని కూడా అమలు చేస్తోంది.

ప్రపంచ స్థాయిలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ  2021-22 నుండి 2026-27 వరకు ఉత్పత్తి తో ముడి పడిన ప్రోత్సాహక పధకాన్ని అమలు చేస్తోంది.  విదేశాలలో భారతీయ ఫుడ్ బ్రాండ్‌ల దృశ్యమానతను మెరుగుపరచడానికి  మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని అమలు చేస్తోంది. 

ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులు ఎక్కువ చేయడానికి కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ  ఈ క్రింది చర్యలు తీసుకుంది:

i . పరిశ్రమల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1951 ప్రకారం లైసెన్సింగ్ పరిధి నుంచి అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలకు  మినహాయింపు.

 ii.  నిబంధనలకు లోబడి ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ఆటోమేటిక్ మార్గం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) అనుమతి.

iii . భారతదేశంలో తయారు అయిన  లేదా ఉత్పత్తి అయిన  ఆహార ఉత్పత్తులకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం మార్గం, ఇ-కామర్స్ ద్వారా వాణిజ్యం కోసం.100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. 

iv. ముడి , శుద్ధి చేసిన  ఉత్పత్తులపై  తక్కువ జిఎస్టీ . వివిధ చాప్టర్ హెడ్‌లు/సబ్ హెడ్‌ల క్రింద 71.7% కంటే ఎక్కువ ఆహార ఉత్పత్తులు 0% & 5% తక్కువ పన్ను స్లాబ్‌లో ఉన్నాయి.

NSSO 2015 నివేదిక ప్రకారం, దేశంలో అసంఘటిత  రంగంలో  దాదాపు 25 లక్షల ఆహార శుద్ధి యూనిట్లు పని చేస్తున్నాయి.  నమోదుకాని మరియు అనధికారికమైన. ఈ యూనిట్లలో ఎక్కువ భాగం ప్లాంట్ , మెషినరీ , టర్నోవర్‌లో పెట్టుబడి పరంగా స్మూక్ష  యూనిట్ల వర్గంలోకి వస్తాయి. ఈ యూనిట్లు రుణ పరపతి , ఆధునిక సాంకేతికత ,యంత్రాలు, బ్రాండింగ్ , మార్కెటింగ్ మరియు ఆహార భద్రత, పరిశుభ్రతలో సవాళ్లను ఎదుర్కొంటాయి.

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో  భాగంగా దేశంలో మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్థాపన / అప్‌గ్రేడేషన్ కోసం ఆర్థిక, సాంకేతిక, వ్యాపార మసహకారం అందించడానికి  కేంద్ర ప్రాయోజిత పథకంగా పీఎంఎఫ్ఎంఈ   పథకాన్ని కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం 2020-21 నుంచి  2024-25 వరకు ఐదు సంవత్సరాల పాటు రూ. 10,000 కోట్ల వ్యయంతో అమలు జరుగుతుంది. అసంఘటిత రంగంలో ఆహార శుద్ధి రంగం ఉంది. అయితే, ఈ రంగంలో  ఇప్పటికే పనిచేస్తున్న  వ్యక్తిగత సూక్ష్మ-సంస్థల మధ్య  పోటీతత్వాన్ని పెంపొందించడం, రంగం అధికారికీకరణను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

పీఎంఎఫ్ఎంఈ పథకం ఒడిశా తో సహా మొత్తం 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు జరిగింది.2024 జనవరి 31 వరకు  పీఎంఎఫ్ఎంఈ కింద సాధించిన ప్రగతి వివరాలు ఇలా ఉన్నాయి 

i. ఒడిశా లో  1175 రుణాలు, రుణ ఆధారిత సబ్సిడీ ప్రయోజనం కోసం 72,556 రుణాలు మంజూరు అయ్యాయి. 

ii. ఒడిశాలోని 23,400 ఎస్‌హెచ్‌జి సభ్యులకు రూ.67.91 కోట్లతో సహా 236704 ఎస్‌హెచ్‌జి సభ్యులకు రూ.771.12 కోట్లు సీడ్ క్యాపిటల్‌గా విడుదలయ్యాయి.

iii. 62,140 మంది లబ్ధిదారులు ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందారు, వీరిలో 6439 మంది ఒడిశాలో శిక్షణ పొందారు.

iv. 14 ODOP బ్రాండ్‌లు మరియు 166 ఉత్పత్తులు కూడా ఇప్పటి వరకు విజయవంతంగా ప్రారంభం అయ్యాయి.  దీనికి సంబంధించి ఒడిశా రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.

ఈ సమాచారాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే  ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో అందించారు. 

 

 

***



(Release ID: 2003356) Visitor Counter : 58


Read this release in: English , Urdu , Hindi