విద్యుత్తు మంత్రిత్వ శాఖ

రోడ్లు , జాతీయరహదారులకు సంబధించి ఆర్థిక సహాయంపౖౖె సదస్సును ఏర్పాటు చేసిన ఆర్‌.ఇ.సి.లిమిటెడ్‌

Posted On: 09 JAN 2024 10:59AM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, ఆర్‌.ఇ.సి లిమిటెడ్‌, రోడ్లు, రహదారులకు ఆర్థిక సహాయానికి సంబంధించి ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ఈ రంగానికి చెందిన ఫైనాన్సింగ్‌ అంశాలను చర్చించేందుకు కీలకభాగస్వాములతో ఈసమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమావేశం 2024 జనవరి 8 వ తేదీన న్యూఢల్లీిలోజరిగింది. దీనికి ప్రభుత్వం,పరిశ్రమ వర్గాలు, రోడ్డురవాణా,రహదారులు, జాతీయరహదారుల అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌, నేషనల్‌ హైవే బిల్డర్స్‌ ఫెడరేషన్‌, స్టేట్‌రోడ్‌ డవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్స్‌, ఇండ్రస్ట్రీ పాలసీ రూపకర్తలు, డవలపర్లు హాజరయ్యారు.
ఈ సదస్సు సందర్భంగా సుమారు 16,000 కోట్ల రూపాయల విలువగల నాలుగు ఎం.ఒ.యులను దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌, జిఎంఆర్‌ పవర్‌ అండ్‌అర్బన్‌ ఇన్‌ఫ్రా,సిడిఎస్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, డి.ఇజైన్‌ అండ్‌ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో కుదుర్చుకోవడం జరిగింది.

ఈ  సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌ శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్‌ జైన్‌,ఈ రంగం అభివృద్ధికి తమ మంత్రిత్వశాఖ దార్శనికత గురించి ప్రస్తావించారు. అలాగే రోడ్‌ప్రాజెక్టులకు సులభతర ఫైనాన్సింగ్‌గురించి ప్రస్తావించారు. భారతదేశపురోడ్లు, జాతీయరహదారులపై ప్రయాణం గురించి బుూయన మాట్లాడారు. గత కొద్ది సంవత్సరాలలో రహదారుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు ఆయన తెలిపారు. దీనికితోడు, ఆర్‌.ఇ.సి లిమిటెడ్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హైవేల మంత్రిత్వశాఖ కలసికట్టుగా ఎదుగుతున్నాయన్నారు.

పారంభోపన్యాసం చేస్తూ ఆర్‌.ఇ.సి లిమిటెడ్‌ సి.ఎం.డి, శ్రీ వివేక్‌కుమార్‌ దేవాంగన్‌, ఆర్‌.ఇ.సి రుణ పోర్టుపోలియో గురించి వివరించారు. దీనితోపాటు విద్యుదేతర రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్‌కు సంబంధించి కంపెనీ దార్శనికత గురించి ఆయన వివరించారు. ప్రత్యేకించి రోడ్డు రంగం పురోగతిగురించి ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక పురోగతిలో రోడ్లు, జాతీయ రహదారులు కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన భారత్‌ మాల, సాగర్‌ మాల,జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్‌ ప్రాజెక్టు వంటివి రోడ్ల రంగం విస్తరణకు ఎంతగానో దోహదపడ్డాయి. ఆయా ప్రాజెక్టులకు అనువైన రుణ పరిష్కారాలు మున్నెన్నడూ లేనివిధంగా ముందుకు తేవడం జరిగింది.
ఈ సదస్సులో ఆర్‌.ఇ.సి, రోడ్‌ హైవే ఏజెన్సీలు, ఫైనాన్సింగ్‌లో వాటి ప్రత్యేకతలు, ఫైనాన్సింగ్‌ సవాళ్లు, ఈ రంగంలో అవకాశాలు వంటి వాటిని చర్చించడం జరిగింది.రుణదాతలు, రుణగ్రహీతల అభిప్రాయాలకు ఈ సదస్సులో అవకాశం కల్పించడం జరిగింది.అనంతరం ఓపెన్‌ ఫోరం చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఇందులో రోడ్డు, జాతీయ రహదారుల డవలపర్లు మాట్లాడారు.

ఈ అభివృద్ధిప్రయాణంలో భాగస్వామి అయ్యేందుకు ఆర్‌.ఇ.సి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఈ సదస్సులో ఆర్‌.ఇ.సి, అలాగే రోడ్‌ , జాతీయ రహదారుల ఏజెన్సీలు తమ ప్రెజెంటేషన్‌ ఇచ్చాయి. ఆర.ఇ.సిలిమిటెడ్‌ ఒక ఎన్‌.బి.ఎఫ్‌.సి సంస్థ ఇది పవర్‌ సెక్టర్‌ ఫైనాన్సింగ్‌, వివిధరంగాల అభివృద్ధిపై దృష్టిపెడుతుంది. దీనిని 1969లో ఏర్పాటుచేశృారు. ఆర్‌.ఇ.సి లిమిటెడ్‌ తన కార్యకలాపాలు ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది రాష్ట్ర విద్యుత్‌ బొర్డులకు , రాష్ట్ర ప్రభుత్వాలకు , కేం ,రాష్ట్ర విద్యుత్‌
సంస్థలు,కేంద్ర,రాష్ట్ర విద్యుత్‌వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులు, గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థలు వంటి వాటికి ఇది ఆర్థిక వనరులు సమకూరుస్తుంది. పవర్‌సెక్టర్‌ పూర్తి వాల్యూ చెయిన్‌లో ఇది ఫైనాన్స్‌ సదుపాయం కల్పిస్తుంది. జనరేషన్‌,ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌,పునరుత్పాదక ఇంధన తయారీకి ఇది దోహదపడుతుంది.
దేశంలో వెలిగే ప్రతి నాలుగో బల్బు వెలుగులు వెదజల్లడానికి ఆర్‌.ఇ.సి ఫండిరగ్‌ సదుపాయం కల్పిస్తోంది. ఆర్‌.ఇ.సి ఇటీవల మౌలికసదుపాయాలు, లాజిస్టిక్స్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఆర్‌.ఇ.సి లోన్‌ బుక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికం చివరి నాటికి 4.54 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 

 

***

 



(Release ID: 1995024) Visitor Counter : 64