బొగ్గు మంత్రిత్వ శాఖ
విజయ గాధ
బొగ్గు తొలిగించిన గనుల లో పచ్చదనం - పర్యావరణ వ్యవస్థ విధానం
प्रविष्टि तिथि:
08 JAN 2024 4:17PM by PIB Hyderabad
దేశం యొక్క పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చడం మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత మధ్య సున్నితమైన సమతుల్యతను సాధించడం, స్థిరమైన అటవీ పెంపకం మరియు జీవ-పునరుద్ధరణ కోసం ప్రగతిశీల వ్యూహాలను అవలంబించడంలో బొగ్గు రంగం మార్గదర్శక పాత్రను పోషిస్తుంది. విస్తృతమైన జీవ-పునరుద్ధరణ మరియు అటవీకరణ ప్రయత్నాలు కార్బన్ సింక్ మరియు అడవుల పెంపకం ద్వారా పచ్చదనం రెండింటినీ పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత 10 సంవత్సరాలలో, బొగ్గు పిఎస్‌యులు 42.3 మిలియన్ల మొక్కలను నాటడం ద్వారా 18,849 హెక్టార్ల భూమిని విజయవంతంగా అడవుల పెంపకం ద్వారా పచ్చదనంలోకి తీసుకువచ్చాయి. ఈ మార్గదర్శక చొరవ బాధ్యతాయుతమైన మరియు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన బొగ్గు గనుల తవ్వకాల పట్ల బొగ్గు రంగం యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది.
జార్ఖండ్‌లోని రామ్‌ఘర్‌లోని రాజ్రప్పలోని బ్యాక్‌ఫిల్డ్ ఏరియాలో అడవుల పెంపకం
తప్పనిసరి పర్యావరణ మరియు అటవీ అనుమతులు అవసరమయ్యే బొగ్గు గనుల ప్రాజెక్టులు, అటవీ శాఖ అనుమతి (ఎఫ్ సీ) కోసం పరిహార అటవీ పెంపకం (సీ ఏ) భూమిని గుర్తించడంలో గణనీయమైన అడ్డంకిని ఎదుర్కొంటున్నాయి. ఎఫ్ సీ ఆమోదం ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు వేగవంతం చేయడానికి, సీ ఏ ఖర్చులను తగ్గించడానికి, కార్బన్ క్రెడిట్‌లను సంపాదించడానికి మరియు జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి అటవీ పెంపకాన్ని ప్రోత్సహించడానికి, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎం ఒ ఈ ఎఫ్ సి సి ) 24.01.24 న గుర్తింపు పొందిన పరిహార అటవీ పెంపకం (ఏ సీ ఏ) కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. 2023. ఈ చురుకైన అటవీకరణ చొరవ ప్రైవేట్ భూ యజమానులు మరియు ప్రభుత్వ సంస్థలను పోడు భూముల్లో అడవుల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహిస్తుంది, ఇది అడవుల వెలుపల చెట్ల పెరుగుదలకు దోహదపడుతుంది.
ఏ సీ ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా, బొగ్గు పీ ఎస్ యూ లు ఏ సీ ఏ కి అనువైన అటవీ రహిత బొగ్గు తొలిగిన గనుల భూమిని సుమారు 3075 హెక్టార్లను గుర్తించాయి. అటవీ భూముల మళ్లింపు అవసరమయ్యే భవిష్యత్ బొగ్గు గనుల కోసం ఫారెస్ట్ క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి అటవీ రహిత నాన్-ఫారెస్ట్ డి-కోల్డ్ భూమిని ఏ సీ ఏ ల్యాండ్ బ్యాంక్‌గా తగిన నోటిఫికేషన్ కోసం బొగ్గు పిఎస్‌యు లు సంబంధిత రాష్ట్ర అటవీ శాఖలకు ప్రతిపాదనలు సమర్పించాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ద్వారా బిష్రాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ అక్రెడిటెడ్ పరిహార అటవీ పెంపకం (ఏ సీ ఏ) మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో ప్రశంసనీయమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ 1959-60లో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్ట్ సుస్థిరమైన మైనింగ్ మరియు బాధ్యతాయుతమైన భూ పునరుద్ధరణకు బెంచ్‌మార్క్‌గా మారింది. బొగ్గు వనరుల కొరత కారణంగా జూలై 2018లో కార్యకలాపాల ముగింపు దశకు చేరుకుని, ప్రాజెక్ట్ 1472 హెక్టార్ల లీజు హోల్డ్‌లో ఖచ్చితమైన ప్రణాళికాబద్ధమైన ప్రగతిశీల మరియు చివరి గని మూసివేతను అనుసరించింది. భౌతిక/సాంకేతిక మరియు జీవసంబంధమైన పునరుద్ధరణ పద్ధతులు రెండింటినీ కలుపుకొని దశలవారీగా భూసేకరణ ప్రక్రియ, తవ్విన ప్రాంతాలను పునరుద్ధరించింది. దాదాపు 319 హెక్టార్లు లీజు భూమి పునరుద్ధరణచెందిన అటవీ భూమిగా గుర్తించబడింది. అదనంగా, సోలార్ ప్లాంట్ కోసం దాదాపు 40 హెక్టార్లు కేటాయించారు, అయితే 906.82 హెక్టార్లు విజయవంతంగా జీవశాస్త్రపరంగా తిరిగిఅటవీకరణ పునరుద్ధరణచెందిన అటవీయేతర భూమి కి ఓ నమూనా గా నిలుస్తుంది.
ఈ పునరుద్ధరించబడిన భూమి ఇప్పుడు స్థానిక వృక్ష జాతుల అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను తో అలరారుతోంది, వీటిలో కెసియా సమియా, అకేసియా, నీలగిరి, సగ్వాన్, ఖైర్, బాబుల్, షీషు, బాటిల్ బ్రష్, ఆమ్, సిరిస్, జామున్, వేప, గుల్మోహర్, టేకు, కరంజా మొదలైన చెట్లు ఉన్నాయి. దాదాపు 77 హెక్టార్ల లీజు హోల్డ్ గనిలో ఖాళీని నీటితో నిండిన రిజర్వాయర్‌గా మార్చారు. ఈ జలాశయం గృహ వినియోగం, నీటిపారుదల, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వృక్షజాలం మరియు జంతుజాలానికి నీటిని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క పునరావాసీకరణ ప్రాంతం గా జీవవైవిధ్యాన్ని గణనీయంగా సుసంపన్నం చేసింది. ఎలుగుబంటిలు, నక్కలు మరియు సరీసృపాలు మొదలైన పునరావాసీకరణ జాతులు మరియు వలస పక్షులతో సహా జంతుజాలం ఇప్పుడు నీటి వనరులకు సమీపంలో అభివృద్ధి చెందుతున్నట్లు గమనించబడింది.
పర్యావరణ పరిరక్షణకు ప్రాజెక్ట్ అంకితభావం తో అక్రెడిటెడ్ పరిహార అటవీ పెంపకం (ఏ సీ ఏ)తో పాటు, ఏ సీ ఏ కోసం 899.17 హెక్టార్ల అటవీ రహిత భూమిని గుర్తించింది. బిష్రాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లోని ఎసిఎ ల్యాండ్ బ్యాంక్‌గా గుర్తించబడిన అటవీ భూమిని నోటిఫికేషన్ కోసం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అటవీ శాఖకు ప్రతిపాదన సమర్పించబడింది. 899.17 హెక్టార్లలో, 403 హెక్టార్లను సూరజ్‌పూర్ ఫారెస్ట్ డివిజన్ ఇప్పటికే తనిఖీ చేసింది మరియు కుస్ముండా ఓ సి లో 402.96 హెక్టార్ల అటవీ భూమిని ఉపయోగించడం కోసం సీ ఏ భూమిగా ఎం ఒ ఈ ఎఫ్ సి సి కి సమర్పించబడిన సైట్ సూటిబిలిటీ సర్టిఫికేట్ జారీ చేయబడింది. ఇంకా, ఏ సీ ఏ ల్యాండ్‌గా సైట్ అనుకూలత ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి మిగిలిన గుర్తించబడిన అటవీ రహిత నాన్-ఫారెస్ట్ డీ-కోల్డ్ ల్యాండ్‌ను తనిఖీ చేయడానికి డీ ఎఫ్ ఓ, సూరజ్‌పూర్‌ని ఎస్ ఈ సీ ఎల్ అభ్యర్థించింది.
బిష్రాంపూర్ ఓ సి, ఎస్ ఈ సీ ఎల్ యొక్క డీ-కోల్డ్ భూమిలో ప్లాంటేషన్
ఈ చొరవ బాధ్యతాయుతమైన మరియు సుస్థిరమైన బొగ్గు మైనింగ్ పద్ధతుల పట్ల బొగ్గు రంగం యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతుంది. అగ్రగామి ఏ సీ ఏ విధానం పెరుగుతున్న ఇంధన డిమాండ్‌లను తీర్చడానికి బొగ్గు యొక్క నిరంతర లభ్యతకు హామీ ఇస్తుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు మరియు బొగ్గు ప్రాంతాలలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి కూడా చెప్పుకోదగ్గ సహకారం అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 1994507)
आगंतुक पटल : 238