మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
సాగర్ పరిక్రమ యాత్ర ఫేజ్-10 లో భాగంగా 3వ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని తుందుర్రు గ్రామం భీమవరం గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌లో రొయ్యల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల
మత్స్యకారుల అభ్యున్నతి; వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా వారి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి సందర్శన యొక్క ముఖ్య లక్ష్యం: శ్రీ పర్షోత్తమ్ రూపాలా
పడవలు, ఐస్ బాక్స్‌తో కూడిన ద్విచక్ర వాహనం వంటి ఆస్తులతో లబ్ధిదారులకు ప్రదానం చేశారు, ఎంట్రప్రెన్యూర్ మోడల్ కింద చెక్కులు సర్టిఫికెట్లను పంపిణీ చేసారు మరియు మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ లను శ్రీ రూపాలా మంజూరు చేసారు
Posted On:
03 JAN 2024 7:08PM by PIB Hyderabad
సాగర్ పరిక్రమ యాత్రఫే జ్-10 లో భాగంగా 3వ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని తుందుర్రు గ్రామం భీమవరం గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌లోని రొయ్యల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కేంద్ర మత్స్య, పశుసంవర్థక మరియు పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్‌తో కలిసి కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా సందర్శించి పరిశీలించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అంతర్వేది పాలెం వద్దకు యాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన మత్స్యకారులు, మత్స్యరైతులు, మత్స్యకార మహిళా గ్రూపు ప్రతినిధులు, ఆక్వా రైతు ప్రతినిధి వంటి లబ్ధిదారులతో కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా మరియు ఇతర ఉన్నతాధికారులు సంభాషించారు. చాలా మంది లబ్ధిదారులు తమ క్షేత్ర స్థాయి అనుభవాలను శ్రీ రూపాలాతో పంచుకున్నారు. వారి సమస్యలను ప్రస్తావించారు. అలాగే వారి జీవితంలో కే సి సి మరియు పీ ఎం ఎం ఎస్ వై పథకం ప్రవేశపెట్టిన అద్భుతమైన సహకారాన్ని ప్రశంసించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) మంజూరైన మత్స్యకారులు, మత్స్య రైతులు మరియు ఇతర లబ్ధిదారులకు శ్రీ రూపాలా ప్రదానం చేశారు.
సాగర్ పరిక్రమ దశ-10 యాత్ర కొనసాగి పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంకు చేరుకుంది. ఇక్కడ మత్స్యకారుల అభ్యున్నతిని కేంద్ర మంత్రి శ్రీ రూపాలాతో పంచుకున్నారు. వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా వారి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఈ సందర్శన యొక్క ప్రధాన లక్ష్యం. తీరప్రాంత రాష్ట్రాల పర్యటనలో మత్స్య రంగంలో పనిచేస్తున్న ఇతర వాటాదారుల సమస్యలను కూడా అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. కేసీసీ, పీఎంఎంఎస్‌వై వంటి పలు పథకాల ద్వారా లబ్ధిదారులకు సమాచారం అందించడం, అవగాహన పెంచడం, ప్రయోజనాలను అందించడం కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా “వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర” పేరుతో గ్రామీణ అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ఇంకా, పిఎంఎంఎస్‌వై మరియు కెసిసి వంటి పథకాల క్రింద ఆస్తులు కలిగిన కోస్తా ప్రాంతంలోని లబ్ధిదారులను మరియు ప్రతినిధులను శ్రీ పర్షోత్తం రూపాలాతో సంభాషించి సత్కరించారు. మత్స్యకారులు తమ సమస్యలను ఎత్తిచూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై), ఎఫ్‌ఐడిఎఫ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) తదితర పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించినందుకు ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.
డా. ఎల్ మురుగన్ మత్స్య రంగంలో జీవనోపాధి అవకాశాల కల్పనపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన నాణ్యత మరియు ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2019లో ప్రత్యేక మత్స్యశాఖ ఏర్పాటు గురించి ప్రభుత్వం చేసిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే ఆమోదించారని ఆయన తెలిపారు.
శ్రీ పర్షోత్తం రూపాలాతో పాటు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి శ్రీ సీదిరి అప్పల రాజు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వీ. గీత సమక్షంలో ఎం ఓ ఎస్ డా. ఎల్ మురుగన్మరియు ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారులు, మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్ యజమానుల సంఘం ప్రతినిధులు, ఎండు చేపల విక్రేతల సంఘం ప్రతినిధులు, ఇతర పిఎంఎంఎస్‌వై మరియు కెసిసి లబ్ధిదారులతో కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా సంభాషించారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ సదుపాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా కోటపాలెంలో కోనా బే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మంత్రి ఆమోద పత్రాన్ని అందజేశారు. శ్రీ రూపాలా (పడవలు, ఐస్ బాక్స్‌తో కూడిన ద్విచక్ర వాహనం)ఆస్తులను లబ్ధిదారులకు ప్రదానం చేశారు. పిఎంఎంఎస్‌వై పథకం కింద ఎంటర్‌ప్రెన్యూర్ మోడల్ కింద చెక్కులు, సర్టిఫికెట్లను పంపిణీ చేసారు మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ లను శ్రీ రూపాలా మంజూరు చేసారు
లబ్ధిదారులు తమ సొంత అనుభవాలను కూడా వివరించారు, వారి సవాళ్లను ఎత్తిచూపారు మరియు మత్స్యకారులు మరియు మత్స్యకారుల జీవితాలపై కెసిసి మరియు పిఎంఎంఎస్‌వై పథకాలు మెరుగైన ప్రభావాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం కాకినాడలో కొనసాగుతుంది, ఇక్కడ శ్రీ పర్షోత్తమ్ రూపాలా, ఇతర ప్రముఖులతో ఫీడ్ పరిశ్రమ, హేచరీ ఆపరేటర్లు మరియు ఇతర వాటాదారులతో సంభాషిస్తారు. సాగర్ పరిక్రమ ఫేజ్-10 కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 7,500 మంది మత్స్యకారులు, మత్స్యకార వాటాదారులు మరియు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల తీరప్రాంతం అనుకూలమైన మరియు వైవిధ్యమైన నీటి వనరులతో అలరారుతోంది. దేశంలో చేపల ఉత్పత్తికి ఇది చాలా దోహదపడుతుంది. సముద్ర మత్స్య సంపదే కాకుండా, రాష్ట్రం లోతట్టు ప్రాంతంలో మత్స్య రంగ కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది.
***
(Release ID: 1993085)
Visitor Counter : 149