విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయాన్ని అందించేందుకు చేతులు కలిపిన ఆర్ ఇసి లిమిటెడ్ & బ్యాంక్ ఆఫ్ బరోడా
నాడు పోస్టు చేయడమైనది:
04 JAN 2024 3:23PM by PIB Hyderabad
రానున్న మూడేళ్ళలో దేశవ్యాప్తంగా విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ ప్రాజెక్టులకు రుణాలను ఉమ్మడిగా మంజూరీని సులభతరం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఆర్ఇసి లిమిటెడ్ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. దేశ మౌలిక సదుపాయాలనే వెన్నుముకను బలపరిచేందుకు, నిలకడైన వృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉమ్మడి దార్శనికతను ఆర్ఇసి లిమిటెడ్ & బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ కీలక రంగాలను బలోపేతం చేయవలసిన అత్యవసరాన్ని గుర్తించాయి. వనరులు, నైపుణ్యాలను పోగు చేసి, రెండు సంస్థలు దేశవ్యాప్తంగా ఆర్ధిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు, నిత్యావసర వస్తువుల అందుబాటును పెంచేందుకు ఉన్న చొరవలను ముందుకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నాయి.
అవగాహనా ఒప్పందం పై జనవరి 3, 2024న ఆర్ఇసి లిమిటెడ్ చైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ కుమార్ దేవాంగన్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ శ్రీ దేవదత్త చాంద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ లలిత్ త్యాగి సమక్షంలో సంతకాలు చేశారు.

ఈ సహకారం పై వ్యాఖ్యానిస్తూ, ఈ మైలురాయి ఒప్పందం దేశ పురోగతికి కీలకమైన ముఖ్య ప్రాజెక్టులను సాకారం చేయడాన్ని వేగవంతం చేసేందుకు సమన్వయ కృషికి సంకేతంగా నిలుస్తుందని, దేవాంగన్ అన్నారు. సమ్మిళిత వృద్ధిని పెంపొందించాలన్న మా నిబద్ధతలో ఈ భాగస్వామ్యం ముఖ్యమైనమలుపు అన్నారు. విద్యుత్ రంగంలో ఆర్ఇసి నైపుణ్యాలను, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నైపుణ్యాల సహోత్తేజనాన్ని రాబట్టడం ద్వారా సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేసి, సామాజిక ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకువెళ్ళే పరివర్తనాత్మక ప్రాజెక్టులకు ప్రేరకంగా ఉండాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ శ్రీ దేవదత్త చాంద్ మాట్లాడుతూ, ఈ అవగాహనా ఒప్పందం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్ఇసి విద్యుత్/ ఇంధనం (పునరావృత ఇంధనం సహా), మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ప్రాజెక్టులకు ఉమ్మడిగా ఆర్ధిక సహాయం అందించేందుకు తోడ్పడుతుందన్నారు. భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటలో ఉన్నందున మూలధన వ్యయం, ప్రైవేటు పెట్టుబడులలో పెరుగుదలను, సహకార, ఆర్ధిక తోడ్పాటును అందించే నవీన వ్యవస్థల అవసరం పెరుగడాన్ని చూస్తామన్నారు.
ఆర్ ఇసి లిమిటెడ్ & బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి
విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద 1969లో ఏర్పాటు చేసిన మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్ ఇసి లిమిటెడ్ ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, పునరావృత ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజ్, పర్యావరణ అనుకూల హైడ్రొజెన్ సహా విద్యుత్ మౌలిక సదుపాయాల రంగానికి , దీర్ఘకాలిక రుణాలను, ఇతర ఆర్ధిక తోడ్పాటును అందిస్తుంది. ఇటీవలి కాలంలో ఆర్ఇసి రహదారులు& ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రోరైలు, విమానాశ్రయాలు, ఐటి కమ్యూనికేషన్, సామాజిక & వాణిజ్య మౌలికసదుపాయాలు (విద్యా సంస్థలు, ఆసుపత్రులు), ఓడరేవులు, ఉక్కు, రిఫైనరీ తదితర రంగాలకు సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్ పనులు వంటి విద్యుతేతర మౌలిక సదుపాయాల రంగాలకు తన కార్యకలాపాలను విస్తరించింది. ఆర్ ఇసి రుణ లోన్ బుక్ రూ. 4.74 లక్షల కోట్లను దాటుతుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
సర్ మహారాజా సాయాజీరవ్ గైక్వాడ్ III, జులై 20, 1908లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలోని అగ్ర వాణిజ్య బ్యాంకులలో ఒకటి. దాదాపు 63.97% వాటాతో, దానికి భారత ప్రభుత్వమే యాజమాన్యం వహిస్తోంది. ఐదు ఖండాలలో 17 దేశాల వ్యాప్తంగా 70వేల టచ్ పాయింట్ల ద్వారా వివిధ డిజిటల్ బ్యాంకింగ్ వేదికలను ఉపయోగించి 165 మిలియన్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. ఈ వేదికల ద్వారా బ్యాంకింగ్ ఉత్పత్తులను, సేవలను నిరాటంకంగా అందిస్తోంది. బ్యాంక్ దార్శనికత దాని విభిన్న ఖాతాదారుల ఆకాంక్షలతో సరిపోలడమే కాక తమ బ్యాంక్‌తో వారి లావాదేవీలన్నీ సురక్షితమనే విశ్వాసాన్ని, భద్రతా భావాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 1993284)
సందర్శకుల సూచీ సంఖ్య : : 148