రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రయాన భద్రత
प्रविष्टि तिथि:
02 FEB 2024 3:35PM by PIB Hyderabad
భారత నౌకాదళ విభాగాలు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఒఆర్) సుముద్రయాన భద్రతను మరింత పెంచడానికి, క్రమం తప్పకుండా మనకు ఆసక్తిఉన్న వివిధ మిషన్ ఆధారిత కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నాయి. దీనికి తోడు, భారత నావికాదళ విభాగాలు సముద్రయాన వ్యవహారాలలో అవగాహన కల్పించడానికి , ఎప్పటికప్పుడు ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను చక్కదిద్దే వ్యవహారాలలో పాలు పంచుకుంటున్నాయి. 2008 నుంచి భారత నౌకాదళం, గల్ఫ్ ఆఫ్ ఈడెన్, ఆఫ్రికా తూర్పుతీరం వరకు పైరసీ వ్యతిరేక గస్తీ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నది. మొత్తం 3440 నౌకలు, 25,000 మంది సముద్రప్రయాణికులను సురక్షితంగా రక్షణ కల్పించివారి గమ్యస్థానాలకు చేర్చింది.
భారత నావికాదళం, ప్రాంతీయ, ప్రాంతీయతను దాటి అదనపు ప్రదేశాలు, ఐఒఆర్ ప్రాంతంలో సముద్రయాన భదత్రను పెంపొందించడానికి కృషి చేస్తోంది. ద్వైపాక్షిక, బహుళ పక్ష నౌకాయాన విన్యాసాలు, సంయుక్త ప్రత్యేక ఆర్ధిక మండలుల నిఘా కార్యకలాపాలు, సంయుక్త గస్తీ కార్యకలాపాలు, స్నేహపూర్వక దేశాలతో సమన్వయంతో కూడిన గస్తీ (సిఒఆర్పిఎటిఎస్), వంటి కార్యకలాపాలను భారత నావికాదళం చేపడుతున్నది. సముద్ర యాన భద్రత, సంప్రదాయేతర ముప్పును ఎదుర్కోవడానికి పరస్పర సహకారంతో కూడిన పద్ధతిలో దీనిని చేపడుతోంది. దీనిఇక తోడు ప్రాంతీయ సముద్ర యాన భద్రతకు భారత ప్రభుత్వం,ఇన్ఫర్మేషన్ ఫ్యుజన్ సెంటర్–ఇండియన్ ఓషన్ రీజియన్(ఐఎఫ్సి–ఐఒఆర్)ను ఏర్పాటు చేసింది. ఇందులో 25 భాగస్వామ్య దేశాలు అనుసంధానమై ఉన్నాయి. 40 కి పైగా అంతర్జాతీయబహుళపక్ష సంస్థలు రియల్టైమ్లో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ సముద్రయాన భద్రతకు దోహదపడుతున్నాయి.దీనికితోడు, భారత నౌకాదళ విభాగాలు జిబౌతి, గల్ఫ్ ఆఫ్ ఈడెన్, ఉత్తర,మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతం, సోమాలియా తూర్పు సముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు రక్షణ, అవసరమైన సాయం అందించే కార్యకలాపాలలో ఉన్నాయి. సముద్ర యాన భద్రతకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, నిఘా, గస్తీ సమాచారాన్ని స్నేహపూర్వక దేశాలతో పంచుకోవడం ద్వారా సముద్రప్రాంతంలో దాడులకు పాల్పడుతున్న వారెవరు, ఇందుకు కారణాలేమిటి, సమస్యకు మూలాలేమిటి వంటి వాటిని గుర్తించడానికి వీలు కలుగుతుంది.
ఈ సమాచారాన్ని రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్ , లోక్సభలో శ్రీ కున్వర్ పుష్పేంద్ర సింగ్ చందేల్ ప్రశ్నకు ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2002404)
आगंतुक पटल : 137