కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సి-డాట్‌ను సందర్శించిన రక్షణ, పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్
దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతల, ఉత్పత్తిని ఆయనకు ప్రదర్శించిన సి-డాట్
టెలికాం వ్యాప్తి, టెలికాం భద్రతా రంగాలలో అద్భుతమైన పని చేస్తున్న సి-డాట్ అన్న శ్రీ భట్
Posted On:
30 JAN 2024 12:20PM by PIB Hyderabad
రక్షణ& పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ సోమవారంనాడు ఢిల్లీ క్యాంపస్‌లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్)ను సందర్శించారు. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగపు అగ్ర టెలికాం ఆర్&డి కేంద్రం సి-డాట్. అది రక్షణ కమ్యూనికేషన్లు & సైబర్ భద్రతకు అవసరమైన కీలక మౌలిక సదుపాయాలకు అవసరమైన దేశీయ, సురక్షిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు చురుకుగా పని చేస్తోంది.
ఈ సందర్భంగా రక్షణ & పర్యాటక మంత్రిత్వ శాఖల సహాయమంత్రి శ్రీ అజయ్‌భట్ సి-డాట్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం, విభిన్న టెలికాం ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో / పరిష్కారాలు, భద్రతా నిర్వహణ కేంద్రం (నెట్‌వర్క్‌లో మాల్‌వేర్‌ను నిజ-సమయంలో గుర్తించేందుకు), వ్యవస్థ భద్రతా కేంద్రం (చరమాంశాలను ఆవరిస్తూ సంస్థాగత స్థాయిలో హానికరమైన బెదిరింపులను దాడులను నిజ సమయంలో గుర్తించి, తగ్గించడం), క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ పై సందర్శించిన గౌరవఅతిధికి సి-డాట్ సిఇఒ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ వివరణాత్మక ప్రెజెంటేషన్‌ను అందించారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన 4జి కోర్ & 4జి రాన్, 5జి కోర్ & 5జి రాన్, విపత్తు నిర్వహణ పరిష్కారం, సెల్ ప్రసార కేంద్రం, ఆప్టికల్ రవాణా & పరిష్కారం అందుబాటు, దిశను మార్చడం & రూటింగ్ పరిష్కారాలు, తదితరాలను కూడా ప్రదర్శించారు.
దీని అనంతరం, సి-డాట్ వీడియో కాన్ఫరెన్సింగ్ (విసి) పరిష్కారాలు & దేశీయంగా అభివృద్ధి చేసిన మెస్సేజింగ్ & సెల్ వేదిక సంవాద్, పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ, విపత్తు నిర్వహణ సిఎంపి(సామాన్య ప్రొటోకాల్ అప్రమత్తత) & వ్యవస్థ భద్రతా నిర్వహణ కేంద్రం (ఇఎస్ఒసి), డిడబ్ల్యుడిఎం & ఒటిఎన్ లాబ్, క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకెడి), జిపిఒఎన్/ ఎన్ఎంఎస్, 4జి/ 5జి ప్రయోగశాల, ఇ-శిక్ష & సిఎస్ఎటి-ఫైలాబ్, టెలికాం భద్రతా నిర్వహణ కేంద్రం & 5జి ప్రదర్శన జరిగాయి.
ఢిల్లీ కాంపస్‌లోని సి-డిటియన్లను, ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొన్న బెంగళూరుకు చెందిన సి-డాట్ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ & పర్యాటక శాఖల సహాయమంత్రి శ్రీ అజయ్‌భట్ ప్రసంగించారు.
అది అంతర్దృష్టితో కూడిన సంభాషణ, పరస్పర చర్య. రక్షణ రంగంలో టెలికాం గొప్ప పాత్రను పోషిస్తుంది. సి-డాట్‌కు, భారత రక్షణ దళాల మధ్య అనేక రంగాలలో సహకరించుకునే అవకాశాలను నేను చూస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. రక్షణ స్వదేశీకరణలో సి-డాట్ భాగమై, రక్షణ రంగంలో టెలికాం & సైబర్‌సెక్యూరిటీలో పరివర్తన తేవడంలో గొప్ప పాత్ర పోషించవచ్చని అన్నారు. రక్షణ రంగానికి ప్రత్యేకంగా సరిపోయే సురక్షిత పరిష్కారాలు, సాంకేతికతల అభివృద్ధి కోసం సి-డాట్ - రక్షణ దళాల మధ్య మరింత సహకారం కోసం శ్రీ అజయ్‌భట్ జీ పిలుపిచ్చారు.
తన విలువైన మార్గదర్శనాన్ని ఇచ్చి, సి-డాట్ ఇంజినీర్లకు ప్రేరణ కలిగించినందుకు రక్షణ సహాయమంత్రికి సి-డాట్ సిఇఒ డాక్టర్ ఉపాధ్యాయ కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ రంగం కోసం అనుకూలించిన అత్యాధునిక టెలికాం భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయాలన్న నిబద్ధతకు సి-డాట్ కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
రక్షణ & పర్యాటక సహాయ మంత్రి శ్రీ అజయ్‌భట్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, సి-డాట్ టెలికమ్యూనికేషన్ల సైబర్ భద్రత నెట్‌వర్క్‌లు సహా టెలికమ్యూనికేషన్ల రంగంలోని అన్ని అంశాలలో అద్భుతమైన పని చేసిందని, దానిని కొనసాగిస్తోందని అన్నారు. సి-డాట్, రక్షణ ఏజెన్సీలు కలిసి పని చేసే గొప్ప భవిష్యత్తును నేను దర్శిస్తున్నాను. సి-డాట్ భవిష్యత్ కృషికి నా శుభాభినందనలు చెప్తున్నాను అన్నారు. పాంకేతిక పురోగతిలో & దాని వినియోగంలో 2047 నాటికి భారత్ విశ్వగురువు అవుతుందన్నారు. పౌర & రక్షణ వినియోగానికి అత్యాధునిక సాంకేతికతలను అమలు చేయడంలో సి-డాట్ కు కీలక పాత్ర ఉంటుందన్నారు.
సి-డాట్ దేశానికి అత్యున్నత సేవ చేస్తోంది. సి-డాట్ తన అన్ని ప్రయత్నాలలో సఫలం కావాలని శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
ఢిల్లీ క్యాంపస్‌లో రక్షణ, పర్యాటక సహాయ మంత్రి శ్రీ అజయ్‌భట్‌ని ఆహ్వానిస్తున్నసి-డాట్
మొక్కలు నాటుతున్న రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్‌భట్
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రయోగశాల సందర్శన
పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ (పిక్యూసి) ప్రయోగశాల సందర్శన
పిఎం- వాణి (ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్) ప్రయోగశాల పర్యటన
ప్రయోగశాల సందర్శన సందర్భంగా ప్రదర్శన
సి-డాటియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్
సి-డాట్ కుటుంబంతో రక్షణ, పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్‌భట్
***
(Release ID: 2000618)
Visitor Counter : 163