భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పిఎల్ఐ ఏసిసి పథకం కింద 10 GWh సామర్థ్యంతో గిగా-స్కేల్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్డర్ల ఎంపిక కోసం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించిన ఎంహెచ్ఐ


సిపీపీ పోర్టల్ ద్వారా క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (QCBS) విధానంలో ఆన్‌లైన్‌లో పారదర్శక రెండు-దశల ప్రక్రియ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ

నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో టెండర్ పత్రాలు; బిడ్ గడువు తేదీ2024 ఏప్రిల్ 22, బిడ్లు 2024 ఏప్రిల్ 4న తెరుస్తారు

భారతదేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ కణాల తయారీని ప్రోత్సహిస్తున్న పిఎల్ఐ ఏసిసి పథకం

Posted On: 24 JAN 2024 2:17PM by PIB Hyderabad

పిఎల్ఐ ఏసిసి  పథకం కింద 10 GWh సామర్థ్యంతో  గిగా-స్కేల్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి బిడ్డర్ల ఎంపిక కోసం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఐ) 24/01/2024 న  అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించింది. దేశంలో ఏసిసి ఉత్పత్తి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు తమ బిడ్‌లను సమర్పించాలని మంత్రిత్వ శాఖ కోరింది. దీనివల్ల పిఎల్ఐ ఏసిసి పథకం ప్రయోజనాలు పొందడానికి వారు అర్హత సాధిస్తారు. సిపీపీ  పోర్టల్ ద్వారా క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ (QCBS) విధానంలో ఆన్‌లైన్‌లో  పారదర్శక రెండు-దశల ప్రక్రియ ద్వారా బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది. 

టెండర్ పత్రాలు 24/01/2024 నుంచి అందుబాటులోఉంటాయి.  ప్రీ-బిడ్ సమావేశం  12/02/2024న జరుగుతుంది.  22/04/2024 వరకు బిడ్లు స్వీకరిస్తారు. పరిశీలన కోసం  బిడ్‌లు 23/04/2024న తెరుస్తారు. 

 దేశంలో క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ అనే మూడు రంగాల అభివృద్ధికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా చర్యలు అమలు జరుగుతున్నాయి. దేశంలో  శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం ద్వారా  వాహన ఉద్గారాల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో  ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ (FAME-II) పథకం కింద  స్వచ్ఛమైన, హరిత  ప్రజా రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా కేంద్ర  ప్రభుత్వం  చర్యలు  అమలు చేస్తోంది.పిఎల్ఐ  ఆటో మరియు ఆటో కాంపోనెంట్స్ పథకం కింద దేశంలో ఆటోమొబైల్ ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ చేసి ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది.   అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తుల రంగంలో స్వదేశీ ఉత్పత్తులను,ప్రోత్సహించి, విలువ ఆధారిత గొలుసు ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. 

  ఆటోమొబైల్ మరియు ఆటోమొబైల్ పరికరాల రంగంలో  ఉత్పాదక సామర్థ్యం పెంపొందించి  ఎగుమతుల అభివృద్ధికి తమ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా భారీ పరిశ్రమల రంగంలో  స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించి,అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత  భారత్) నిర్మాణం కోసం కృషి జరుగుతుందని ఆయన తెలిపారు.  శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన విధంగా  2070 నాటికి దేశాన్నిఉద్గార రహిత దేశంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు. లక్ష్య సాధనలో భాగంగా  ఇటీవల కాలంలో ఆటోమోటివ్ రంగంలో  పర్యావరణ హిత  ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి  భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పిఎల్ఐ -ఆటో,  పిఎల్ఐ - అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్, ఫేమ్ -II వంటి పథకాలు  అనేక కార్యక్రమాలు చేపట్టింది.

మే 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఏసిసి కింద  రూ. 18,100 కోట్ల రూపాయల పెట్టుబడితో  యాభై (50) గిగా వాట్ గంటల (GWh) ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించడం కోసం 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్' కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.  సాంకేతిక  మొదటి రౌండ్ మార్చి 2022 లో ముగిసింది.  మూడు కంపెనీలకు మొత్తం 30 (30) గిగా వాట్ గంటల (GWh) సామర్థ్యం సామర్థ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది.  ఎంపిక చేసిన కంపెనీలతో ప్రభుత్వం 2022 జూలై లో ఒప్పందంపై సంతకం చేసింది. 

తాజాగా  బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సహ పథకం( పిఎల్ఐ)  కింద  'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్' కోసం  బిడ్డర్‌లను గుర్తించి, ఎంపిక చేయడానికి  ఎంపిక కోసం ప్రతిపాదన (RfP) కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. . 10 గిగా వాట్ అవర్ (GWh) మొత్తం తయారీ సామర్థ్యంతో గరిష్ట బడ్జెట్ వ్యయం రూ.3,620 కోట్లుగా నిర్ణయించారు. 

 

****



(Release ID: 1999122) Visitor Counter : 112


Read this release in: English , Urdu , Hindi