విద్యుత్తు మంత్రిత్వ శాఖ
2024లో భారతదేశంలో ఎన్‌టిపిసి లిమిటెడ్‌ను అగ్రశ్రేణి యజమానిగా సంస్థ గుర్తించి, ధ్రువీకరించిన టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్
Posted On:
29 JAN 2024 11:48AM by PIB Hyderabad
టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ ప్రకటించే అగ్ర యజమానుల జాబితా వెలువడింది. 2024లో భారతదేశంలో ఎన్‌టిపిసి లిమిటెడ్‌ను అగ్రశ్రేణి యజమానిగా సంస్థ గుర్తించి, ధ్రువీకరించింది. ఈ ధ్రువీకరణ కోసం అవసరమైన దిగువ అంశాలను ఎన్‌టిపిసి పూర్తి చేసింది - హెచ్ఆర్ ఉత్తమ ఆచరణ సర్వే, ధ్రువీకరణ, ఆడిట్. ఎన్‌టిపిసి పనితీరు స్కోరును అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి రేట్ చేయడం జరిగింది. ఇందులో ఎన్‌టిపిసి అగ్ర ఎంప్లాయర్ హోదాను సాధించింది.
హెచ్ఆర్ ఉత్తమ ఆచరణ సర్వేలో ఆరు హెచ్ ఆర్ రంగాలు ఉంటాయి. ఇందులో ప్రజా వ్యూహం, పని వాతావరణం, ప్రతిభ అధిగ్రహణం, అభ్యాసం, భిన్నత్వం, సమానత & కలుపుకుపోవడం, సంక్షేమం సహా మరిన్ని 20 అంశాలు ఉంటాయి.
సర్వే అంతర్జాతీయ ప్రమాణం పై ఆధారపడి ఉంటుంది కనుక, ప్రపంచవ్యాప్తంగా వర్తించే ఉత్తమ ఆచరణ ఆధారంగా పాలుపంచుకునేవారిని అంచనా వేస్తారు. ఈ ప్రక్రియలో ధ్రువీకరణ, కఠినమైన మూల్యాంకనపు వివిధ దశలు ఉంటాయి. పాల్గొనేవారు తప్పనిసరిగా సర్టిఫికేషన్ ప్రక్రియలో వివిధ దశలను విజయవంతంగా పూర్తి చేసి, అధికారిక అగ్ర యజమానిగా సర్టిఫికేషన్‌కు అవసరమైన స్కోరును సాధించాలి.
జనవరి 25, 2024న సింగపూర్‌లో జరిగిన అగ్ర ఎంప్లాయర్స్ 2024 సర్టిఫికేషన్ వేడుక కార్యక్రమంలో ఎన్‌టిపిసి తరుఫున డైరెక్టర్ (హెచ్ఆర్) శ్రీ దిలీప్ కుమార్ పటేల్ ఈ అవార్డును అందుకున్నారు.
టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ అనేది హెచ్ ఆర్ ఉత్తమ ఆచరణలలో శ్రేష్ఠతను ధ్రువీకరించే ప్రపంచ హెచ్ఆర్ ప్రాధికరణ సంస్థ. దాదాపు 33 సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర ఎంప్లాయర్ల ధ్రువీకరణ, కొలమానాలు, సమలేఖనం, అనుసంధానం చేయడం ద్వారా పని ప్రపంచాన్ని సుసంపన్నం చేసే హెచ్ఆర్ వ్యూహాల ప్రభావాన్ని వేగవంతం చేసేందుకు అంకితభావంతో పని చేస్తోంది.
ఒక అగ్రశ్రేణి యజమానిగా సర్టిఫికెట్ పొందడం వల్ల మెరుగైన పని ప్రపంచం పట్ల ఎన్‌టిపిసి అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. ఇది పీపుల్ బిఫోర్ పిఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) విధానం, పురోగామి హెచ్ార్ విధానాలు, సానుకూల సంస్థాగత ఫలితాలు, మెరుగైన ఉద్యోగుల నిమగ్నత, సంస్థాగత దృష్టిని వాస్తవీకరించి, సృష్టించే వ్యక్తుల ఆచరణల ద్వారా ప్రదర్శితమై, ఫలితాలు సాధించారు. .
****
(Release ID: 2000387)
Visitor Counter : 135