ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు విలువ జోడించిన మౌలిక సదుపాయాల పథకం

Posted On: 06 FEB 2024 4:44PM by PIB Hyderabad

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ   పథకం - ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన కింద ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు విలువ జోడించిన మౌలిక సదుపాయాల  పథకాన్ని అమలు చేస్తోంది.  పొలం నుండి వినియోగదారునికి ఎటువంటి అడ్డు లేకుండా చేపలు (రొయ్యలు తప్ప) ఉద్యాన యేతర ఉత్పత్తులు, పాడి, మాంసం, పౌల్ట్రీ మరియు సముద్రపు పంటల అనంతర నష్టాలను తగ్గించడానికి సమీకృత కోల్డ్ చైన్, సంరక్షణ మరియు విలువ జోడింపు మౌలిక సదుపాయాలను అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. 

 

ఈ పథకం అనేది డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పథకం కింద ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి  ఎంటిటీలలో వ్యక్తులు, అలాగే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పీ ఓ లు), రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సంస్థలు, కంపెనీలలో కోల్డ్ చైన్ సొల్యూషన్స్ మరియు సరఫరా వ్యవస్థను నిర్వహించే వ్యాపార ఆసక్తి ఉన్న సంస్థ/సంస్థలు వారు అర్హులు. 

 

పొలాల వద్ద మౌలిక సదుపాయాలను, ప్రాసెసింగ్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ హబ్, రిఫ్రిజిరేటెడ్ వ్యాన్‌లు/ రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు/ ఇన్సులేటెడ్ వ్యాన్‌లు/ మొబైల్ ఇన్సులేటెడ్ ట్యాంకర్లు వంటివి ఈ పథకంలోని భాగాలు. ఈ పథకం  రేడియేషన్ సదుపాయాన్ని ఒక స్వతంత్ర విభాగం లా ఏర్పాటుచేయడానికి కూడా మద్దతు ఇస్తుంది. వ్యవసాయ స్థాయిలో కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ఈ పథకం వెసలుబాటు సౌలభ్యతను అనుమతిస్తుంది.

 

ఈ పథకం కింద,   సాధారణ ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌ల కోసం అర్హత ఉన్న ప్రాజెక్ట్ వ్యయంలో @35% మరియు కష్టతరమైన ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌ల కోసం అలాగే ఎస్ సి/ ఎస్ టి లు,స్వయం సహాయక బృందాలు, ఎఫ్ పీ ఓ లు మరియు ప్రాజెక్ట్‌ల కోసం అర్హత ఉన్న ప్రాజెక్ట్ వ్యయంలోఒక్కో ప్రాజెక్ట్‌కు గరిష్టంగా రూ.10 కోట్లకు లోబడి @50% గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఎం ఒ ఎఫ్ పీ ఐ అందిస్తుంది.  ఇప్పటివరకు, ఎం ఒ ఎఫ్ పీ ఐ సంవత్సరానికి 38.82 లక్షల మెట్రిక్ టన్నుల  సంరక్షణ సామర్థ్యం మరియు 148.07 ఎల్ ఎం టీ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సృష్టించడానికి 372 ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టులు 35.53 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చగా, 2.23 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి.

 

ఈ సమాచారాన్ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈరోజు లోక్‌సభలో  లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

***



(Release ID: 2003355) Visitor Counter : 58


Read this release in: English , Urdu