సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అయోధ్యలో దేశీయ మొబైల్ ఆసుపత్రి (భీష్మ్) మోహరింపు/ ఏర్పాటు
Posted On:
21 JAN 2024 4:44PM by PIB Hyderabad
రానున్న ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం సందర్భంగా వైద్య సంసిద్ధతను, ప్రతిస్పందన సామర్ధ్యాలను పెంచేందుకు అయోధ్యలో అత్యాధునికత సాంకేతిక కలిగిన రెండు విప్లవాత్మక మొబైల్ ఆసుపత్రులు - ఆరోగ్య మైత్రి విపత్తు నిర్వహణ క్యూబ్- భీష్మ్‌ని మోహరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 22 జనవరి 2024న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యను సందర్శించనున్నారు. దాదాపు 8,000మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు.
తక్షణ ప్రతిస్పందన, సమగ్ర సంరక్షణ పై దృష్టి పెట్టి దాదాపు 200మందిప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి చికిత్సను అందించేందుకు ఉద్దేశించిన విస్త్రత చొరవ ప్రాజెక్ట్ భీష్మ్- భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రిలో ఈ క్యూబ్ ఒక భాగం. అత్యవసర సమయాల్లో విపత్తు ప్రతిస్పందన, వైద్య సహాయాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన అనేక వినూత్న సాధనాలతో ఈ సహాయ క్యూబ్‌లో అమర్చారు. వైద్య సేవల రంగంలో ప్రభావవంతమైన సమన్వయం, నిజ- సమయ పర్యవేక్షణ, సమర్ధవంతమైన నిర్వహణను సులభతరం చేసేందుకు ఇది కృత్రిమ మేధస్సు (ఎఐ), డేటా విశ్లేషణలను అనుసంధానిస్తుంది.
మొత్తం యూనిట్‌లో 72 తేలికగా రవాణా చేయదగ్గ భాగాలు ఉంటాయి. వాటిని చేతితో, సైకిల్ లేదా డ్రోన్ ద్వారా అయినా సౌకర్యవంతంగా, తిరుగులేనంత సరళంగా ఉంటాయి. సామూహిక ప్రాణ నష్ట సంఘటనల (ఎంసిఐ)ల నేపథ్యంలో, ప్రాథమిక చికిత్స, సహాయం నుంచి అత్యాధునిక వైద్య, శస్త్రచికిత్స సంరక్షణ వరకు ఉండే అవసరాలను నెరవేర్చేందుకు 12 నిమిషాల్లో అక్కడకు హాజరుకాగల ప్రత్యేక సామర్ధ్యంతో నిలుస్తుంది. అత్యంత వేగంగా, తక్షణం హాజరుకాగల సామర్ధ్యం అత్యంత కీలకం. ఎందుకంటే, ఇది ప్రాథమిక సంరక్షణ, చికిత్స నుంచి ఖచ్చితమైన చికిత్స, సంరక్షణ వరకు కీలకమైన సమయ వ్యత్యాసాన్ని సమర్ధవంతంగా అందించి, అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను రక్షించగల సంభావ్యతను కలిగి ఉంది.
ఈ క్యూబ్‌లు దృఢమైనవి, జలనిరోధితమైనవి, తేలికైనవి. వీటిని పలు విన్యాసాల కోసం రూపొందించారు. తద్వారా భిన్న అత్యవసర పరిస్థితులకు అత్యంత అనుకూలమైనవి, అనువైనవి. విమానం/ హెలికాప్టర్ ద్వారా రవాణా నుంచి భూరవాణావరకు, క్యూబ్‌ను ఎక్కడైనా వేగవంతంగా అమర్చి, తక్షణ ప్రతిస్పందన సామర్ధ్యాన్ని నిర్ధారించవచ్చు.
అత్యాధునిక వైద్య పరికరాలు, సమర్ధవంతమైన రీప్యాకింగ్, పునర్వినియోగం కోసం ఆర్ఎఫ్ఐడి- ట్యాగ్ చేయడం అన్నది ఈ క్యూబ్ కీలక లక్షణం. ఆపరేటర్లకు ఇచ్చిన అత్యాధునాతన భీష్మ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను అమర్చిన టాబ్లెట్ వేగంగా అంశాలను గుర్తించేందుకు, వాటి వినయోగాన్ని, గడువును పర్యవేక్షించడానికి, తదుపరి మోహరింపుకు సంసిద్ధతను నిర్ధారించడానికి అనుమతిస్తుంది.
***
(Release ID: 1998525)
Visitor Counter : 230