వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల ప్రయోజనం కోసం మరియు ఉత్పాదకతను పెంచడం కోసం అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను ఉపయోగిస్తున్న వ్యవసాయం & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ


ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆర్కిటెక్చర్ (ఐఎన్‌డిఈఏ) 2.0 నెట్‌వర్క్ విధానాన్ని ఇది విజయవంతం చేస్తోంది.

ఈ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి 'కిసాన్ ఇ-మిత్ర,' ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి రైతుల సందేహాలను పరిష్కరించే ఏఐ-ఆధారిత చాట్‌బాట్ అభివృద్ధి.

ప్రైవేట్ రంగం సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తోన్న మంత్రిత్వ శాఖ

నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ, ఇండియాఏఐ మరియు వాధ్వాని ఫౌండేషన్ మధ్య ఈరోజు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఏంఓయు) సంతకం చేయబడింది

Posted On: 17 JAN 2024 7:44PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రైతుల ప్రయోజనం కోసం మరియు  ఉత్పాదకతను పెంచడం కోసం అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఏఐ ఏకీకరణలో మార్గదర్శక శక్తిగా భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి మంత్రిత్వ శాఖ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఇది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆర్కిటెక్చర్ (ఇండియా) 2.0  నెట్‌వర్క్ విధానాన్ని విజయవంతం చేస్తోంది.

ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి 'కిసాన్ ఇ-మిత్ర' అభివృద్ధి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి రైతుల సందేహాలను పరిష్కరించే ఏఐ-ఆధారిత చాట్‌బాట్. హిందీ, తమిళం, ఒడియా, బంగ్లా మరియు ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సమగ్ర పరిష్కారం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా అభివృద్ధి చెందుతోంది మరియు 2 నెలల్లోనే 21 లక్షల కంటే ఎక్కువ మంది రైతులు దీనిని ఉపయోగించారు.

దీంతోపాటు మంత్రిత్వ శాఖ ప్రైవేట్ రంగం సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) నమూనాలు పంట సమస్యలను గుర్తించి, సత్వర చర్య కోసం రైతులకు సకాలంలో సమాచారాన్ని అందిస్తాయి. ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని, దిగుబడిని పెంచడంతోపాటు రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

17 జనవరి 2024న డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇండియాఏఐ, నేషనల్ ఫార్మర్స్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ మరియు వాధ్వాని ఫౌండేషన్ మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సంతకం చేయబడింది. కార్యక్రమంలో  శ్రీ మనోజ్ అహుజా, సెక్రటరీ, డాక్టర్ పి.కె.మెహెర్దా, అదనపు కార్యదర్శి, శ్రీమతి రుచికా గుప్తా, సలహాదారు (డిజిటల్), శ్రీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ (ఎక్స్‌టెం.), శ్రీ ముక్తానంద్ అగర్వాల్, డైరెక్టర్ (డిజిటల్), వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ నుండి ఇతర సీనియర్ అధికారులు  మరియు వాధ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ పాలసీ సిఈఓ శ్రీ ప్రకాష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 శ్రీ మనోజ్ అహుజా సలహాలు, ఫీడ్‌బ్యాక్ సేకరణ, పంట పర్యవేక్షణ, దిగుబడి అంచనా, చీడపీడల నియంత్రణ మరియు వనరుల ఆప్టిమైజేషన్‌లో సామర్థ్యాలను వివరిస్తూ ఏఐ పాత్రను నొక్కిచెప్పారు. శ్రీ ప్రకాష్ కుమార్ మంత్రిత్వ శాఖతో ఒక సంచలనాత్మక ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరింత సంపన్నమైన మరియు ఆహార-సురక్షిత భవిష్యత్తు కోసం ఆవిష్కరణ మరియు విజ్ఞాన అంశాలను వివరించారు.

 

image.png


ఈ అవగాహన ఒప్పందం ప్రకారం వాధ్వాని ఫౌండేషన్ ఏఐ వ్యూహాన్ని రూపొందించడంలో మరియు అమలు చేయడంలో కీలకమైన మద్దతును అందిస్తుంది. ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవసాయ పరివర్తనలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా స్థాపించడంలో మంత్రిత్వ శాఖకు సహాయం చేయడానికి ఫౌండేషన్ కట్టుబడి ఉంది. ఏఐ కోసం ఎంఇఐటివై జాతీయ ప్రణాళికకు అనుగుణంగా ఉంటుంది. ఈ సహకారం భారతదేశ వ్యవసాయ రంగంలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది,.మంత్రిత్వ శాఖలో ఏఐ సెల్‌ను రూపొందించడం ద్వారా డిజిటల్ వ్యవసాయాన్ని మార్చడంలో ఏఐ ఉపయోగాన్ని మంత్రిత్వ శాఖ సంస్థాగతీకరించింది.
 

****



(Release ID: 1997152) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi