సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ఎన్‌సిజిజిలో విజయవంతంగా పూర్తయిన జమ్మూ కాశ్మీర్ పౌర సేవకుల 8వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం


శిక్షణను పూర్తి చేసిన 38వ సీనియర్ అధికారులు; ఎన్‌సిజిజి ద్వారా జమ్ముకాశ్మీర్‌ నుండి ఇప్పటివరకూ శిక్షణ పొందిన 318 మంది అధికారులు

పాలనలో జె&కె అమలు చేస్తున్న డిజిటల్ విధానాలను ప్రశంసించిన ఎన్‌సిజిజి డీజీ శ్రీ వి. శ్రీనివాస్

Posted On: 20 JAN 2024 2:54PM by PIB Hyderabad

జమ్మూ & కాశ్మీర్‌లోని 38 మంది సీనియర్ అధికారుల కోసం నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సిజిజి)  చేపట్టిన 8వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ జనవరి 19, 2024న ముగిసింది. ఈ రెండు వారాల కార్యక్రమం ఎన్‌సిజిజిచే నిశితంగా రూపొందించబడింది. ఇందులో ప్రధానంగా సమాచారం, పరిజ్ఞానం, మార్పిడిపై దృష్టి సారించింది. మరియు ఈ ప్రాంతంలో పౌర-కేంద్రీకృత పాలనను మెరుగుపరచడానికి వినూత్న పాలనా పద్ధతులును రూపొందించింది.

 

image.png


ఈ కార్యక్రమానికి నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ వి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో గతకొన్నేళ్లుగా పౌరులకు అవాంతరాలులేని మరియు పారదర్శకమైన పాలన అందించిన డిజిటల్ మార్పులను ఆయన హైలైట్ చేశారు. ఇ-ఉన్నత్ పోర్టల్ కింద 1080 ఇ-సేవలు లోయలో  గణనీయమైన పురోగతిని సాధించాయని దీని ఫలితంగా  సుదూర ప్రాంతాలను డిజిటల్ పురోగతితో అనుసంధానించడం ద్వారా ప్రజలు గణనీయమైన పురోగతి సాధించారని ఆయన పేర్కొన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్, ఇ-ఉన్నాత్: జమ్మూ కాశ్మీర్‌లో సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి స్కిల్ ఇండియా మిషన్: యూత్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మరియు ఇ-ఆఫీస్ వంటి అంశాలపై జమ్మూ కాశ్మీర్ అధికారులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పురోగతులను అంచనా వేస్తూ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద గుర్తించదగిన అభివృద్ధిని శ్రీ వి.శ్రీనివాస్ నొక్కి చెప్పారు.

 

image.png


అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏపీ.సింగ్ అధికారుల రెండు వారాల ప్రయాణాన్ని క్లుప్తంగా హైలైట్ చేశారు. భూసేకరణ, పరిహారం మరియు పునరావాసం, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే విధానం, ప్రభుత్వంలో కృత్రిమ మేధస్సు, లింగసమానత్వం మరియు అభివృద్ధి: విధానాలు మరియు పద్ధతులు, ప్రభుత్వం నుండి పాలన: కొత్త పబ్లిక్ మేనేజ్‌మెంట్, పాలన యొక్క నమూనాను మార్చడం, వాతావరణ మార్పు మరియు జీవవైవిధ్యంపై దాని ప్రభావం: విధానాలు మరియు ప్రపంచ పద్ధతులు,జీఇఎం: ప్రభుత్వ సేకరణలో పారదర్శకతను తీసుకురావడం, విపత్తు పాలనలో సాంకేతికతను పెంచడం, ఆకాంక్షాత్మక జిల్లా కార్యక్రమం, డిజిటల్ పాలన మరియు ప్రజా సేవల పంపిణీ, నైపుణ్యం భారతదేశం: విధానం మరియు అభ్యాసాలు, ఆయుష్మాన్ భారత్: ఆరోగ్య భరోసా పౌరులకు భద్రత, స్వామిత్వ: ల్యాండ్ రికార్డ్ మేనేజ్‌మెంట్, సర్క్యులర్ ఎకానమీ, విజిలెన్స్ అడ్మినిస్ట్రేషన్, భారతదేశంలో గ్రామీణ పారిశుధ్యం, ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మరియు మానిటరింగ్- జల్ జీవన్ మిషన్, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో పాటు భారత పార్లమెంట్ మరియు పీఎం సంగ్రాలయకు ఎక్స్‌పోజర్ సందర్శనపై సంక్షిప్త అంశాలను ఆయన పంచుకున్నారు.

జె&కెకు సంబంధించిన 8వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్  మొత్తం పర్యవేక్షణ మరియు సమన్వయాన్ని డాక్టర్ ఏపీ సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు కోర్స్ కోఆర్డినేటర్ ఎన్‌సిజిజి డాక్టర్ ముఖేష్ భండారి, అసోసియేట్ కోర్స్ కోఆర్డినేటర్, ఎన్‌సిజిజిమరియు శ్రీ సంజయ్ దత్ పంత్ నిర్వహించారు.

భారత ప్రభుత్వంచే 2014లో స్థాపించబడిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, భారతదేశం మరియు ఇతర దేశాల  పౌర సేవకులకు శిక్షణను ఇస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో కేంద్రం తన శిక్షణా కార్యక్రమాలను బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, కంబోడియా, సీషెల్స్, నేపాల్ మరియు మయన్మార్‌లతో సహా వివిధ దేశాల అధికారులకు విస్తరించింది. ఎన్‌సిజిజి వివిధ శిక్షణా కార్యక్రమాల క్రింద 4500 మందికి పైగా అధికారులకు విజయవంతంగా శిక్షణను అందించింది.

 

image.png

***


(Release ID: 1998277) Visitor Counter : 90


Read this release in: English , Urdu , Hindi