విద్యుత్తు మంత్రిత్వ శాఖ
రాజస్థాన్ ఊర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్‌కు 40 ఏళ్ల పాటు విద్యుత్ అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న జమ్ము&కశ్మీర్‌లోని రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు
प्रविष्टि तिथि:
04 JAN 2024 3:23PM by PIB Hyderabad
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, జమ్ము&కశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జేకేఎస్‌పీడీసీ) జాయింట్ వెంచర్ సంస్థ అయిన రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌పీసీఎల్), రాజస్థాన్ ఊర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, 850 మెగావాట్ల సామర్థ్యమున్న రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను 40 ఏళ్ల పాటు రాజస్థాన్ ఊర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ తీసుకుంటుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించే విద్యుత్ కేటాయింపు ప్రకారం ఈ ఒప్పందం ఉంటుంది.
ఆర్‌హెచ్‌పీసీఎల్, రాజస్థాన్ ఊర్జా వికాస్ అండ్ ఐటీ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ అధికార్ల సమక్షంలో 3 జనవరి 2024న జైపుర్‌లో పీపీఏ కుదిరింది.

***
(रिलीज़ आईडी: 1993261)
आगंतुक पटल : 221