ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
'సైబర్ సురక్షిత్ భారత్' చొరవ కింద 41వ సీఐఎస్‌వో 'డీప్ డైవ్' శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎన్‌ఈజీడీ
Posted On:
17 JAN 2024 4:22PM by PIB Hyderabad
సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి; అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ప్రధాన సమాచార భద్రత అధికారులు (సీఐఎస్‌వోలు) & ఫ్రంట్‌లైన్ ఐటీ అధికార్ల సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచడానికి; పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును ఎదుర్కొనేలా తగిన భద్రత ఏర్పాట్లు చేయడం, డిజిటల్ రక్షణ వ్యవస్థలను రక్షించుకోవడం & సైబర్ దాడులను ఎదుర్కొనేలా సంస్థలను సదా సిద్ధంగా ఉండటానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ 'సైబర్ సురక్షిత్ భారత్' చొరవను తీసుకొచ్చింది.
ఈ చొరవలో భాగంగా, సామర్థ్య నిర్మాణ పథకం కింద, 'నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్' (ఎన్‌ఈజీడీ) ఈ నెల 16-20 తేదీల్లో 41వ సీఐఎస్‌వో 'డీప్-డైవ్' శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గుజరాత్ గాంధీనగర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీలో జరుగుతున్న ఈ శిక్షణ కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, న్యూదిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి అధికార్లు పాల్గొంటున్నారు. ఈ నెల 16న మంత్రిత్వ శాఖ, ఎన్‌ఈజీడీ, ఎన్‌ఐఎస్‌జీ సీనియర్ అధికార్లు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సైబర్ దాడుల పట్ల అవగాహన కల్పించడం, సామర్థ్యాలు పెంచడం, సైబర్ దాడులను తట్టుకునే వ్యవస్థను రూపొందించే చర్యలు చేపట్టేలా అన్ని ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం శిక్షణ లక్ష్యం. ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలను సమగ్రంగా అందించేందుకు తీసుకొచ్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా శిక్షణ కార్యక్రమంలో అధికార్లను సమాయత్తం చేస్తారు.
2018 జూన్ నుండి 2023 డిసెంబర్ వరకు, 1,548 మందికి పైగా సీఐఎస్‌వోలు & ఫ్రంట్‌లైన్ ఐటీ అధికార్ల కోసం 40 బ్యాచ్‌ల సీఐఎస్‌వో 'డీప్-డైవ్' శిక్షణ కార్యక్రమాలను ఎన్‌ఈజీడీ సమర్థవంతంగా నిర్వహించింది.
***
(Release ID: 1997116)
Visitor Counter : 260