పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ‘డీకోడింగ్ ది గ్రీన్ ట్రాన్సిషన్ ఫర్ ఇండియా’ ఇతివృత్తంతో క్లైమేట్ కాన్ఫరెన్స్2024ను నిర్వహించింది.
ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు సంబంధిత భాగస్వాములతో ఈ సదస్సు
ఇన్నోవేషన్, రీసెర్చ్ మరియు క్లైమేట్ స్టార్టప్‌లు వాతావరణ కట్టుబాట్లకు అనుగుణంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సంబంధిత భాగస్వాముల విధాన నిర్ణేతలు, ప్రైవేటు రంగం, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, ఎంబీడీలు, ఆర్థిక సౌలభ్యాన్ని విస్తరించేందుకు వినూత్న పరిష్కారాలపై పని చేయాలి: కార్యదర్శి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ
భారతదేశం ప్రైవేట్ క్యాపిటల్, బ్లెండెడ్ ఫైనాన్సింగ్ సహా మూలధనాన్ని సమీకరించడానికి సిద్ధంగా ఉంది, భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ ఇందుకు మార్గం సుగమం చేస్తుంది: జీ20 షెర్పా
Posted On:
12 JAN 2024 4:09PM by PIB Hyderabad
"భారతదేశానికి హరిత పరివర్తనను డీకోడింగ్ చేయడం" అనే అంశంతో జనవరి 12, 2024న మహారాష్ట్రలోని ముంబైలో క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 జరిగింది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడిన ఈ కార్యక్రమం ఆర్థిక వనరులు మరియు సాంకేతిక సామర్థ్యాలను సమీకరించడంలో ప్రైవేట్ రంగం, క్లైమేట్ టెక్ స్టార్టప్‌లు మరియు సంస్థాగత పెట్టుబడిదారుల కీలక పాత్రపై దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రయత్నాలను ప్రభావితం చేయడం, పౌర సమాజం మరియు సంఘాలను నిమగ్నం చేయడం మరియు వినూత్న వాతావరణ సేవలు మరియు అనుసరణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం ఈ సదస్సు లక్ష్యం. డెలివరీ పార్టనర్ యూఎన్డీపీ ఇండియాతో గ్రీన్ క్లైమేట్ ఫండ్ రెడీనెస్ ప్రోగ్రామ్ కింద ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. నాలెడ్జ్ పార్టనర్ అవానా క్యాపిటల్ ఈ సదస్సుకు మద్దతు ఇచ్చింది.
కార్యదర్శి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ లీనా నందన్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, ఐఎఫ్ఎస్సీఏ చైర్మన్ కె. రాజారామన్, యూఎస్ కాన్సుల్ జనరల్ మైక్ హాంకీ, గోద్రెజ్ ఇండస్ట్రీ చైర్మన్అండ్ మేనేజింగ్ డైరెక్టర్, గోద్రెజ్ అగ్రోవైట్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్ తదితరులు ఈ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యదర్శి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ శ్రీమతి. లీనా నందన్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే విపరీత పరిణామాల ప్రభావాన్ని ఎత్తిచూపారు.
తక్షణ చర్య, ప్రణాళిక మరియు ఆర్థిక సమీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు. గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్‌తో సహా మంత్రిత్వ శాఖ చర్యలను ఆమె వివరించారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ (లైఫ్) గురించి గుర్తుచేస్తూ.. వినియోగదారుల ఎంపికల కోసంఎకోమార్క్ లేబులింగ్ భావనను తిరిగి ఆవిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. నష్టపరిహారం యొక్క ప్రాముఖ్యతను కూడా నందన్ భీమా మరియు నొక్కిచెప్పారు. క్లైమేట్ స్టార్టప్‌లను మెయిన్ స్ట్రీమింగ్ చేయడం మరియు వాటిని పరిశ్రమ మరియు వ్యాపార నమూనాలకు పెంచడం, వాతావరణ చర్య కోసం బయోమాస్ వినియోగం మరియు వ్యర్థాల నిర్వహణ వంటి చర్యలు అంత్యంత ఆవశ్యకమైనవని పేర్కొన్నారు.
భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ మరియు వృద్ధి సమస్యలను జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ప్రస్తావించారు. పునరుత్పాదక శక్తి, శక్తి నిల్వ, విద్యుత్ మొబిలిటీ, శక్తి సామర్థ్యం మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే ఐదు కీలకమైన రంగాల గురించి ఆయన వివరించారు. వ్యయ పొదుపు మరియు పెరిగిన పోటీతత్వం కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలలో (ఎంఎస్ఎంఈలు) ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. అధిక-రిస్క్ క్లైమేట్ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడంలో ఎండీబీలు, ఐఎఫ్ఐల పాత్ర గురించి ఆయన వివరించారు. అంతేకాకుండా మెరుగైన రాబడి మరియు గణనీయమైన మూలధనాన్ని ఆకర్షించడం కోసం ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిధుల కలయికను సైతం అమితాబ్ కాంత్ ప్రతిపాదించారు. గ్రీన్ హైడ్రోజన్ మరియు నిల్వ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలని అమితాబ్ కాంత్ సూచించారు.
ఇంధన వ్యవస్థలను మార్చడం, కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం, సహజ వనరులను సంరక్షించడం, జీవవైవిధ్యాన్ని పెంచడం మరియు సామాజికంగా న్యాయబద్ధంగా మరియు సమ్మిళిత పద్ధతిలో వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి గ్రీన్ ట్రాన్సిషన్ పెట్టుబడులపై దృష్టి సారించి, 2070 నాటికి నికర వినియోగం- సున్నాకు చేర్చడానికి, ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం యొక్క భవిష్యత్ కార్యచరణను ఈ సదస్సు నొక్కి చెప్పింది. ఇది భారతదేశంలోని క్లైమేట్ ఫైనాన్స్ యొక్క ప్రస్తుత ప్రకృతి దృశ్యాన్ని పరిశోధించింది, ప్రభుత్వం, వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్లు మరియు పరిశ్రమల నాయకుల పాత్రలను అన్వేషించింది. క్లైమేట్-టెక్ ఎకోసిస్టమ్‌లో ఫైనాన్సింగ్‌ను పెంచే వ్యూహాలపై కూడా చర్చలు దృష్టి సారించాయి. లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డుగా ఉన్న సమస్యల పరిష్కారాలను కూడా ఈ సదస్సు నొక్కి చెప్పింది.
సస్టైనబిలిటీ లింక్డ్ ఫండ్స్, రిస్క్-షేరింగ్ సౌకర్యాలు మరియు రాయితీ ఫైనాన్సింగ్‌లను కూడా కాన్ఫరెన్స్ హైలైట్ చేసింది. మొత్తంమీద, ఈ ఈవెంట్ విభిన్న రంగాలకు చెందిన వాటాదారులను కలిసి సహకారం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, స్థిరమైన, వాతావరణ- అనుకూల సాంకేతికత అభివృద్ధి, ప్రచారాన్ని, అమలును ఈ సదస్సు ప్రోత్సహించింది.
***
(Release ID: 1997217)
Visitor Counter : 373