జల శక్తి మంత్రిత్వ శాఖ

నీటి నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌

Posted On: 05 FEB 2024 5:56PM by PIB Hyderabad

దేశంలోని అన్ని గ్రామీణ ఆవాసాల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా, దీర్ఘ‌కాలం నిర్ణీత నాణ్య‌త క‌లిగిన సుర‌క్షిత‌మైన & తాగు నీటి స‌ర‌ఫ‌రాను కుళాయిల ద్వారా త‌గినంత ప‌రిమాణంలో స‌ర‌ఫ‌రా చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ఈ ల‌క్ష్యం సాధ‌న కోసం  భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాల భాగ‌స్వామ్యంతో అమ‌లు చేసేందుకు జ‌ల జీవ‌న్‌ మిష‌న్‌ను ఆగ‌స్టు 2019లో ప్రారంభించింది. మంచి నీరు అన్న‌ది రాష్ట్ర జాబితాలోని అంశం, క‌నుక‌, జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద‌కు వ‌చ్చే ప‌థ‌కాలు స‌హా మంచినీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించిన ప్ర‌ణాళిక‌, ఆమోదం, అమ‌లు, కార్యాచ‌ర‌ణ‌, మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ అన్న‌ది రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాల బాధ్య‌త‌.సాంకేతిక‌, ఆర్ధిక స‌హాయం ద్వారా రాష్ట్రాల‌కు భార‌త ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంది. 
జ‌ల‌జీవ‌న్ మిష‌న్ అమ‌లు కోసం కార్యాచ‌ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జెజెఎం కింద రాష్ట్రాలు/  యూటిల‌కు కేటాయించిన నిధుల‌లో నుంచి  2%న్ని మంచినీటి నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిఘా కార్య‌క‌లాపాల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. నీటి నాణ్య‌తా ప‌ర్య‌వేక్ష‌ణ   నిగా అన్న‌వి ప్ర‌యోగ‌శాల‌ల్లో నీటి శాంపుళ్ళ‌ను ప‌రీక్షించ‌డంతో పాటుగా, ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల (ఎఫ్‌టికె) ద్వారా సంఘాలు ప‌రీక్ష చేయ‌వ‌చ్చు. 
రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలు నివేదించిన దాని ప్ర‌కారం, ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో వివిధ స్థాయిల్లో అంటే, రాష్ట్ర, ప్రాంతీయ జిల్లా, స‌బ్ డివిజ‌న్ లేదా బ్లాకు స్థాయిలో 2,118 మంచినీటి నాణ్య‌తను ప‌రీక్షించే ప్ర‌యోగ‌శాల‌లు (అస్సాంలోని 83 ప్ర‌యోగ‌శాల‌లు స‌హా) ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. మంచినీటి స‌ర‌ఫ‌రాను నిర్ధారించేందుకు నీటి నాణ్య‌త ప‌రీక్ష‌ల‌ను ప్రోత్స‌హించేలా, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా త‌మ నీటి శాంపుళ్ళ‌ను నామ‌మాత్ర‌పు ధ‌ర‌ల‌కు ప‌రీక్షించేందుకు  ఈ ప్ర‌యోగ‌శాల‌ల‌ను తెర‌వ‌డం జ‌రిగింది. 
నీటి నాణ్య‌త‌ను స‌మాజాలు ప‌ర్య‌వేక్షించేలా వారిని సాధికారం చేసేందుకు  ప్ర‌తి గ్రామంలోనూ ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల‌ను (ఎఫ్‌టికె)లు, బాక్టిరియొలాజిక‌ల్ వ‌యాల్స్‌ను ఉప‌యోగించి నీటిని నాణ్య‌త‌ను గ్రామ స్థాయిలో ప‌రీక్షించేందుకు 5గురు వ్య‌క్తుల‌ను గుర్తించి, శిక్ష‌ణ‌నివ్వ‌వ‌ల‌సిందిగా సూచించ‌డం జ‌రిగింది, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఎంపిక చేసి డ‌బ్ల్యుక్యూఎంఐఎస్ పోర్ట‌ల్ పై నివేదించ‌వ‌ల‌సిందిగా  రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలను సూచించ‌డం జ‌రిగింది. నేటివ‌ర‌కూ, 22.98 ల‌క్ష‌ల‌మంది మ‌హిళ‌లు (అస్సాంలో 1.08 స‌హా) ను గుర్తించి, ఎఫ్‌టికెల‌ను ఉప‌యోగించి నీటిని ప‌రీక్షించేందుకు శిక్ష‌ణ‌నిచ్చిన‌ట్టు రాష్ట్రాలు/  యుటిలు నివేదించాయి.
నీటి నాణ్య‌త కోసం నీటి శాంపుళ్ళ‌ను ప‌రీక్షించ‌డం, శాంపుల్ సేక‌ర‌ణ‌, నివేదించ‌డం, మంచినీటి మూలాల ప‌ర్య‌వేక్ష‌ణ‌, నిఘా వేసేందుకు రాష్ట్రాలు/  యుటిల‌ను సాధికారం చేయ‌డం కోసం ఆన్‌లైన్ జెజెఎం- వాట‌ర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టం (WQMIS) పోర్ట‌ల్‌ను అభివృద్ధి చేశారు. ఈ పోర్ట‌ల్‌పై 30/01/2024 నాటికి రాష్ట్రాలు/  యూటీలు నివేదించిన స‌మాచారం ప్ర‌కారం 60.93 ల‌క్ష‌ల నీటి శాంపుళ్ళ‌ను నీటి ప‌రీక్షా ప్ర‌యోగ‌శాల‌ల్లో ప‌రీక్షించగా, ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల‌ను ఉప‌యోగించి 2023-24లో 10.04 ల‌క్ష‌ల నీటి శాంపుళ్ళ‌ను ప‌రీక్షించారు. 
జ‌ల‌జీవ‌న్ మిష‌న్ కింద క‌ర‌వుపీడిత & ఎడారి ప్రాంతాలు, నీటి నాణ్య‌త ప్ర‌భావిత ఆవాసాలు, ఆకాంక్షిత గ్రామాలు & జెఇ-ఎఇఎస్ ప్ర‌భావిత జిల్లాల్లోని గ్రామాలు, స‌న్స‌ద్ ఆద‌ర్శ్ గ్రామ యోజ‌న (ఎస్ఎజివై), ఎస్‌సి/ ఎస్టీ మెజారిటీ గ్రామాల‌లో కుళాయి నీటి స‌ర‌ఫ‌రాను అందించ‌డానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింది. 
జెజెఎం కింద వార్షిక కేటాయింపులో 0.5% జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లైటిస్- అక్యూట్ ఎన్‌సెఫ‌లైటిస్ సిండ్రోమ్ ప్ర‌భావిత జిల్లాలు ఉన్న రాష్ట్రాల‌కు కేటాయిస్తారు. జెఇ-ఎఇఎస్ ప్ర‌భావిత జిల్లాల‌కు (61) ఇచ్చిన ప్రాధాన్య‌త కార‌ణంగా, గృహాల‌కు పంపునీటి  స‌ర‌ఫ‌రా ఆగ‌స్టు 2019లో 8.01 ల‌క్ష‌ల (2.71%) ఆవాసాల నుంచి 30.01.2024 నాటికి 216.04 ల‌క్ష‌ల‌కు (72.99%) పెరిగింది. 
సోమ‌వారం రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ ఈ స‌మాచారాన్నిచ్చారు. 


***



(Release ID: 2002949) Visitor Counter : 80


Read this release in: English , Urdu , Hindi