భారత ఎన్నికల సంఘం
లోక్‌సభ ఎన్నికలు 2024కు ముందు దేశవ్యాప్తంగా ఇవిఎంలు, వివిపిఎటిలపై అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇసిఐ
అవగాహన కార్యక్రమం కోసం 3500 కంటే ఎక్కువ ప్రదర్శన కేంద్రాలు, దాదాపు 4250 మొబైల్ వ్యాన్‌లను మోహరింపు
అవగాహన కార్యక్రమం కోసం 3500 కంటే ఎక్కువ ప్రదర్శన కేంద్రాలు మరియు దాదాపు 4250 మొబైల్ వ్యాన్‌లను మోహరించారు
Posted On:
18 JAN 2024 7:45PM by PIB Hyderabad
త్వరలో జరుగనున్న లోక్‌సభకు 2024 ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం), వోటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) గురించి దేశవ్యాప్తంగా పౌరులకు ఓటింగ్ ప్రక్రియ గురించి ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు, యంత్రాలతో పరిచయం చేసేందుకు అవగాహన కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. లోక్‌సభకు, రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న ఈ అవగాహనా కార్యక్రమం ఇవిఎంలు, వివిపిఎటిల ప్రాథమిక లక్షణాల గురించి జ్ఞానాన్ని అందించడం, తమ ఎంపికలను వివిపిఎటి స్లిప్ ద్వారా ధ్రవీకరించుకోవడం గురించి వారికి తెలియచెప్పడంపై దృష్టి పెట్టింది. భౌతిక ప్రదర్శన ద్వారా ఇవిఎం & వివిపిఎటి కార్యాచరణపై లోతైన అవగాహనను పెంపొందించడమే కాక అపోహలను తొలగించి, ఓటరు విశ్వాసాన్ని పెంపొందించడంలో, మరింత సమాచారంతో ఓటర్లను భాగస్వాములను చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ కార్యక్రమంలో 31 రాష్ట్రాలు/ యూటీలలోని 613 జిల్లాల్లో విస్తరించి ఉన్న 3464 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం (ఇందులో 5 రాష్ట్రాలలో ఇటీవలే ఎన్నికలు జరిగాయి), అవగాహన కార్యకలాపాలు ఉన్నాయి. దాదాపు 3500 ప్రదర్శనా కేంద్రంలో, సుమారు 4250 మొబైల్ వాన్లను ఇవిఎం/ వివిపిఎటి పనితీరును ప్రజలకు భౌతికంగా ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. ఈ అవగాహనా కార్యక్రమం విస్తారతను పెంచేందుకు అన్ని సోషల్ మీడియా వేదికలపై సిఇఒలు, డిఇఒలు తాజా సమాచారాన్ని పంచుతున్నారు.
ఇసిఇ స్థాయీ సూచల ప్రకారం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రకటనకు సుమారు 3 నెలల ముందు నుంచి దృష్టి కేంద్రీకరించిన అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలి ( ఇందుకోసం గత ఎన్నికల తేదీని పరిగణనలోకి తీసుకోవచ్చు). అసెంబ్లీ నియోజకవర్గం/ సెగ్మెంట్ల వారీగా డిఇఒ అవగాహనా ప్రచారానికి షెడ్యూల్ తయారు చేశారు. దీనిని జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్థానిక మీడియాతో కూడా పంచుకోవడం జరుగుతుంది.
బహిరంగ ప్రదర్శన కార్యక్రమాలతో సహా శిక్షణ, అవగాహన (టి&ఎ) ప్రయోజనాల కోసం ఇవిఎంల ఉపయోగం కోసం కమిషన్ వివరణాత్మక, ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని కలిగి ఉంది. ఎస్ఒపిలో టి&ఎ ఇవిఎంల నిర్వహణ,నిల్వ కోసం, డమ్మీ గుర్తులతో ఎఫ్ఎల్‌సిఒకె ఇవిఎంల వినియోగం, శిక్షణ, అవగాహన తదితర శిక్షణా కార్యక్రమం సందర్భంగా ఉత్పత్తి అయిన వివిపిఎటి స్లిప్పులను ధ్వంసం చేయడం సహా ప్రోటోకళ్లు ఉన్నాయి. టి&ఎ కోసం ఉపయోగించిన ఇవిఎంల జాబితాను కూడా రాజకీయ పార్టీలకు రసీదుతో అందించడం జరుగుతుంది.
మరిన్ని వివరాల కోసం, వ్యక్తులు ఇవిఎంల మాన్యువల్‌లోని శిక్షణ& అవగాహన శీర్షిక కలిగిన 5వ అధ్యాయాన్ని చూడవచ్చు. ఇది ఇసిఐ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉంటుంది.
దీనికి సంబంధించిన లింక్‌ను కింద ఇవ్వడం జరుగుతుందిః
https://www.eci.gov.in/eci-backend/public/uploads/monthly_2023_08/EVMManualAugust2023_pdf.1f8976b609ce6fefe9b0fe69d3f848ff
***
(Release ID: 1997616)
Visitor Counter : 160