ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారత్, ఒమన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
24 JAN 2024 6:07PM by PIB Hyderabad
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారత్, ఒమన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారంపై భారత్, ఒమన్ దేశాల మధ్య 2023 డిసెంబర్ 15 న ఒప్పందం కుదిరింది. ఒప్పందం వివరాలను మంత్రివర్గ సమావేశానికి వివరించారు. అవగాహన ఒప్పందంపై కుదిరిన అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారం పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఒమన్ సుల్తానేట్ కు చెందిన రవాణా, కమ్యూనికేషన్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, పెట్టుబడుల ద్వారా ఇరు దేశాల మధ్య సమగ్ర సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఎంవోయూ దోహదపడుతుంది.
రెండు దేశాలు సంతకాలు చేసిన రోజు నుంచి 3 సంవత్సరాల పాటు ఒప్పందం అమలులో ఉంటుంది. ఒప్పందం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జీ2జీ, బీ2బీ ద్వైపాక్షిక సహకారం మరింత పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలకు దారితీసే మెరుగైన సహకారానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది.
నేపథ్యం:
ఇన్ఫర్మేషన్ , కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అంతర్జాతీయ అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా ఐసిటి రంగంలో ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ అనేక దేశాలు, బహుళపక్ష సంస్థలతో కలిసి కార్యక్రమాలు అమలు చేస్తోంది.
ఇటీవల కాలంలో ఐసిటి రంగంలో సహకారం , సమాచార మార్పిడి ప్రోత్సహించడానికి వివిధ దేశాలకు చెందిన దాని అనుబంధ సంస్థలు / ఏజెన్సీలతో మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాలు/ ఒప్పందాలు కుదుర్చుకుంది భారతదేశాన్ని డిజిటల్ సాధికారిత దేశంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న .డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి వివిధ కార్యక్రమాలకు అనుగుణంగా ఒప్పందాలు కుదిరాయి. మారుతున్నపరిస్థితుల నేపథ్యంలో దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో వ్యాపార అవకాశాలను అన్వేషించడం, ఉత్తమ పద్ధతులు పంచుకోవడం, డిజిటల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా మంత్రిత్వ శాఖ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
***
(Release ID: 1999259)
Visitor Counter : 165