రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఉత్తర/మధ్య అరేబియా సముద్రంలో అప్రమత్తతతో నిఘా కొనసాగిస్తున్న భారత నౌకాదళ బృందాలు

Posted On: 03 JAN 2024 6:04PM by PIB Hyderabad

భారత నౌకాదళం ఉత్తర/మధ్య అరేబియా సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో సముద్ర భద్రతను పర్యవేక్షిస్తోంది. ఈ మిషన్‌లో భాగంగా, భారత నౌకాదళ నౌకలు, విమానాలు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయి, మెరుగైన నిఘాను నిర్వహిస్తున్నాయి.

గత వారం రోజులుగా, ఈ ప్రాంతంలోని భారత నౌకాదళ ప్రత్యేక బృందాలు పెద్ద సంఖ్యలో మత్స్యకారుల పడవల్లో సోదాలు నిర్వహించాయి.

భారత నౌకాదళ సముద్ర నిఘా విమానం, ఆర్‌పీఎఏలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి.

ఐమాక్‌, ఐఎఫ్‌సీ ఐఓఆర్‌ సముద్ర రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నాయి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో వెళుతున్న భారతీయ వ్యాపార నౌకలకు భద్రత కల్పిస్తున్నాయి. ఈఈజెడ్‌లో మెరుగైన నిఘా కోసం భారతీయ తీర రక్షణ దళంతో భారత నౌకాదళం సమన్వయం చేసుకుంటోంది.

జాతీయ సముద్ర సంస్థల సమన్వయంతో మొత్తం పరిస్థితిని భారత నౌకాదళం నిశితంగా పర్యవేక్షిస్తోంది, ఆ ప్రాంతంలోని వ్యాపార నౌకలు, నావికులకు భద్రత కల్పిస్తోంది.

***


(Release ID: 1993076) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi