సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌లో కెవిఐసి, క్యుసిఐ ల మధ్యకుదిరిన అవగాహనా ఒప్పందం.


కెవిఐసి ఛైర్మన్‌ శ్రీ మనోజ్‌కుమార్‌, క్యుసిఐ ఛైర్మన్‌ శ్రీ జక్సయ్‌ షా ల సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి..

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యుసిఐ)ఖాదీ ఉత్పత్తుల నాణ్యతకు పూచీపడనుంది.

Posted On: 03 JAN 2024 4:17PM by PIB Hyderabad

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఇక నవ భారత దేశపు కొత్త ఖాదీ ఉత్పత్తుల నాణ్యతకు పూచీ పడనుంది.  పధ్రానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇది గ్లోబల్‌ బ్రాండ్‌ గా మారింది. ఖాదీ ,విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కెవిఐసి), క్వాలిటీ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా (క్యుసిఐ) ఇందుకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఖాదీ ఉత్పత్తుల నాణ్య పెంపు, ఖాదీ చేనేత కారుల సామర్ధ్యాల పెంపు, మేడ్‌ ఇన్‌ ఇండియా బ్యానర్‌ కింద నాణ్యమైన ఖాదీ ఉత్పత్తులను అందించడం వంటి వాటిని సమకూర్చేందుకు అహ్మదాబాద్‌లోని కోచారబ్‌ ఆశ్రమంలో ఈ ఒప్పందం కుదిరింది.  కెవిఐసి ఛైర్మన్‌ శ్రీ మనోజ్‌ కుమార్‌, క్యుసిఐ ఛైర్మన్‌ శ్రీ జక్సయ్‌ షా ల సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ రెండు సంస్థల మధ్య పరస్పర సహకారం  లక్ష్యం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రపంచ శ్రేణి ఖాదీ ఉత్పత్తులను తయారు చేయడం.

ప్రస్తుత అవగాహనా ఒప్పందం  క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా , ఖాదీ గ్రామీణాభివృద్ధి ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు , వారి ఉత్పాదకత పెంచేందుకు, దేశీయంగా అంతర్జాతీయంగా మార్కెట్‌ పెంచేందుకు వీలు కలుగుతుంది. దీనితోపాటటటటు కెవిఐసి, ఖాదీ హస్తకళాకారులకు సాదికారత కల్పఇంచి, వారి ఉత్పత్తులను వివిధ మాధ్యమాల ద్వారా ప్రోత్సహించేందకు కృషి చేస్తుంది. దీనితోపాటు మేడ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తులుగా వీటికి ప్రత్యేక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా తెచ్చిపెట్టేందుకు కృషిచేస్తుంది. ఇది ఖాదీ హస్తకళాకారులకు  మరింత ఉద్పాతకతను, సామర్ధ్యాన్ని కల్పిస్తుంది. వారికి అధునాతన నైపుణ్యాలను అందుబాటులోకి తెస్తుంది.

ఈ సందర్భంగా కెవిఐసి ఛైర్మన్‌ శ్రీ మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ,ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ నాయకత్వంలో ‘న్యూ ఖాదీ ఆఫ్‌ న్యూ ఇండియా’ అనేది అభివృద్ధి చెందిన దేశానికి గుర్తుగా ముందుకు దూసుకుపోతున్నదని అన్నారు.  ఖాదీని ఎప్పటికప్పుడు అత్యధునాతనం చేసేందుకు కెవిఐసి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా  గత ఏడాది మూడు ప్రధాన ఎం.ఒ.యులు కుదిరినట్టు తెలిపారు.అవి ప్రసారభారతితో, ఎన్‌.బి.సిసి(ఇండియా)లిమిటెడ్‌ తో , డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌తో కుదిరినట్టు తెలిపారు.  ప్రస్తుతం దానిని మరింత విస్తరించి క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా,తో అవగాహన కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఈ అవగాహనా ఒప్పందాల లక్ష్యం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ను ఆధునీకరించేందుకు మార్గసూచిన రూపొందించడం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతకు అనుగుణంగా,   యువతలో ఖాదీ ఉత్పత్తులను బహుళప్రచారంలో పెట్టడం వంటివి ఉన్నాయన్నారు.క్యుసిఐతో కుదుర్చుకున్న అవగాహనతో ఖాదీ పరిశ్రమ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని, దీనితో అనుసంధానమైన హస్తకళాకారుల నైపుణ్యాలు, ఖాదీ ఉత్పత్తుల నాణ్యత మరింత ఉన్నత స్థాయికి చేరుతాయని తెలిపారు.  అంతర్జాతీయంగా ఇవిప్రపంచశ్రేణి గుర్తింపును సంతరించుకుంటాయని తెలిపారు.

క్యుసిఐ అధ్యక్షుడు జాక్సయ్‌ షా మాట్లాడుతూ, ఖాదీ నాణ్యత , ఖాదీ ఉత్పత్తుల నాణ్యత, ఖాదీ హస్తకళాకారుల నైపుణ్యాల పెంపు, వంటి వాటికి కెవిఐసితో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వించదగిన సమయమని ఆయన అన్నారు. ఖాదీ ఇండియా సంస్కృతి, వారసత్వానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశ లక్ష్యసాధనకు కృషి చేస్తున్నామని, ప్రస్తుత కొలాబరేషన్‌ ఈ దిశగా గొప్ప అంతర్జాతీయ గుర్తింపునకు దోహదపడుతుందని చెప్పారు. ఖాదీ పరిశ్రమల ప్రతినిధులు, హస్తకళాకారులు, ఖాదీ శ్రామికులు, అధికారులు, కెవిఐసి, క్యుసిఐ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***

 



(Release ID: 1994378) Visitor Counter : 87