రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో రూ. 670 కోట్లతో బిఆర్ఓ నిర్మించిన 29 వంతెనలు , ఆరు రోడ్లను ప్రారంభించిన రక్షణ శాఖ


రవాణా సౌకర్యాలు ,రక్షణ సంసిద్ధతను మెరుగుపరచి, సుదూర ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధన లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం

సరిహద్దు ప్రాంతాలు దేశ ముఖ ద్వారాలు.. రక్షణ శాఖ మంత్రి

సరిహద్దు ప్రాంతాలు ప్రధాన భూభాగంలో భాగం, బఫర్ జోన్‌లు కాదు.. స్పష్టం చేసిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
"దేశం భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంత అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది".. శ్రీ
రాజ్‌నాథ్ సింగ్

ప్రజలకు రక్షణ కల్పించి, శత్రువులను సమర్ధంగా ఎదుర్కోవడానికి కొండ ప్రాంతాల్లో బలగాలను మోహరించి

సౌకర్యాలు మెరుగుపరచడానికి నవ భారతదేశం నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.. రక్షణ శాఖ మంత్రి

Posted On: 19 JAN 2024 2:49PM by PIB Hyderabad

సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఓ) 670 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 35 మౌలిక సదుపాయల ప్రాజెక్టులను కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్  ఉత్తరాఖండ్‌లోని జోషిమత్-మలారి రోడ్‌లో 2024 జనవరి 19న జరిగిన ఒక కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో  మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే విధంగా ప్రాజెక్టులను నిర్మించిన బిఆర్ఓను రక్షణ శాఖ మంత్రి  అభినందించారు.  రోడ్లు, వంతెనలు మొదలైన వాటిని నిర్మించడం వల్ల  సుదూర ప్రాంతాలకు భౌగోళికంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో రవాణా సౌకర్యం కలుగుతుందని, మారుమూల ప్రాంతాల్లో  నివసిస్తున్న ప్రజలకు ప్రధాన భూభాగంలో నివసిస్తున్న ప్రజలతో సంబంధాలు ఏర్పడి అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ఐకమత్యం సాధించిందానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. 

సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ శాఖ మంత్రి తెలిపారు. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, విధానాన్ని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. గత  ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు  భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వ విధానం ఉందని ఆయన అన్నారు. “గత  ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలను దేశంలోని చివరి ప్రాంతాలుగా పరిగణించి వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. దీనికి భిన్నంగా శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలను భారతదేశ ముఖ ద్వారాలుగా చూస్తోంది. ఈ విధానంలో భాగంగా  ఈ జోన్‌లలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి ”అని ఆయన చెప్పారు.

రహదారులు, వంతెనలు, సొరంగాల ద్వారా దేశంలోని  సరిహద్దు ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని రక్షణ శాఖ మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాలు  వ్యూహాత్మక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా, ఈ ప్రాంతాలలో నివసించే ప్రజల సంక్షేమానికి కూడా కీలకమని వివరించారు. “సరిహద్దుల దగ్గర నివసించే ప్రజలు సైనికుల కంటే తక్కువ కాదు. ఒక సైనికుడు యూనిఫాం ధరించి దేశాన్ని రక్షిస్తే.. సరిహద్దు ప్రాంతాల వాసులు మాతృభూమికి తమదైన రీతిలో సేవలందిస్తున్నారు' అని అన్నారు.

గత ప్రభుత్వాలు సరిహద్దు ప్రాంతాలను  మైదాన ప్రాంతాల బఫర్ జోన్‌లుగా పరిగణించాయని తెలిప్నా మంత్రి తమ ప్రభత్వం విధానాన్ని మార్చిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తమ  ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలను ప్రధాన స్రవంతిలో భాగంగా పరిగణిస్తోందని, బఫర్ జోన్‌గా కాదని ఆయన స్పష్టం చేశారు.  “సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతంలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.  మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే  ప్రధాన స్రవంతి అనే మనస్తత్వంతో ప్రభుత్వాలు పని చేశాయి  సరిహద్దులో అభివృద్ధి జరిగితే శత్రువులకు అనుకూలంగా ఉంటుంది అన్న సంకుచిత భావంతో గత ప్రభుత్వాలు పని చేశాయి. దీని వల్ల అభివృద్ధి  సరిహద్దు ప్రాంతాలకు చేరలేదు. ఈ ఆలోచన నేడు మారింది. ప్రధాని మోదీ నాయకత్వంలో  దేశం  భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.  ఈ ప్రాంతాలను బఫర్ జోన్‌లుగా పరిగణించడం లేదు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు  ప్రధాన స్రవంతిలో భాగం, ”అని మంత్రి వివరించారు.

నవ భారతదేశం నిర్మాణం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా సరిహద్దు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని శ్రీ రాజనాధ్ సింగ్ తెలిపారు. ప్రధాన ప్రాంతాలకు శత్రువు చేరే వరకు వేచి చూసి వారిని  ఎదుర్కోవడానికి కాకుండా సరిహద్దులో నిలవరించడం నవ భారతదేశం విధానమని మంత్రి ప్రకటించారు. దీనిలో భాగంగా  " పర్వతాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి,కొండ సరిహద్దులలో సైనికులను మోహరిస్తున్నాము. దీనివల్ల సరిహద్దు ప్రాంతాల ప్రజలకు  భద్రతకు భరోసా ఇస్తుంది. శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సైన్యానికి సహాయం చేస్తుంది" అని ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జరుగుతున్న వలసల పట్ల   శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రాల నుంచి సరిహద్దుల వరకు అభివృద్ధి సాధించాడం  లక్ష్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

ఇటీవలి కాలంలో  ఉత్తరాఖండ్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్మ, సిక్కింతో సహా కొన్ని సరిహద్దు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను ప్రస్తావించిన రక్షణ శాఖ మంత్రి  వాతావరణ మార్పులు ఈ సంఘటనలకు  కారణమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు అని  తెలిపారు.  వాతావరణ మార్పు అనేది కేవలం వాతావరణ సంబంధిత అంశం  మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన చాలా తీవ్రమైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని చాలా సీరియస్‌గా తీసుకుంటోందని ఈ విషయంలో స్నేహపూర్వక దేశాల నుంచి సహకారం తీసుకుంటామని ఆయన తెలిపారు.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ఇటీవల చేపట్టిన  సిల్కిరా టన్నెల్ ఆపరేషన్‌లో బిఆర్ఓ అందించిన  సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్ సమయంలో అవిశ్రాంతంగా శ్రమించిన  సిబ్బంది, ముఖ్యంగా మహిళా కార్మికులను ఆయన అభినందించారు.  సంక్షోభ సమయంలో తన విధులను సమర్థంగా  నిర్వర్తించిన జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ (GREF)  బృందాన్ని ఆయన అభినందించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, బిఆర్ఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాష్ట్ర సంస్థలు సమన్వయం తో పని చేసి విజయం సాధించాయని అన్నారు. 

బిఆర్ఓ లో విధులు నిర్వర్తిస్తున్న   సాయుధ దళాల సిబ్బంది, పర్మినెంట్ సివిలియన్ ఉద్యోగులు, క్యాజువల్ పెయిడ్ లేబర్స్ (సీపీఎల్‌) లను రక్షణ మంత్రి ప్రత్యేక సిబ్బందిగా రక్షణ మంత్రి వర్ణించారు.  సరిహద్దు ప్రాంతాలను  బలోపేతం చేయడానికి కలిసి కృషి చేస్తున్న  సీపీఎల్‌లకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. " గతంలో  శాశ్వత ఉద్యోగులను మాత్రమే సంస్థలో భాగంగా పరిగణించేవారు.  ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించబడిన వారు లేదా కాంట్రాక్ట్/క్యాజువల్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారు కాదు. నేడు ఈ విధానం మారింది.  అందరి సమిష్టి కృషి ద్వారానే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని మేము నమ్ముతున్నాము. నూతన  విధానం బిఆర్ఓ లో పనిచేస్తున్న సీపీఎల్‌  లకు ప్రయోజనం కలుగుతుంది. బిఆర్ఓ లో భాగంగా  సాయుధ దళాల సిబ్బంది, పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా సీపీఎల్‌ లకు ప్రయోజనాలు అందుతాయి "అని ఆయన అన్నారు.

జీవన నాణ్యత పెంపొందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల వివరాలను తెలిపిన  రక్షణ శాఖ మంత్రి సీపీఎల్‌లతో సహా బిఆర్ఓ  సిబ్బంది  వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగించాలని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని  పేర్కొన్నారు.  “ సాయుధ దళాలతో సమానంగా బిఆర్ఓ  శాశ్వత పౌర సిబ్బందికి రిస్క్,  హార్డ్‌షిప్ అలవెన్స్‌ని చెల్లెస్తున్నాము. క్యాజువల్‌ కార్మికుల ఎక్స్‌గ్రేషియా పరిహారం రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పరిగింది.  సీపీఎల్‌లకు రూ.10 లక్షల బీమా కల్పించేందుకు ప్రభుత్వం  ఆమోదం తెలిపింది.. ఈ చర్యలు బిఆర్ఓ పని చేస్తున్న  సాయుధ దళాల సిబ్బంది, పౌర ఉద్యోగులు మరియు సీపీఎల్‌ ల  ధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి, ”అని ఆయన అన్నారు.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన 35 ప్రాజెక్టులలో 29 వంతెనలు, ఆరు రోడ్లు ఉన్నాయి. వీటిలో 11 ప్రాజెక్టులను  జమ్మూ  కాశ్మీర్‌లో నిర్మించారు.  లడఖ్‌లో తొమ్మిది, అరుణాచల్ ప్రదేశ్ లో ఎనిమిది, ఉత్తరాఖండ్‌లో మూడు, సిక్కింలో రెండు, మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లో  ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.  ప్రతికూల  వాతావరణ పరిస్థితుల మధ్య ప్రాజెక్టుల  నిర్మాణం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు.

అత్యంత ఆధునిక విధానంలో నిర్మించిన  ఢక్ బ్రిడ్జిపై ప్రారంభ కార్యక్రమం జరిగింది.  93 మీటర్ల పొడవున్న అత్యాధునిక క్లాస్ 70ఆర్ బ్రిడ్జిని  ధక్ నల్లా మీద నిర్మించారు. రక్షణ మంత్రి ప్రారంభించిన  ఢాక్ వంతెన వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సరిహద్దు ప్రాంతాలకు దీనివల్ల రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది.  సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచుతుంది. జోషిమత్ నుంచి  నీతిపాస్ వరకు గ్రామాలను కలిపే ఏకైక రహదారి అయిన వంతెన  ఈ ప్రాంతం  సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. .

 

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన మిగిలిన 34 ప్రాజెక్ట్‌లలో జమ్మూ కాశ్మీర్ లో నిర్మించిన  రాగిణి-ఉస్తాద్-ఫార్కియన్ గాలీ రోడ్ కూడా ఉంది. ఇది 38.25-కిమీ పొడవున్న CL-9 రహదారి, ఇది తంగ్‌ధర్ - కెరెన్ సెక్టార్‌ల మధ్య అన్ని వాతావరణ సౌకర్యం  అందిస్తుంది, ఇది సైన్యం  కార్యాచరణ సంసిద్ధతను పెంచుతుంది.

 

***



(Release ID: 1998157) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi , Marathi