శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఎన్ క్యూ ఎమ్ అమలు వ్యూహం, కాలవ్యవధిని ఖరారు చేసిన మిషన్ గవర్నింగ్ బోర్డు
Posted On:
17 JAN 2024 9:59AM by PIB Hyderabad
డాక్టర్ అజయ్ చౌదరి అధ్యక్షతన జరిగిన నేషనల్ క్వాంటమ్ మిషన్ (ఎన్క్యూఎం) మిషన్ గవర్నింగ్ బోర్డు (ఎంజీబీ) మొదటి సమావేశం జరిగింది. సమావేశంలో ఎన్ క్యూ ఎం అమలు వ్యూహం, కాలపరిమితి, మిషన్ కోఆర్డినేషన్ సెల్ (ఎంసీసీ) ఏర్పాటు అంశాలను చర్చించారు. మిషన్ అమలు చేయడానికి ఎంసీసీ ఏర్పాటు డీఎస్ టీ మిషన్ సెక్రటేరియట్ తో సమన్వయంతో పని చేయడానికి మిషన్ కో ఆర్డినేషన్ సెల్( ఎంసీసీ) చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
అర్హతలు, మౌలిక సదుపాయాలు ప్రాతిపదికగా డీఎస్టీ గుర్తించిన సంస్థలో ఎంసీసీ ని ఏర్పాటు చేస్తారు. మిషన్ టెక్నాలజీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎంటీఆర్ సి) పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో ఎంసీసీ పనిచేస్తుంది.
భారతదేశంలో క్వాంటమ్ టెక్నాలజీ ఆవిర్భావాన్ని ఎంజీబీ చైర్మన్ హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ చౌదరి వివరించారు. ఎన్క్యూఎం ఏర్పాటుతో క్వాంటమ్ టెక్నాలజీ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అభివృద్ధి సాధన కోసం మానవ వనరులు , అంకుర సంస్థలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ ఎకె సూద్ మాట్లాడుతూ అభివృద్ధిలో మానవ వనరులు కీలకంగా ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మానవ వనరుల అభివృద్ధికి హబ్ లకు సాధికారత కల్పించాలని సూచించారు.
'' వ్యవస్థలను దిగుమతి చేసుకోవడం కంటే సొంత వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం మార్పిడితో పాటు నిధులు సమకూర్చుకునే అంశంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషించాలి' అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్ అన్నారు.
క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ లో ఎన్ క్యూఎం నాలుగు మిషన్ హబ్ లను ఏర్పాటు చేస్తుందని డీఎస్ టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ తెలిపారు. ప్రధానంగా విద్యారంగం, ఆర్ అండ్ డీ ల్యాబ్ లు, పరిశ్రమలకు అనుబంధంగా నాలుగు మిషన్ హబ్ లు పని చేస్తాయని వివరించారు.
వ్యవస్థ అమలు కోసం రూపొందించిన సమగ్ర ప్రణాళిక వివరాలను డీఎస్టీ సీనియర్ అడ్వైజర్, సెర్బ్ కార్యదర్శి డాక్టర్ అఖిలేశ్ గుప్తా, ఎఫ్ఎఫ్టీ విభాగాధిపతి డాక్టర్ ఏక్తా కపూర్ వివరించారు. . కమిటీ సుదీర్ఘంగా చర్చించి అమలు వ్యూహం, కాలపరిమితిని ఖరారు చేసింది. ఎన్ క్యూ ఎం కింద నాలుగు టెక్నాలజీ హబ్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు 'కాల్ ఫర్ ప్రీ ప్రపోజల్ 'కు ఎంజీబీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో డీడీ ఆర్ అండ్ డీ కార్యదర్శి డాక్టర్ సమీర్ కే కామత్, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ రజత్ మూనా, ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్ విశ్వజిత్ సహాయ్ఏ, , డీఓఎస్, డీఆర్డీవో, డీఏఈ, ఎంఈటీ, డాట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ల ఎస్ అండ్ ఎఫ్ ఏ ప్రతినిధులు, పలువురు డీ ఎస్టీ అధికారులు పాల్గొన్నారు.
నేషనల్ క్వాంటమ్ మిషన్ (ఎన్క్యూఎం)కు 2023 ఏప్రిల్ 19న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రూ.6003.65 కోట్ల వ్యయంతో 8 సంవత్సరాల పాటు నేషనల్ క్వాంటమ్ మిషన్ ను డీఎస్టీ అమలు చేస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ (క్యూటి)లో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన అభివృద్ధిని ప్రారంభించి, ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి అవసరమైన శక్తివంతమైన, సృజనాత్మక పర్యావరణ వ్యవస్థ ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా మిషన్ పనిచేస్తుంది. క్యూటి ఆధారిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి మిషన్ కృషి చేస్తుంది. దేశంలో పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి క్వాంటమ్ టెక్నాలజీస్ అప్లికేషన్ (క్యూటిఎ) రంగంలో భారతదేశాన్ని అగ్రగామి దేశాలలో ఒకటిగా చేయడానికి కృషి జరుగుతుంది.
***
(Release ID: 1996892)
Visitor Counter : 296