అంతరిక్ష విభాగం
ఒక చిన్న ఉపగ్రహాన్ని అభివృద్ధి పరచే అంశం లోసహకారాని కి సంబంధించి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరియు మారిశస్రిసర్చ్ ఎండ్ ఇనొవేశన్ కౌన్సిల్ (ఎమ్ఆర్ఐసి) కి మధ్య కుదిరిన అవగాహన పూర్వక ఒప్పందపత్రాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
05 JAN 2024 1:12PM by PIB Hyderabad
ఒక చిన్న ఉపగ్రహాన్ని అభివృద్ధి పరచడం లో సహకారాని కి సంబంధించి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు మరియు మారిశస్ గణతంత్రాని కి చెందిన ఇన్‌ఫర్మేశన్ టెక్నాలజీ, కమ్యూనికేశన్ మరియు ఇనొవేశన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో మారిశస్ రిసర్చ్ ఎండ్ ఇనొవేశన్ కౌన్సిల్ (ఎమ్ఆర్ఐసి) కి మధ్య 2023 వ సంవత్సరం లో నవంబరు 1 వ తేదీ నాడు మారిశస్ లోని పోర్ట్ లుయి లో సంతకాలు పూర్తి అయిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) గురించి మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకు రావడమైంది.
ప్రభావం:
ఈ ఎమ్ఒయు ఒక సంయుక్త శాటిలైట్ ను అభివృద్ధి పరచడం తో పాటు గా ఎమ్ఆర్ఐసి యొక్క గ్రౌండ్ స్టేశను ను ఉపయోగించుకొనేందుకు సంబంధించిన సహకారం కోసం ఇస్ రో కు మరియు ఎమ్ఆర్ఐసి కి మధ్య సహకార ప్రధానమైన ఫ్రేమ్ వర్కు ను రూపొందించడం లో కూడాను సాయపడనుంది. ఈ సంయుక్త ఉపగ్రహం తాలూకు కొన్ని ఉప వ్యవస్థల నిర్మాణం లో భారతదేశాని కి చెందిన పరిశ్రమల కు భాగస్వామ్యం దక్కనుంది; మరి ఈ ప్రక్రియ తో పారిశ్రమిక రంగాని కి లాభం కలుగుతుంది.
ఉపగ్రహాన్ని కలసికట్టు గా అభివృద్ధి పరచే మాధ్యం ద్వారా ఒనగూరే సహకారం తో మారిశస్ లో భారతదేశం ఏర్పాటు చేసిన గ్రౌండ్ స్టేశన్ కు మారిశస్ ప్రభుత్వం వైపు నుండి నిరంతర సమర్థన లభించేలా అండ లభించగలదు. ఈ విధమైనటువంటి సహకారం ఇస్రో/భారతదేశం చేపట్టేటటువంటి వాహక నౌకలు మరియు ఉపగ్రహ ఆధారిత మిశన్ లకు కీలకం అని చెప్పాలి. దీని కి అదనం గా, ఈ సంయుక్త ఉపగ్రహ నిర్మాణం భవిష్యత్తు లో ఇస్ రో యొక్క స్మాల్ శాటిలైట్ మిశన్ కు ఎమ్ఆర్ఐసి యొక్క గ్రౌండ్ స్టేశన్ ద్వారా సమర్థన కు సైతం వీలు కలుగుతుంది. ఈ జాయింట్ శాటిలైట్ కు సబ్ సిస్టమ్స్ కొన్నిటి ని రూపొందించడం లో భారతదేశం లోని పరిశ్రమలు పాలుపంచుకోనున్నాయి. ఈ విధం గా ఉద్యోగాల కల్పన కు ఆస్కారం ఏర్పడుతుంది.
అమలు సంబంధి కార్యక్రమం:
ఈ ఎమ్ఒయు పై సంతకాలు కావడం తో ఇస్ రో మరియు ఎమ్ఆర్ఐసి ల మధ్య చిన్న ఉపగ్రహం తాలూకు సంయుక్త కార్యాచరణ సాధ్యపడనుంది. ఈ శాటిలైట్ కు తుది రూపు ను ఇవ్వడాన్ని 15 నెలల కాలావధి లోపల పూర్తి చేయాలి అని ప్రతిపాదించడమైంది.
మొత్తం ఖర్చు:
ఈ సంయుక్త ఉపగ్రహాన్ని పూర్తి స్థాయి లో తయారు చేయడానికి సుమారు గా 20 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా. ఈ ఖర్చు ను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఎమ్ఒయు లో సంబంధి పక్షాల మధ్య మరే ఇతర నిధుల ఆదాన ప్రదానం ఉండబోదు.
పూర్వరంగం:
భారతదేశం మరియు మారిశస్ ల మద్య అంతరిక్ష రంగం లో సహకారం 1980 వ దశాబ్దం ఉత్తరార్థం లో మొదలైంది. అప్పట్లో ఇస్ రో ఈ లక్ష్య సాధన కై 1986 లో సంతకాలు అయినటువంటి దేశ స్థాయి ఒప్పందం లో భాగం గా ఇస్ రో యొక్క వాహక నౌక మరియు శాటిలైట్ మిశన్ ల కోసం ట్రేకింగ్ ఎండ్ టెలిమెట్రీ సంబంధి రంగం లో సహాయార్థం మారిశస్ లో ఒక గ్రౌండ్ స్టేశను ను ఏర్పాటు చేసింది. వర్తమాన అంతరిక్ష సహకారం 29.7.2009 న సంతకాలు అయినటువంటి దేశాల స్థాయి ఒప్పందం ఆధ్వర్యం లో అమలువుతున్నది. ఇది పైన ప్రస్తావించిన 1986లో కుదిరిన ఒప్పందానికి బదులు గా కుదిరిన ఒప్పందం అన్నమాట.
మారిశస్ కోసం ఒక చిన్న ఉపగ్రహాన్ని సంయుక్తం గా నిర్మించాలి అంటూ ఎమ్ఆర్ఐసి కనబరచిన ఆసక్తి ఆధారం గా, భారతదేశం-మారిశస్ సంయుక్త ఉపగ్రహం రూపకల్పన కు సంబంధించిన చర్చల ను ఎమ్ఆర్ఐసి తో మొదలు పెట్టవలసిందిగా ఇస్ రో ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఎ) అభ్యర్థించింది. ఆ తరహా జాయింట్ శాటిలైట్ రూపకల్పన కు మరియు ఆ శాటిలైట్ ను కక్ష్య లో ప్రవేశపెట్టేందుకు మరియు దానిని నిర్వహించేందుకు నిధుల ను ఎమ్ఇఎ సమకూర్చుతుంది. ఈ ఎమ్ఒయు పై 2023 నవంబరు 1 వ తేదీ న మారిశస్ లోని పోర్ట్ లుయీ లో ‘అప్రవాసి దివస్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడానికని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మారిశస్ కు వెళ్ళినప్పుడు సంతకాలు చేయడమైంది.
***
(Release ID: 1993536)
Visitor Counter : 347