ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలను క్రమబద్ధీకరించడానికి సవరణలను ఆమోదించిన ఫుడ్ అథారిటీ 43వ సమావేశం
సవరణలను ఖరారు చేసిన తర్వాత ఆహార ఉత్పత్తులకు
ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ మాత్రమే తప్పనిసరి
ఆహార ఉత్పత్తుల నియంత్రణ సమ్మతిని నిర్ధారించడం కోసం విశ్లేషణ పద్ధతులలో ఇటువంటి మొదటిది మరియు సమగ్ర మాన్యువల్ కూడా సమావేశంలో ఆమోదం పొందింది
प्रविष्टि तिथि:
05 FEB 2024 6:11PM by PIB Hyderabad
'వన్ నేషన్, వన్ కమోడిటీ, వన్ రెగ్యులేటర్' అనే కాన్సెప్ట్ ద్వారా వ్యాపారాన్ని సులభతరం చేసే దిశగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) యూనియన్ అధ్యక్షతన ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 43వ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి, శ్రీ అపూర్వ చంద్ర, ఆహార భద్రత మరియు ప్రమాణాల నిబంధనలను క్రమబద్ధీకరించడానికి వివిధ సవరణలను ఆమోదించారు.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఈఎస్) లేదా ఆహార ఉత్పత్తులకు ఆగ్మార్క్ ధృవీకరణను తొలగించడానికి వివిధ ఆహార భద్రత మరియు ప్రమాణాల నిబంధనలలో వివిధ సవరణలు సమావేశంలోఆమోదించారు. సవరణలు పూర్తయిన తర్వాత, ఆహార ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ధృవీకరణ మాత్రమే తప్పనిసరి చేయడంతో తప్పనిసరి ధృవీకరణ కోసం ఆహార వ్యాపారాలు వేర్వేరు అధికారుల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఇతర ఆమోదాలలో మీడ్ (హనీ వైన్), ఆల్కహాలిక్ రెడీ-టు-డ్రింక్ (ఆర్టిడి) పానీయాల ప్రమాణాలు, పాల కొవ్వు ఉత్పత్తుల ప్రమాణాల సవరణ, హలీమ్ ప్రమాణాలు మొదలైనవి ఉన్నాయి.
ఫుడ్ అథారిటీ ఆహార ఉత్పత్తుల నియంత్రణ సమ్మతిని నిర్ధారించడానికి విశ్లేషణ పద్ధతులలో మొదటి సరిగా ఇటువంటి ప్రక్రియ మరియు సమగ్ర మాన్యువల్‌లను కూడా ఆమోదించింది. వివిధ ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలకు సంబంధించిన సవరణలు ఖరారు చేయడానికి ముందు వాటాదారుల వ్యాఖ్యలను ఆహ్వానించడానికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కోసం సమావేశంలో ఆమోదించారు. ఈ నిబంధనలు పాల కొవ్వు ఉత్పత్తుల ప్రమాణాల సవరణను కలిగి ఉన్నాయి, ఇందులో భాగంగా నెయ్యి కోసం కొవ్వు ఆమ్లాల అవసరాలు ఇతర పాల కొవ్వు ఉత్పత్తులకు కూడా వర్తిస్తాయి.
ఫుడ్ అథారిటీ మాంసం ఉత్పత్తుల ప్రమాణాల్లో భాగంగా ‘హలీమ్’కు కూడా ప్రమాణాలు నిర్ణయించబోతోంది. హలీమ్ అనేది మాంసం, పప్పులు, ధాన్యాలు, ఇతర పదార్ధాలతో తయారు చేయబడిన వంటకం, దీనికి ప్రస్తుతం ఎటువంటి ప్రమాణాలు లేవు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఈఓ శ్రీ జి. కమల వర్ధనరావు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు; రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పారిశ్రామిక సంఘాలు, వినియోగదారుల సంస్థలు, పరిశోధనా సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2002952)
आगंतुक पटल : 283