శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐఐఎస్ఎఫ్ 2023 లో ఆకట్టుకున్న సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్
Posted On:
20 JAN 2024 4:27PM by PIB Hyderabad
హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో "సైన్స్ సిటీ"ని అభివృద్ధి చేస్తామని హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.గ్రాండ్ అబ్దుల్ కలాం హాల్ లో జరిగిన ఐఐఎస్‌ఎఫ్ ముగింపు వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రశంసనీయమైన ఆవిష్కరణలు ప్రదర్శించైనా మెగా సైన్స్ ఎక్స్‌పోను శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ సందర్శించారు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్ ) 2023 లో భాగంగా నిర్వహిస్తున్న మెగా ఎక్స్‌పోను కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభోత్సవం రోజున సందర్శించారు.
ఎక్స్‌పోలో 100కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. , 20 స్టాల్స్ ప్రైవేట్ సంస్థలకు చెందినవి కాగా, 80కి పైగా స్టాల్స్ ప్రభుత్వ సంస్థలకు చెందినవి. ప్రదర్శనను సుమారు 1 లక్ష మంది సందర్శకులు సందర్శించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ దాని స్వయంప్రతిపత్తి సంస్థలు ప్రదర్శనలో శాస్త్రీయ ఆవిష్కరణలు, ఆవిష్కరణలను ఏర్పాటు చేశాయి.
'అమృత కాలంలో ప్రజలకు చేరువ కావడం' ఇతివృత్తంతో సాగిన ఐఐఎస్ఎఫ్ లక్ష్యానికి అనుగుణంగా
ప్రదర్శనలు ఏర్పాటు అయ్యాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం సాధించిన పురోగతి ప్రతిబింబించే విధంగా ప్రదర్శన ఏర్పాటయింది. శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి సాదించేందుకు ఉన్న అవకాశాలు, మార్గాలను ప్రదర్శన తెలిపింది.
2024 జనవరి 22న ప్రారంభం కానున్న రామ్ మందిర్ మోడల్ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. స్మారక చిహ్నం శాస్త్రీయ నైపుణ్యాన్ని వివరిస్తూ “సూర్య తిలక్”తో సహా ప్రత్యేకమైన డిజైన్‌ను ఉత్తరాఖండ్‌లోని రూర్కీ కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎస్ఆర్ఐ) రూపొందించింది.
ఎక్స్‌పోలో "కాలుష్య రహిత వికసిత గ్రామం, వికసిత భారత్' మరో ఆకర్షణగా నిలిచింది. దేశ పురోగతికి దోహదపడే స్థిరమైన, అభివృద్ధి చెందిన గ్రామీణ వాతావరణంతో సిఎస్ఆర్ఐ దీనిని ప్రదర్శించింది.
స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ (NIPGR), డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) జీవ శాస్త్రంపై ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ప్రదర్శనలో అధిక నాణ్యత గల మొక్కలపై జరుగుతున్న జీవశాస్త్ర పరిశోధనలు, తదుపరి తరం మొక్కల అభివృద్ధిలో సాధించిన విజయాలతో ప్రదర్శన ఏర్పాటు చేశాయి. ఇటీవల అభివృద్ధి చేసిన ' అడవిక. సెనగ విత్తనం సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.
ఎక్స్‌పోలో న్యూ ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ICGEB) స్టాల్‌లో ప్రత్యక్ష ప్రయోగాత్మక ప్రదర్శనలు సందర్శకులు వీక్షించారు.
మెగా సైన్స్ ఎక్స్‌పోలో పాల్గొన్న వారికి వివిధ విభాగాల్లో అవార్డులు అందించారు. రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ) ఏర్పాటు చేసిన ప్రదర్శనకు మొదటి బహుమతి లభించింది. గుజరాత్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనకు రెండవ బహుమతి లభించగా, టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) మూడవ బహుమతి గెల్చుకుంది.
ఉత్తమ టెక్నాలజీ పెవిలియన్ కేటగిరీలో రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మొదటి స్థానంలో నిలిచింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ రెండవ బహుమతి పొందింది.
ఉత్తమ ఇంటరాక్టివ్ పెవిలియన్‌గా భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఎంపిక అయ్యింది. , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), రెండవ బహుమతి పొందింది.
జ్యూరీ స్పెషల్ అవార్డు కేటగిరీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మొదటి బహుమతి (ICMR), అమిటీ యూనివర్సిటీ రెండవ బహుమతి అందుకున్నాయి.
ఎక్స్‌పోలో బెస్ట్ పెవిలియన్‌గా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మొదటి బహుమతి , బయోటెక్నాలజీ విభాగం రెండవ బహుమతి , డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తృతీయ బహుమతి అందుకున్నాయి.
మెగా సైన్స్ ఎక్స్‌పోజిషన్‌ను CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్, పాలసీ రీసెర్చ్ సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (SMCC) ప్రసారం చేసింది. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2023 మీడియా ప్రచారాన్ని మీడియా కమ్యూనికేషన్ సెల్ సమన్వయం చేసింది పరిశోధన, అభివృద్ధి రంగంలో భారతదేశం సాధించిన ప్రగతి, సాధించిన శాస్త్రీయ విజయాలనుమీడియా కమ్యూనికేషన్ సెల్ ప్రచారం చేస్తోంది.
మరింత సమాచారం కోసం, https://niscpr.res.in/ని ,లేదా @CSIR-NIScPR ని సంప్రదించవచ్చు.
***
(Release ID: 1998251)
Visitor Counter : 167