ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని నీలకంఠవన్,మహాకాళి లోక్‌లో దేశంలోనే తొలి ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన ఫుడ్‌స్ట్రీట్ ‘ ప్రసాదం’ ను ప్రారంభించిన, కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ.
డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, డాక్టర్ మనోజ్‌యాదవ్‌లు సంయుక్తంగా రూ 218.76 కోట్ల రూపాయల విలువగల 17 రకాల సివిల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రెండు పబ్లఇక్‌హెల్త్ బ్లాక్‌లు, 54 ముఖ్యమంత్రి సంజీవనీ క్లినిక్‌లు, 3సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, ఉన్నాయి. ప్రధానమంత్రి` ఎబిహెచ్‌ఐఐఎం కింద, 30 పడకల అదనపు వార్డులు అత్యవసర ఎమర్జెన్సీకోవిడ్ రెస్పాన్ష్ పాకేజ్ కింద చేపడతారు. అలాగే మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 8ప్రైమరి హెల్త్ సెంటర్లను ఈ సందర్భంగా ప్రారంభించారు.
డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, డాక్టర్ మనోజ్ యాదవ్ సంయుక్తంగా మన్‌హిత్‌యాప్‌ను ప్రారంభించారు. ఇది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన యాప్
ప్రసాదం పథకం దేశంలోని నలుమూలల ఉండే ప్రజలతో అనుసంధానమైన కార్యక్రమం. దీని ద్వారా పరిశుభ్రమైన,
సురక్షితమైన స్థాఇనక సంప్రదాయ ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రయత్నం ద్వారా సామాన్యులు, పర్యాటకులను సురక్షితమైన, భద్రమైన ఆహారపు అలవాట్లతో మమేకం చేస్తుంది.
Posted On:
07 JAN 2024 4:48PM by PIB Hyderabad
‘‘ ప్రసాదం పథకం దేశం నలుమూలలగల సామాన్య ప్రజలను సురక్షితమైన భద్రమైన స్థానిక ఆహారం, సంప్రదాయ వంటకాలతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రయత్నం సామాన్యులను , పర్యాటకులను సురక్షితమైన, భద్రమైన ఆహారపు అలవాట్లతో అనుసంధానం చేస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, శాఖ మంత్రి డాక్టర్‌మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో తొలి ఆరోగ్యం, పరిశుభ్రతతో కూడిన ఫుడ్ స్ట్రీట్, ‘‘ప్రసాదం’’ ను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ లోక్ వద్ద గల నీలకంట వన్ వద్ద ప్రారంభించారు.
డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ తోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఉపముఖ్యమంత్రి
శ్రీ రాజేంద్ర శుక్లా, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర శివాజీ పటేల్, లోక్‌సభ సభ్యుడు
శ్రీ అనిల్ ఫిరోజియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతను పునరుడ్ఘాటిస్తూ డాక్టర్ మన్‌సుఖ్‌మాండవీయ, ‘‘వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, దేశప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. పెద్ద ఎత్తున ఆరోగ్య మౌలిక సౌకర్యాలతోపాటు, ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు.
రాగల రోజులలో ప్రతి నగరంలో ఫుడ్‌స్ట్రీట్‌లు ఏర్పాటుకానున్నాయని, వీటిద్వారా ఆరోగ్యవంతమైన ఆహారం ప్రజలకు అందుబాటులోకి రానున్నదని చెప్పారు. కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆరోగ్యం,పరిశుభ్రతా చొరవకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అలాగే ఫుడ్‌స్ట్రీట్‌ల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన ప్రమాణాలను ఆయన విడుదల చేశారు.
డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, డాక్టర్ మనోజ్‌యాదవ్‌లు సంయుక్తంగా 17 సివిల్ వర్క్‌లను ప్రారంభించారు. ఇందులో రెండు పబ్లిక్‌హెల్త్ యూనిట్ బ్లాక్‌లు, 54 ముఖ్యమంత్రి సంజీవనీ హెల్త్ క్లినిక్‌లు, మూడు సమీకృత పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, ఎమర్జెన్సీ కోవిడ్ స్పందన ప్యాకేజ్ తోపాటు 30 బెడ్‌లు, వార్డులతో మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 8 ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదనంగా కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కలసి సంయుక్తంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మన్ హిత్ యాప్ ను ఆవిష్కరించారు. మానసిక ఆరోగ్యం స్క్రీనింగ్‌కు ఇది ఉపకరిస్తుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద, డిజిటల్ భూమిపూజ నుపూర్తిచేశారు, పలు ప్రాజెక్టుల ఆవిష్కరణను పూర్తి చేశారు.
పుడ్‌కోర్టుల దగ్గర మౌలికసదుపాయాల అభివృద్ధి,శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆహార భద్రతపై వీధివ్యాపారుల సామర్ధ్యాల పెంపు, పరిశుభ్రత పెంపును కేంద్ర మంత్రి అభినందించారు. చిరుధాన్యాల మేళాలో స్టాల్స్‌ను, అక్కడ సుశిక్షితులైన సిబ్బంది ఆహారపదార్థాలను సరఫరా చేస్తుండడాన్ని పరిశీలించి వారితో కేంద్ర మంత్రి ముచ్చటించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను డాక్టర్ మోహన్ యాదవ్ అభినందిచారు. ఫుడ్‌స్ట్రీట్ ఆలోచనను ఆయన అభినందించారు. దీనిద్వారా ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులోకి వస్తుందని, ఇది ఆరోగ్యవంతమైన దేశానికి దారితీస్తుందని చెప్పారు.
కల్తీలనుంచి వినియోగదారులకు విముక్తి కల్పించేందుకు, ఫుడ్‌సేప్టీ, స్టాండర్డ్స్ అధారిటి ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎస్‌ఎస్‌ఎఐ) ది డార్ట్ బుక్ పేరుతో ఒక ప్రమాణాల పుస్తకాన్ని విడుదల చేసింది. సులభమైన పరీక్షల ద్వారా ఆహార పదార్ధాల నాణ్యతను ఇంటివద్దే సరిచూసుకునే పద్ధతులను ఇందులో పొందుపరిచారు. దీనికితోడు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనం, ఫుడ్‌సేఫ్టీ ఆన్ వీల్స్ పేరుతో ఒక దానిని ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకుకూడా చేరి, వినియోగదారులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు దీని ద్వారా నిర్వహిస్తారు. ప్రసాదం ప్రాంగణం 939చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఇందులో 19 షాప్‌లు ఉన్నాయి. ఈ స్టాల్స్‌లో సాంస్కృతికంగా సుసంపన్నమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రతిరోజూ మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించే భక్తులకుఅందజేస్తారు. సుమారు 1 నుంచి 1.5 లక్షల మంది మహాకాళేశ్వరుడిని ప్రతిరోజూ దర్శించుకుంటారు. కొత్తగాఏర్పాటు చేసిన ఫుడ్ స్ట్రీట్‌లో చిన్నపిల్లలు ఆడుకునేందుకు స్థలం, మంచినీటి సదుపాయం, సిసిటివి నిఘా, పార్కింగ్, వాష్‌రూంలు, అనువైన సీటింగ్ సదుపాయం వంటివి కల్పించారు. దీనికితోడు, ఉజ్జయిని పర్యాటక ఔన్నత్యాన్ని చాటిచెప్పేవిధంగా ,ఇక్కడి ఆహారపు ప్రత్యేకతలను కాపాడుతూ , సంప్రదాయాలకు అనుగుణంగా ప్రసాదం పథకం కింద ఆహారసదుపాయాలుఉంటాయి. ఇది ఆర్థిక అభివృద్ధికి, కమ్యూనిటీ కలసిమెలసి భుజించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కార్యక్రమానికి వివిధ పార్లమెంటు సభ్యులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.
***
(Release ID: 1994191)
Visitor Counter : 282