రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 (కె-2743) విమాన సమాచారం

Posted On: 12 JAN 2024 3:20PM by PIB Hyderabad

2016 జులై 22న బంగాళాఖాతంలో చేపట్టిన ఒక ఆపరేషన్‌ సమయంలో, భారత వైమానిక దళానికి చెందిన ఒక ఏఎన్‌-32 విమానం (కె-2743) ఆచూకీ గల్లంతైంది. ఆ విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నారు. ఆ విమానం & సిబ్బంది కోసం విమానాలు, నౌకల ద్వారా తీవ్ర స్థాయిలో వెతికినా ఫలితం దొరకలేదు.

భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ', ఏఎన్‌-32 గల్లంతైన సముద్ర ప్రాంతంలో లోతుగా అన్వేషిస్తోంది. ఇందుకోసం, 'అటానమస్ అండర్ వాటర్ వెహికల్'ను (ఏయూవీ) ఇటీవల మోహరించింది. అత్యాధునిక ధ్వని తరంగాల సాంకేతికతలు, నీటి అడుగున అత్యంత స్పష్టతతో ఫొటోలు తీసే కెమెరాలను ఉపయోగించి 3400 మీటర్ల లోతులో అన్వేషించింది. చెన్నై తీరానికి సుమారు 310 కి.మీ. దూరంలో, సముద్రం అడుగుభాగంలో కొన్ని విమాన శిథిలాలను ఏయూవీ ఫొటోలు తీసింది.

ఆ ఫొటోల్లో ఉన్న శిథిలాలు ఏఎన్‌-32 విమానాన్ని పోలి ఉన్నాయి. గతంలో, అదే సముద్ర ప్రాంతంలో మరే ఇతర విమానం కూలిపోలేదు. కాబట్టి, ఆ శిథిలాలు ఏఎన్‌-32 (కె-2743)కి చెందినవిగా భావిస్తున్నారు.

 

*** 


(Release ID: 1995733) Visitor Counter : 185


Read this release in: English , Urdu , Hindi , Tamil