నౌకారవాణా మంత్రిత్వ శాఖ

డిజిట‌లైజేష‌న్ ద్వారా భార‌త మారిటైం కార్య‌క‌లాపాల‌ను ప‌రివ‌ర్త‌న చేసేందుకు సాగ‌ర్‌సేతు (ఎన్ఎల్‌పి -మెరైన్‌)లో మారిటైం సింగిల్ విండో, ఎంఎండి మాడ్యూళ్ళ‌ను గురువారం ప్రారంభించినున్న శ్రీ సోనోవాల్


ఐటిని ఉప‌యోగించ‌డం ద్వారా లాజిస్టిక్స్ స‌మాజంలోని భాగ‌స్వాములంద‌రినీ అనుసంధానం చేసేందుకు వ‌న్‌స్టాప్ (ఏక అనుమ‌తి) వేదిక ఎన్ఎల్‌పి మెరైన్‌

Posted On: 31 JAN 2024 5:18PM by PIB Hyderabad

సాగ‌ర్ సేతు (ఎన్ఎల్‌పి) ప్లాట్‌ఫాంపై మారిటైం సింగిల్  విండో (ఎంఎస్‌డ‌బ్ల్యు - స‌ముద్ర‌/ నావికా సంబంధ ఏక‌గ‌వాక్షం) , మెర్కెంటైల్ మారిటైం డిపార్ట్‌మెంట్ (ఎంఎండి- నావికాద‌ళ వాణిజ్య విభాగం) అనే రెండు అత్యాధునిక మాడ్యూళ్ళ‌ను కేంద్ర ఓడ‌రేవులు, షిప్పింగ్‌, జ‌ల‌మార్గాల శ్రీ స‌ర్బానంద్ సోనోవాల్ ప్రారంభించ‌నున్నారు. దేశంలో మ‌రింత ఆధునిక‌మైన‌, క్ర‌మ‌బ‌ద్ధీక‌రించిన స‌ముద్ర‌తీర ప‌రిదృశ్యం దిశ‌గా గ‌ణ‌నీయ పురోగ‌తికి ప్ర‌తీక‌గా గురువారం ఇక్క‌డ ప్రారంభ వేడుక జ‌రుగ‌నుంది.   
సాగ‌ర్ సేతు (ఎన్ఎల్‌పి-ఎం)లోని మారిటైం సింగిల్ విండో (ఎంఎస్‌డ‌బ్ల్యు) అన్న డిజిట‌ల్ వేదిక లేదా వ్య‌వ‌స్థ  అంత‌ర్జాతీయ నావికా వాణిజ్యంలో నిమ‌గ్న‌మైన‌ ప్ర‌భుత్వ అధికారులు, రేవుల నిర్వాహ‌కులు, భాగ‌స్వాములు  ప‌ముద్ర‌/  నావికా సంబంధ స‌మాచారం, ప‌త్రాల ఎల‌క్ట్రానిక్ స‌మ‌ర్ప‌ణ‌, ప్రాసెసింగ్‌, ఇచ్చిపుచ్చుకునేందుకు తోడ్ప‌డ‌నుంది. ఈ మాడ్యూల్‌ను డైరెక్టొరేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ షిప్పింగ్ అధికారి, షిప్పింగ్ ఏజెంట్లు, వాణిజ్య సంఘాలు, అన్న ప్ర‌ధాన రేవుల రేవు అధికారితో విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు.
 సాగ‌ర్ సేతు (ఎన్ఎల్‌పి- ఎం) లో డిజిట‌ల్ వేదిక అయిన‌ మెర్కంటైల్ మారిటైం డిపార్ట్‌మెంట్ (ఎంఎండి) నౌక నిర్బంధం లేక నిలుపుద‌ల‌, నౌక విడుద‌ల స్థితి స‌మాచారాన్ని అందిస్తుంది. ఎంఎండి మాడ్యూల్ అన్న‌ది నౌకా స‌ర్వేక్ష‌ణ‌ స‌మాచారాన్ని సాగ‌ర్‌సేత వేదిక‌పై పంచుకునేందుకు తోడ్ప‌డుతుంది. 
మారిటైం రంగాన్ని భ‌విష్య‌త్‌లోకి తీసుకువెళ్ళేందుకు రేవులు, షిప్పింగ్‌, జ‌ల‌మార్గాల మంత్రిత్వ శాఖ చేప‌ట్టిన విస్త్ర‌త డిజిట‌ల్ చొర‌వ‌ల్లో ఈ మాడ్యూళ్ళు భాగం.

***



(Release ID: 2001128) Visitor Counter : 65


Read this release in: English , Urdu , Hindi , Tamil