పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
రిటైలింగ్ ఈ20 అవుట్లెట్ ల సంఖ్య ఇప్పుడు 9300 కంటే ఎక్కువగా ఉంది. 2025 నాటికి ఇవి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పూరి
గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ విజయవంతంగా ప్రారంభించడంతో జీవ ఇంధనాల సరఫరా చైన్లో భారతదేశం ప్రపంచ నాయకత్వ పాత్ర పోషిస్తోంది: హర్దీప్ ఎస్ పూరి
ఈ అండ్ పీ రంగాన్ని పెంపొందించడానికి తీసుకున్న చర్యలను మంత్రి హైలైట్ చేశారు; ఈఈజెడ్లో "నో గో" ప్రాంతాలు దాదాపు 99% తగ్గాయి.
Posted On:
03 JAN 2024 4:57PM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారతదేశ జీడీపీ వృద్ధి 7.7%గా నమోదైందని పెట్రోలియం & సహజ వాయువు మరియు గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈరోజు తెలిపారు. ఈ సందర్భంగా భారత వృద్ధి-శక్తి సహసంబంధం గురించి ఆయన వివరిస్తూ.. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా, 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా, 3వ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా, 4వ అతిపెద్ద ఎల్ఎన్జీ దిగుమతిదారుగా, ప్రపంచంలో 4వ అతిపెద్ద రిఫైనర్ మరియు 4వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ వాటాదారుగా ఉన్నందున వృద్ధి-శక్తి సహసంబంధం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
ఈ రోజు ఇక్కడ మీడియాతో సంభాషించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. భారతదేశ అన్వేషణ & ఉత్పత్తి (ఈ అండ్ పీ) రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడారు. ఈఈజెడ్లో "నో గో" ప్రాంతాలు దాదాపు 99% తగ్గాయని మరియు ఈ&పీ యాక్టివిటీ కోసం 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పుడు ఈఈజెడ్లో ఉచితం అని ఆయన చెప్పారు. ఈరోజు వరకు నామినేషన్, ప్రీ-నెల్‌ప్, ఎన్‌ఇఎల్‌పి, సిబిఎం, డిఎస్‌ఎఫ్ మరియు ఓఎఎల్‌పి/హెల్ప్ కింద మొత్తం కార్యాచరణ ప్రాంతం (యాక్టివ్) 3.27 లక్షల చదరపు కి.మీ అని ఆయన చెప్పారు.
భారతదేశం యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ యొక్క విజయాల గురించి కూడా మంత్రి మాట్లాడారు. వీటితోపాటు:
విదేశీ మారకపు పొదుపు (2014–-2023) రూ.78,118 కోట్లు
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి (2014–-2023) 426 లక్షల మెట్రిక్ టన్నులు
ముడి చమురు ప్రత్యామ్నాయం సాధించబడింది (2014-–2023) 142 లక్షల మెట్రిక్ టన్నులు
ఓఎంసీల ద్వారా డిస్టిల్లర్‌లకు చెల్లించిన మొత్తం (2014–-2023) రూ.1,15,623 కోట్లు
రైతులకు చెల్లించిన మొత్తం (2014-–2023) రూ.69,374 కోట్లు
ఈఎస్వై 2022-–23 సమయంలో ఇథనాల్ కలపడం వల్ల సుమారుగా 509 కోట్ల లీటర్ల పెట్రోలు ఆదా అవుతుందని, ఫలితంగా రూ. 24,300 కోట్ల విదేశీ మారకద్రవ్యం మరియు 108 లక్షల మెట్రిక్ టన్నుల నికర కార్బన్ డయాక్సైడ్ తగ్గింపుతో సహా రైతులకు దాదాపు రూ.19,300 కోట్ల వేగవంతమైన చెల్లింపు చేయగలిగామన్నారు.
E20 రిటైలింగ్ రిటైల్ అవుట్‌లెట్‌ల సంఖ్య ఇప్పుడు 9300 కంటే ఎక్కువగా ఉందని, 2025 నాటికి దేశం మొత్తం కవర్ చేస్తామని పెట్రోలియం మంత్రి తెలిపారు.
సీబీజీ బ్లెండింగ్ ఆబ్లిగేషన్ (సీబీఓ) గురించి కూడా మంత్రి మాట్లాడారు. ఇది 2024-–2025 ఆర్థిక సంవత్సరం వరకు స్వచ్ఛందంగా ఉంటుంది. మరియు 2025–-26 ఆర్థిక సంవత్సరం నుండి తప్పనిసరి బ్లెండింగ్ బాధ్యత ప్రారంభమవుతుంది.
సెప్టెంబరు 2023లో గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ (జీబీఏ)ని విజయవంతంగా ప్రారంభించడం ద్వారా జీవ ఇంధనాల సరఫరా గొలుసులో భారతదేశం గ్లోబల్ లీడర్‌షిప్ పాత్రను పోషించిందని ఆయన అన్నారు. “డిసెంబర్‌లో జరిగిన కాప్ 28లో సుస్థిరత ప్రయాణంలో జీబీఏని కీలక మార్గంగా ప్రోత్సహించడంలో భారతదేశం విజయవంతమైంది. . 2023 జనవరి 2024లో షెడ్యూల్ చేయబడిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో భారతదేశం యొక్క ఎజెండాలో జీబీఏ కూడా ఒక ముఖ్యమైన భాగం” అని ఆయన చెప్పారు.
ప్రైమరీ ఎనర్జీ మిక్స్‌లో సహజవాయువు వాటాను ప్రస్తుతమున్న 6.3% నుండి 15%కి పెంచడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. వచ్చే 5-6 సంవత్సరాలలో సహజవాయువు మౌలిక సదుపాయాలపై $67 బిలియన్ల పెట్టుబడి. ఇది 2030 నాటికి గ్యాస్ వినియోగంలో మూడు రెట్లు పెరుగుతుంది, ప్రస్తుత స్థాయి 155 ఎంఎంఎస్సీఎండీ నుండి 500 ఎంఎంఎస్సీఎండీకి పైగా పెరుగుతుందన్నారు.
మే 2014 నుండి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్ పురోగతిని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రస్తావిస్తూ... సంఖ్య పెరుగుదలను హైలైట్ చేశారు. గ్యాస్ కోసం సీజీడీ నెట్‌వర్క్‌లు 2014లో 53 నుండి 2023లో 300కి; పీఎన్జీ కనెక్షన్లు 2014లో 25.4 లక్షల నుండి 2023లో 1.19 కోట్లకు పెరగడం; సీఎన్జీ స్టేషన్లు 2014లో 738 నుండి 2023లో 6088కి చేరుకున్నాయి. సీజీడీ కవరేజీ (జనాభా వారీగా శాతాల్లో) 2014లో 13.27 % నుండి 2023లో 98%కి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 2014లో 2023లో 88%కి చేరుకుంది. 12వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్ యొక్క ఇటీవలి ప్రారంభం కవరేజ్ ప్రాంతం మరియు జనాభా యొక్క బ్యాలెన్స్ భాగాన్ని కవర్ చేస్తుంది.
2023లో పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై అందించిన వివరాలివి.
***
(Release ID: 1993079)
Visitor Counter : 140