ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

త్రేతా యుగం నుంచి డిజిటల్ యుగం లోకి రామజన్మభూమి అయోధ్య

Posted On: 27 DEC 2023 4:57PM by PIB Hyderabad

 రాముడి జన్మస్థలం, నాగరికతకు లోతైన ఆధ్యాత్మికంగా భారతదేశంలో అత్యంత  ప్రాముఖ్యత ఉన్నఅయోధ్య సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ  డిజిటల్ యుగంలోకి వేగంగా అడుగులు వేస్తోంది.  శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రోజు నుంచి అయోధ్య అభివృద్ధిలో నూతన శకం ప్రారంభమైంది. 

అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రపంచ పర్యాటక కేంద్రంగా, స్మార్ట్ సిటీగా అయోధ్యను తీర్చిదిద్దడానికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. నగరంలో  గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. అత్యంత ఆధునిక విధానంలో నిర్మించే టౌన్‌షిప్‌ లో భక్తులు బస చేయడానికి వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఆశ్రమాలు, హోటళ్లు, వివిధ రాష్ట్రాల భవనాలు దీనిలో నిర్మించాలని భావిస్తున్నారు. పర్యాటకులకు సమాచారం అందించడానికి ఒక   కేంద్రం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు అవుతుంది. ప్రపంచ స్థాయి మ్యూజియం కూడా నిర్మిస్తారు.సరయూ నది ,దాని ఘాట్‌ల చుట్టూ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. సరయూ నదిలో ప్రతి రోజు  క్రూయిజ్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రతి భారతీయుడి సాంస్కృతిక స్పృహలో అయోధ్య ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధికి చిహ్నంగా అయోధ్య ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. భారతీయల ఆకాంక్షలకు అనుగుణంగా  సంప్రదాయాలు, సాంకేతిక పురోగతిని మేళవించి అయోధ్య అభివృద్ధి  పనులు తుది ఘట్టానికి చేరుకున్నాయి. 

పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు:

అయోధ్యలో భారీగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. రహదారులను విస్తరిస్తున్నారు. బహుళస్థాయి కార్ పార్క్‌లతో సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. దేవాలయాల పునరుద్ధరణ,  సరయూ నదిపై ఘాట్‌ల ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ, అభివృద్ధి కార్యాక్రమాలతో అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సరయూ నదిలో పడవ నడుపుతున్నవారు,హనుమాన్ గర్హిలో పువ్వులు, ప్రసాదాలు విక్రయిస్తున్నవారు డిజిటల్ చెల్లింపుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు." డిజిటల్ చెల్లింపులు నా జీవితాన్ని సులభతరం చేశాయి. చిల్లర కోసం పరుగులు తీసే పని తప్పింది. యూపిఐ ద్వారా జరుగుతున్నా చెల్లింపులు నా కొడుకు బ్యాంక్ ఖాతాలోకి వెళ్తున్నాయి. దీనివల్ల మాకు ఎంతో ఉపశమనం కలిగింది" అని సరయూ నది ఒడ్డున ఉన్న పడవ నడుపుతున్న అన్నూ మాంఝీ అన్నారు.

అయోధ్య అంతా డిజిటల్ లావాదేవీలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. నది ఒడ్డున పూజా సామాగ్రిని విక్రయించే దుకాణదారుడు శ్రీ రామ్‌ధన్ యాదవ్ QR కోడ్‌ల ద్వారా చెల్లింపులను స్వీకరిస్తుంన్నారు.  ఈ విధానం  విక్రేతలు, వినియోగదారులకు సౌలభ్యంగా ఉంది. . ఒకరోజు ఒక భక్తుడు  పూజ సామాగ్రి కోసం ఇచ్చిన  100 రూపాయల నోటు తీసుకోడానికి నిరాకరించిన ఒక దుకాణ యజమాని . "నా దగ్గర చిల్లర  లేదు కాబట్టి దయచేసి ఆన్‌లైన్‌లో చెల్లించండి" అని చెప్పడంతో ఆ భక్తుడు డిజిటల్ విధానంలో 100 రూపాయలు చెల్లించి  వెళ్లిపోయాడు.  

సాయంత్రం హారతి సమయంలో కనక్ భవన్‌లో కూడా  కౌంటర్లలో క్యూఆర్ కోడ్‌ల ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నారు.  భక్తులు సులువుగా విరాళాలు అందిస్తున్నారు.2,000 రూపాయల వరకు విరాళాలు భౌతికంగా చేయవచ్చు, కానీ అంతకు మించి ఏదైనా ఆన్‌లైన్ చెల్లింపు అవసరం, QR కోడ్‌ ఉపయోగించి  చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.  

యూపీఐ చెల్లిపూలు జీవితాన్ని సులభం చేశాయి అని అయోధ్య కాంట్‌లోని సదర్ బజార్ ప్రాంతంలో నివసించే 40 ఏళ్ల మహమ్మద్ రషీద్ ఖాన్ పేర్కొన్నారు.' నగదు లావాదేవీలు జరిగినప్పుడు చిల్లర అతి పెద్ద సమస్యగా ఉండేది.  ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల వల్ల  చిల్లర  తలనొప్పి పోయింది.  బ్యాంకు ఖాతాలో డబ్బు తక్షణమే  సురక్షితంగా చేరుతుంది, ”అని  ఖాన్ అన్నారు.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు: 

ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ‘డిజిటల్ ఇండియా' సాధన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా కార్యక్రమం అమలు జరుగుతోంది. 

ప్రభుత్వం అమలు చేసిన వివిధ కార్యక్రమాల వల్ల ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.మొత్తం డిజిటల్ చెల్లింపు లావాదేవీల పరిమాణం 2017-18 ఆర్థిక సంవత్సరంలో  2,071 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం  2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,462 కోట్లకు చేరింది. డిజిటల్ చెల్లింపుల వార్షిక వృద్ధి రేటు  45% వరకు ఉంది" అని ఇటీవల  కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసన్‌రావ్ కరద్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 26 వరకు మొత్తం 12,020 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి.2023  జూలై 26  వరకు దేశంలో 14.92 లక్షల కంటే ఎక్కువ బీమ్  ఆధార్ పే లావాదేవీలు  అమలు జరిగాయి.  డీడీ  న్యూస్ నివేదిక ప్రకారం, ₹7,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి.  

2023 జనవరి 23న శ్రీ రామ జన్మభూమి ప్రారంభోత్సవానికి అయోధ్యలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.   మౌలిక సదుపాయాల పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులు,  పర్యాటకులను స్వాగతించడానికి అయోధ్య  డిజిటల్‌గా కూడా సిద్ధంగా ఉంది. భౌతిక సౌలభ్యం, ఆధ్యాత్మిక సాంత్వన  కలయిక సందర్శకులకు మరపురాని మధురానుభూతిని అందిస్తుంది. 

 

***



(Release ID: 1991071) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi