సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

పరాక్రమ్ దివస్ 2024 సంస్మరణ: చరిత్ర, సాంస్కృతిక గొప్పదనం ప్రదర్శించే విధంగా ఎర్రకోట వద్ద కార్యక్రమాలు


జనవరి 23న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

Posted On: 21 JAN 2024 12:44PM by PIB Hyderabad

పరాక్రమ్ దివస్ 2024 సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద  చరిత్ర, సాంస్కృతిక గొప్పదనం ప్రదర్శించే విధంగా  ఎర్రకోట వద్ద కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  జనవరి 23వ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  పరాక్రమ్ దివస్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  జనవరి 31 వ తేదీ వరకు ఈ వేడుక జరుగుతుంది. 

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సాహిత్య అకాడమీ, నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వంటి అనుబంధ సంస్థల సహకారంతో కేంద్ర  సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  కార్యక్రమాలు జరుగుతాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ల గాఢ వారసత్వాన్ని వెలికితీసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్రలో ఎర్రకోట కీలక పాత్ర పోషించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఐఎన్ఏ వారసత్వాన్ని భావి తరాలకు తెలియజేయడానికి,  గౌరవించడానికి ఎర్రకోట లోపల ఒక మ్యూజియం ఏర్పాటు అయ్యింది. మ్యూజియంను   నేతాజీ జన్మదినోత్సం రోజున  2019 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రారంభించారు. కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, కల్నల్ షానవాజ్ ఖాన్ పేర్లు  ఎర్రకోట వద్ద   చరిత్రలో  కీలక వ్యక్తులుగా లిఖించారు.  భారతదేశ స్వాతంత్ర్యం కోసం వారు పోరాటం సాగించారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిపై ఎర్రకోట బ్యారక్స్ కేసు నమోదు చేసింది.  కేసులకు వెరవకుండా ఆజాద్ హింద్ ఫౌజ్  అచంచల దీక్షతో  స్వాతంత్ర్యం కోసం వారు పోరాటం సాగించింది. 

పరాక్రమ్ దివస్ 2024 సందర్భంగా  చరిత్ర, కళల మేళవింపు చేసి  ధైర్యసాహసాలు, త్యాగాల కథలు ఇతివృత్తంగా ఎర్రకోట వద్ద    నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) కళాకారులు వేదికపై ప్రదర్శనలు ఇస్తారు.ఇండియన్ ఆర్మీ లో పనిచేసి వారిని స్మరిస్తూ ప్రదర్శనలు జరుగుతాయి. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ల చరిత్ర  తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, పత్రాలు ప్రదర్శిస్తూ  ఎర్రకోట వద్ద ఆర్కైవ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది.  పెయింటింగ్ , శిల్ప వర్క్ షాప్ లు ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఆర్ , విఆర్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.   

ఈ కార్యక్రమం సందర్శకులకు ప్రవేశం ఉచితం.
  పరాక్రమ్ దివస్   
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం 2021 నుంచి ఏటా పరాక్రమ్ దివస్    నిర్వహిస్తున్నారు. 2021లో కలకత్తా  విక్టోరియా మెమోరియల్ హాల్ లో  ప్రారంభోత్సవం జరిగింది. 2022 లో ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. , 2023లో అండమాన్ నికోబార్ దీవుల్లో 21 అతిపెద్ద ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టడంతో పాటు నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక నమూనాను ఆవిష్కరించారు.
    పరాక్రమ్ దివస్ 2024 లో భాగంగా  గణతంత్ర దినోత్సవం పరేడ్ లో దేశ  వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన 'భారత్ పర్వ్' శకటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.  జనవరి 23 నుంచి 31 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే పరాక్రమ్ దివస్ 2024 లో 26 మంత్రిత్వ శాఖలు, విభాగాలు పౌర కేంద్రీకృత కార్యక్రమాలు, వోకల్ ఫర్ లోకల్, విభిన్న పర్యాటక ఆకర్షణలను ప్రదర్శిస్తాయి. కార్యక్రమం రాంలీలా మైదానం, ఎర్రకోట వద్ద ఉన్న మాధవ దాస్ పార్క్ లో జరుగుతుంది.  

***

 



(Release ID: 1998522) Visitor Counter : 119