సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కంబోడియా ప్రభుత్వ ఉద్యోగులకు పబ్లిక్ పాలసీ,పరిపాలన సామర్ద్యాన్ని పెంపొందించడానికి 2024 జనవరి 8-19 తేదీల మధ్య న్యూఢిల్లీలో శిక్షణ తరగతులు నిర్వహించిన ఎన్ సీజీజీ


కార్యక్రమంలో పాల్గొన్న 38 మంది అధికారులు. ఇప్పటివరకు ఎన్ సీజీజీ లో శిక్షణ పొందిన 117 మంది అధికారులు
ప్రపంచంలోని అన్ని దేశాలు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తూ , సుపరిపాలన అందించేందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.. ఎన్ సీజీజీ డైరెక్టర్ జనరల్

Posted On: 20 JAN 2024 10:47AM by PIB Hyderabad

కంబోడియా నుంచి వచ్చిన  38 మంది ప్రభుత్వ ఉద్యోగులు  స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సిజిజి)   పబ్లిక్ పాలసీ , సుపరిపాలనలో శిక్షణ పొందారు. 2024 జనవరి 8 నుంచి 19 వరకు  రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పొరుగు దేశాలతో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారు. 'పొరుగు దేశాలకు ప్రాధాన్యత ' అన్న శ్రీ మోదీ విధానాలకు అనుగుణంగా  ఎన్ సిజిజి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మూడవ సారి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల ముగింపు సమావేశానికి  ఎన్ సీజీజీ   డైరెక్టర్ జనరల్ , డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డీఏఆర్పీజీ) కార్యదర్శి శ్రీ  వి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ శ్రీనివాస్  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ రంగంలో భారత్, కంబోడియా దేశాల  మధ్య సహకారంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి  డీఏఆర్పీజీ  కి ప్రభుత్వ ఆమోదం లభించిందని  తెలిపారు. వచ్చే 5 సంవత్సరాలలో ఒప్పందం  కింద డిజిటల్ పరివర్తన కోసం దేశంలో అమలు చేసిన విధానాన్ని కంబోడియాలో  అమలు చేయడానికి  సహకారం అందిస్తామని వివరించారు. 

మేధోమధన కార్యక్రమం కింద నిర్వహించే చర్చా గోష్టి సిబ్బంది మధ్య అనుబంబంధం పెంచి ఫలితాలు ఇస్తుందని శ్రీ శ్రీనివాస్ తెలిపారు. డిజిటల్ విధానంలో ప్రజలకు సాధికారత కల్పించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ' తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్ధ పరిపాలన' విధానాన్ని ఆయన  కంబోడియా నుంచి  శిక్షణ కోసం  వచ్చిన ఉద్యోగులకు వివరించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన కంబోడియా  సివిల్ సర్వీస్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీంగ్ ఫణిత్ తమ దేశ ఉద్యోగులకు శిక్షణ పొందడానికి అవకాశం  ఇచ్చిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కంబోడియన్ సివిల్ సర్వీస్ అధికారులకు  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వి.శ్రీనివాస్ , ఎన్.సి.జి.జి బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పబ్లిక్ పాలసీ, గవర్నెన్స్ రంగంలో ఎన్నో ఉత్తమ పద్ధతులు,  భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న అంశాలపై తమ ఉద్యోగులు అవగాహన పొందారని   వివరించారు. దీనివల్ల అధికారులు తమ దేశ ప్రజలకు మెరుగైన సేవలు అందించి అంతిమంగా సుపరిపాలన సాధించేందుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రెండు వారాల కార్యక్రమంలో  మూడు అంశాలపై శిక్షణ ఇచ్చారు. తమ అనుభవాలు, అవగాహనపై శిక్షణ పొందిన ఉద్యోగులు సమగ్ర  వివరణ  అందించారు. 

ప్రోగ్రాం అసోసియేట్ ప్రొఫెసర్, కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ బి.ఎస్.బిష్త్  కోర్సు గురించి క్లుప్తంగా వివరించారు. మారుతున్న పాలన, పబ్లిక్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్, ఎథిక్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, క్లైమేట్ ఛేంజ్ అండ్ బయో డైవర్సిటీ పై దాని ప్రభావం, ఆరోగ్య రంగంలో పనితీరు మెరుగుదల  స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీస్, లీడర్ షిప్ అండ్ కమ్యూనికేషన్, ఈ-గవర్నెన్స్ అండ్ డిజిటల్ ఇండియా, జెండర్ అండ్ డెవలప్ మెంట్, జీఈఎం: ప్రభుత్వ సేకరణలో పారదర్శకత తీసుకురావడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.  శిక్షణలో భాగంగా డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ సందర్శన ప్రణాళిక ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ)   పాటు బుద్ధ ఆలయ సందర్శన నిర్వహించారు. . ముజఫర్ నగర్ జిల్లా, ఢిల్లీలోని ఎయిమ్స్, సంచార్ భవన్ లతో పాటు ఆగ్రా లోని తాజ్ మహల్ ని కూడా శిక్షణ పూర్తి చేసుకున్న వారు సందర్శించారు. 

పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ పై 3వ శిక్షణా కార్యక్రమం  కంబోడియా కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ బి.ఎస్.బిష్త్, కో-కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ శర్మ, ట్రైనింగ్ అసిస్టెంట్ శ్రీ బ్రిజేష్ బిష్త్ పర్యవేక్షణలో జరిగింది. 

 

***



(Release ID: 1998248) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Tamil