గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిరుపేద మహిళలకు ఆర్థిక సమ్మిళితం, సామాజిక రక్షణ కోసం బ్రాక్ ఇంటర్నేషనల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (ఎన్ ఆర్ ఎల్ పిఎస్), ఎం ఒ ఆర్ డి

Posted On: 02 FEB 2024 12:46PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం ఒ ఆర్ డి ) పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (ఎన్ఆర్ ఎల్ పి ఎస్) ప్రజలు, కమ్యూనిటీల సాధికారత లక్ష్యంగా గ్లోబల్ సౌత్ నేతృత్వంలోని సంస్థ బ్రాక్ ఇంటర్నేషనల్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి ఎ వై-ఎన్ ఆర్ ఎల్ ఎం) ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ కింద కడు నిరుపేదలను చేర్చేందుకు ఈ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశారు. ఎన్ ఆర్ ఎల్ పి ఎస్ అదనపు కార్యదర్శి, సి ఇ ఒ శ్రీ చరణ్ జిత్ సింగ్, బ్రాక్ ఇంటర్నేషనల్ ఇండియా కంట్రీ లీడ్ శ్రీమతి శ్వేతా ఎస్ బెనర్జీ, డే-ఎన్ ఆర్ ఎల్ ఎం జాయింట్ సెక్రటరీ (ఆర్ ఎల్ -1) శ్రీమతి శ్వేతా ఎస్ బెనర్జీ కలసి డి ఎ వై -ఎన్ ఆర్ ఎల్ ఎం డైరెక్టర్ శ్రీమతి స్మృతి శరణ్, బ్రాక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రామన్ వాధ్వా, బ్రాక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ షమ్రాన్ అబేద్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

శ్రీ చరణ్ జిత్ సింగ్ తన ప్రసంగంలో, “డి ఎ వై -ఎన్ ఆర్ ఎల్ ఎమ్ మిషన్ 100 మిలియన్లకు పైగా మహిళా సభ్యులను కమ్యూనిటీ సంస్థల్లోకి సమీకరించే దశకు చేరుకుంది" అని చెప్పారు. భాగస్వామ్యాల పాత్రను ఆయన నొక్కి చెప్పారు. వెనుకబడిన వాటిని చేరుకోవడంలో బ్రాక్ అంతర్జాతీయ అనుభవాన్ని వివరించారు.

శ్రీమతి స్మృతి శరణ్ మాట్లాడుతూ, "సార్వత్రిక, సమ్మిళిత సమీకరణకు దృఢంగా అంకితమైన డి ఎ వై -ఎన్ ఆర్ ఎల్ ఎమ్ కు ఈ భాగస్వామ్యం ఒక కీలక దశలో రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే 100 మిలియన్ల గ్రామీణ పేద కుటుంబాలను సమీకరించడంతో, ఇప్పుడు మా దృష్టి సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం అయిన సమవేషి ఆజీవిక ద్వారా ' లక్షాధికార దీదీలను' ఉద్ధరించడం వైపు మళ్లింది, అదే సమయంలో స్వయం సహాయక బృందంలో అత్యంత అణగారిన వర్గాలను చేర్చేలా కూడా దృష్టి పెట్టాం‘ అని చెప్పారు.

శ్రీ. షమీరన్ అబేద్ మాట్లాడుతూ, డి ఎ వై -ఎన్ ఆర్ ఎల్ ఎమ్, బ్రాక్ ఇండియా టీమ్ లు తమ తమ బలాలను గుర్తించడంలో  అవగాహన ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకం చేయడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమవేషి ఆజీవికకు ప్రభుత్వం నాయకత్వం వహించడంలో మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి బ్రాక్ సంసిద్ధతను ఆయన తెలియ చేశారు.

చివరి మైలు వరకు సమ్మిళిత జీవనోపాధి ద్వారా ఆత్మవిశ్వాసం, సామాజిక సమ్మిళితం,  శ్రేయస్సును పెంపొందించడమే సమవేషి ఆజీవిక లక్ష్యం. ఈ కార్యక్రమం ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న జనాభా జీవితాలను మెరుగుపరచడానికి సంపూర్ణ ఉత్పాదక సమ్మిళిత వ్యూహాలను ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం ఎస్ హెచ్ జి  నెట్ నుండి ప్రయోజనం పొందడంలో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను చేరుకోవడం కోసం  డి ఎ వై -ఎన్ ఆర్ ఎల్ ఎమ్ కార్యక్రమానికి ఇది ప్రపంచవ్యాప్తంగా పరీక్షించబడిన , నిరూపితమైన "గ్రాడ్యుయేషన్ అప్రోచ్"ను అనుసరిస్తుంది.

1972 లో బంగ్లాదేశ్ లో స్థాపించబడిన బ్రాక్ ఇప్పుడు 17 దేశాలలో పని చేస్తోంది.  100 మిలియన్లకు పైగా ప్రజలతో భాగస్వామ్యం కలిగి ఉంది, ఖర్చుతో కూడుకున్న, సాక్ష్య ఆధారిత మద్దతు కలిగిన జోక్యాలను అందిస్తుంది. అటువంటి వాటిలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన "గ్రాడ్యుయేషన్ విధానం", దీనిని ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు చేపట్టాయి. సానుకూల ఫలితాలతో విస్తృతంగా మూల్యాంకనం చేశాయి.

***


(Release ID: 2002397) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Hindi