రక్షణ మంత్రిత్వ శాఖ
ఎన్‌సిసి రిపబ్లిక్ డే క్యాంప్-2024ని సందర్శించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
ఎన్.సి.సి.17 లక్షల మంది క్యాడెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం యువజన సంస్థ: సీడీఎస్
Posted On:
12 JAN 2024 4:51PM by PIB Hyderabad
నేడు (జనవరి 12, 2024న) ఢిల్లీ కాంట్లో ఎన్.సి.సి. రిపబ్లిక్ డే క్యాంప్ -2024ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సందర్శించారు. ఎన్.సి.సి. డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ స్వాగతం అందుకున్న తర్వాత, సీడీఎస్ ఎన్‌సిసి సంస్థ యొక్క మూడు విభాగాలు.. ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నుండి తీసిన క్యాడెట్లచే ఆకట్టుకునే 'గార్డ్ ఆఫ్ హానర్' ప్రక్రియను సమీక్షించారు. ఆ తర్వాత బిట్స్ ఫిలానీ గర్సల్ క్యాడెట్ల అద్భుతమైన బ్యాండ్ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడుతూ.. క్యాడెట్‌లు ఆకట్టుకునే 'గార్డ్ ఆఫ్ హానర్', ఆదర్శప్రాయమైన హాజరు మరియు నిష్కళంకమైన డ్రిల్‌ను ప్రదర్శించారని ప్రశంసించారు. 'ఐక్యత & క్రమశిక్షణ' అనే నినాదానికి కట్టుబడి ఉన్న ఎన్.సి.సి. నిరాడంబరమైన ప్రారంభం నుండి నేడు 17 లక్షల మంది క్యాడెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం యువజన సంస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశ యువతలో క్రమశిక్షణ, నాయకత్వ, స్నేహ శీలత వంటి లక్షణాలను పెంపొందించడంలో ఎన్‌సిసి చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. జాతి నిర్మాణంలో ఎన్‌సిసి క్యాడెట్‌ల ప్రశంసనీయమైన కృషిని మరియు 'అంతర్జాతీయ యోగా దినోత్సవం', 'హర్ ఘర్ తిరంగ', 'పునీత్ సాగర్ అభియాన్' మరియు ఇతర సారూప్య కార్యక్రమాలలో వారి గణనీయమైన సహకారాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్‌సిసి కరిక్యులమ్‌లో కీలకమైన అంశాలుగా ఉన్న క్రీడలు మరియు సాహస కార్యక్రమాలలో ఎన్‌సిసి క్యాడెట్‌ల భాగస్వామ్యం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. సుబ్రొటో కప్ మరియు జవహర్ లాల్ నెహ్రూ హాకీ ఛాంపియన్‌షిప్‌లో ఎన్‌సిసి క్యాడెట్ జట్లు పాల్గొన్న విజయాల గురించి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. మావ్లాంకర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఎన్‌సిసి క్యాడెట్‌లను ఆయన అభినందించారు. ఎన్‌సిసి క్యాడెట్‌లు రాణించేలా కృషి చేయాలని, విజయం, అపజయాల గురించి ఆందోళన చెందకుండా జీవితంలో ఆశాజనకంగా ఉండాలని సూచించారు. మొత్తం 17 ఎన్‌సిసి డైరెక్టరేట్‌లకు చెందిన క్యాడెట్‌లు వివిధ సామాజిక అవగాహన ఇతివృత్తాలను వర్ణిస్తూ తయారు చేసిన ‘ఫ్లాగ్ ఏరియా’ను సిడిఎస్ పరిశీలించారు. క్యాడెట్‌లు వారి వారి నమూనాలపై ఆయనకు అవగాహన కల్పించారు. జనరల్‌తో పాటు ఇతర విశిష్ట అతిథులు కూడా ఎన్‌సిసి ఆడిటోరియంలో ప్రతిభావంతులైన క్యాడెట్‌లచే అద్భుతమైన ‘సాంస్కృతిక కార్యక్రమం’ని వీక్షించారు.
***
(Release ID: 1995737)
Visitor Counter : 146