శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మూన్‌వాక్ నుంచి సన్ డాన్స్ వరకు, ఆదిత్య ఎల్1ను కాంతివలయ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టడాన్ని ప్రశంసించిన డాక్టర్ జితేంద్ర సింగ్
సూర్యుడి రహస్యాలను అన్వేషించడంలో మైలురాయి కృషిగా నిలువనున్న ఆదిత్య ఎల్ 1 విజయం
Posted On:
06 JAN 2024 7:12PM by PIB Hyderabad
మూన్‌వాక్ నుంచి ఆదిత్య ఎల్ 1 సన్‌డాన్స్ వరకు ఒకదాని తర్వాత ఒకటిగా దూసుకుపోయిన చంద్రయాన్ 3, ఎక్స్‌పోశాట్, లాగ్‌రేంజ్ పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్1 తమ లక్ష్యాన్ని ఛేదించిన మూడు విజయగాథలతో కూడిన విజయత్రయ మకుటాన్ని ఇప్పుడు ఇస్రో ధరించింది.
లాగ్‌రేంజ్ పాయింట్ వద్ద నిర్ధిష్ట గమ్యాన్ని ఆదిత్య ఎల్ 1 చేరిన వెంటనే కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నుంచి వెలువడిన తక్షణ, తొలి స్పందన ఇది.
వైరల్ అయిన ఒక ట్వీట్‌లో మంత్రి, మూన్ వాక్ నుంచి సన్ డాన్స్ వరకు! భారత్‌కు ఎంతటి మహోజ్జ్వలమైన సంవత్సరం! పిఎం నరేంద్రమోడీ దార్శనిక నాయకత్వంలో ఇ్రసో బృందం మరో విజయగాథను రచించింది. సూర్యుడికి -భూమికి మధ్య సంబంధంలోని మార్మికతలను కనుగొనేందుకు తన చివరి కక్ష్యను ఆదిత్య ఎల్ 1 చేరుకొంది, అని ఆయన పేర్కొన్నారు.
మీడియాకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో, అదిత్య ఎల్ 1 విజయమనేది సూర్యుడి రహస్యాలను కనుగొనే కృషిలో అత్యంత ముఖ్యమైన మలుపు అని అన్నారు. ఆదిత్య ఎల్ 1 ఇప్పటివరకు మన సరిగా అర్థం చేసుకొనుండకపోయిన లేదా జానపద కథలు లేదా అద్భుత కథలో భాగం అయ్యే రహస్యాల గుట్టు విప్పనుందని అన్నారు.
సూర్యుడి దృగ్విషయాన్ని అధ్యయనం చేయడంలో భారత్‌కు ప్రత్యేక వాటా ఉందని, అందుకు ప్రధాన కారణం అంతరిక్షంలోని అతిపెద్ద సంఖ్యలోని ఉపగ్రహాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రయోగించిన మరురోజే సౌర తుఫాను కారణంగా ప్రభావితమై అంతిరక్ష అన్వేషణకు సంబంధించిన ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ 40 ఉపగ్రహాలను కోల్పోయిన ఉదాహరణను మంత్రి ప్రస్తావించారు. సౌర దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది ఉద్ఘాటిస్తుంది. ఈ మిషన్ ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, అంతరిక్ష అన్వేషణ రంగంలో ఉన్న శాస్త్రవేత్తలంతా కూడా ఆదిత్య ఎల్ 1 మిషన్ నుంచి వచ్చే ఇన్‌పుట్ల కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు.
సోలార్ హీటింగ్ (సౌర ఉష్ణోగ్రతలు), సౌర తుఫాన్లు, సౌర శిఖలు, కరోనల్ మాస్ ఎజెక్షన్లు సహా ఇతర సౌర దృగ్విషయాలు అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ తోడ్పడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఆదిత్య ఎల్ 1 మిషన్ అన్నది కేవలం దేశీయమైనదే కాదు, చంద్రయాన్‌లాగే తక్కువ వ్యవయంతో రూ. 600 కోట్ల బడ్జెట్ తో ప్రయోగించందని మంత్రి చెప్పారు. దేశంలో ప్రతిభకు ఎప్పుడూ లోటు లేకపోయినప్పటికీ, వీరందరికీ తోడ్పడేందుకు లోపించిన లంకెను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సృష్టించడం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
నేటి సాయంత్రం దాదాపు 4.00 గంటలకు ఆదిత్య ఎల్ 1 హాలో ఆర్బిట్ ఇన్సర్షన్ (హెచ్ఒఐ) జరిగిందన్నారు.
మెనూవర్ (వ్యూహం) చివరిదశలో కొద్ది సమయంపాటు నియంత్రణ ఇంజిన్ల ఫైరింగ్ ఉంటుంది. ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక ఉన్న కక్ష్య నిరంతరం గతిమానమైన సూర్యుడు - భూమి రేఖ పై దాదాపు 177.86 భూమి రోజుల కక్షీయ కాలంతో భూమి నుంచి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్దిష్ట హాలో కక్షను ఎంపిక చేయడానికి కారణం మిషన్ జీవితకాలం 5 ఏళ్ళపాటు ఉండేలా చూడడం, కేంద్రం నుంచి మానువర్లను తగ్గించడంతో పాటు ఇంధన వినిమయాన్ని తగ్గించడం, నిరంతరంగా, ఎటువంటి ఆటంకాలు లేని సూర్యుడుని చూడగలగడం కోసమే.
ఖచ్చితమైన నావిగేషన్, నియంత్రణతో అంతరిక్ష నౌకను కాంతివలయ కక్ష్యలో జొప్పించడం అన్నది మిషన్‌లో కీలకమైన దశ. ఇలా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం అన్నది ఇటువంటి సంక్లిష్టమైన కక్ష్య మానివర్లలో ఇస్రో సామర్ధ్యాలను పట్టి చూపడమే కాదు, భవిష్యత్ అంతర్‌గ్రహ మిషన్లను నిర్వహించేందుకు విశ్వాసాన్ని ఇస్తుంది.
ఆదిత్య ఎల్ 1కు రూపకల్పన, తయారీ యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యుఆర్ఎస్‌సి)లో జరిగింది. దీనిలో వివిధ ఇస్రో సెంటర్లకు చెందినవారు పాల్గొన్నారు. ఆదిత్య ఎల్1 పై ఉన్న పేలోడ్లను ఐఐఎ, ఐయుసిఎ, ఇస్రో వంటి భారతీయ శాస్త్రీయ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. ఆదిత్య ఎల్ 1ను సెప్టెంబర్ 2, 2023న పిఎస్ఎల్‌వి-పి57 ద్వారా ప్రయోగించారు. కాంతివలయ కక్ష్యను చేరుకునేందుకు అంతరిక్ష నౌక దాదాపు 110 రోజులు ప్రయాణించవలసి వచ్చింది.
***
(Release ID: 1993960)
Visitor Counter : 232