శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అరటినార తీసే వినూత్న ప్రాజెక్టుకు సంబంధించి టిడిబి`డిఎస్‌టి నుంచి రూ18.08 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందిన ఓమ్‌ బనానా క్రాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.


అరటి వ్యర్థాల విషయంలో విప్లవాత్మక ఆవిష్కరణలు: అరటినారను తీసేందుకు ఆధునిక పరికరాలను రూపొందించిన ఓమ్‌ బనానాక్రాఫ్ట్స్‌.

వ్యవసాయానికి సాధికారత : ఓమ్‌ బనానా క్రాఫ్ట్స్‌ వినూత్నంగా రూపొందించిన అరటినారను తీసే ప్రాజెక్టుకు 18.08 లక్షల రూపాయలు మంజూరు చేసిన టిడిబి`బిఎస్‌టి.

Posted On: 27 DEC 2023 5:28PM by PIB Hyderabad

 క్షేత్రస్థాయిలో ఆవిష్కరణలు, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే వ్యూహాత్మక లక్ష్యంతో టెక్నాలజీ డవలప్‌మెంట్‌ బోర్డు (టిడిబి), మధురైకి చెందిన మెస్సర్స్‌ ఓమ్‌ బనానా క్రాఫ్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వినూత్న ఆవిష్కరణకు 18.08 లక్షల రూపాయల మేరకు ఆర్థికంగా మద్దతు నందించింది. అరటి నార వెలికితీసే వినూత్న ప్రాజెక్టుకు సంబంధఙంచి ఆధునిక యంత్రపరికరాల అభివృద్ధి విలువ జోడిరపునకు ఈ ఆర్థిక సహాయం లభించింది.
అరటి చెట్ల నుంచి చాలా సందర్భాలలో దాని కాండం వ్యర్ధాలలో కలిసిపోతుంటుంది. అరటి కాండాన్ని సద్వినియోగం చేసుకుని దాని నుంచి నార తీసి వివిధ ఉత్పత్తులకు ఉపయోగించేందుకు  రైతు దార్శనికుడైన మురుగేశన్‌, అరటినార తీసి వాటి నుంచి తాడును యంత్రాల ద్వారా తీసే ప్రక్రియను అభివృద్ధిచేశారు.ఈ విధానంలో ఎలాంటి కష్టం లేకుండా అరటి కాండం నుంచి యంత్రాల ద్వారా నారతీయడానికి వీలు కలుగుతుంది. తద్వారా ఈ నారతో పలు రకాలుగా పర్యావరణ హితకరమైన ఉత్పత్తులను తయారు చేయడానికి వీలు కలుగుతుంది.

ఓం బనానా క్రాఫ్ట్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు  రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలను పరిశీలించి వాటికి పరిష్కారం సాధించారు. ఇందుకు అనుగుణంగా అరటి వ్యర్థాలను సద్వినియోగం చేసేందుకు యంత్రాన్ని రూపొందించారు. అరటి నార ప్రాసెఓసింగ్‌ యంత్రం , దాని నిర్వహణ పద్ధతికి పేటెంట్‌ తీసుకున్నారు.ఇది  ఎక్కువమంది శ్రామికులు అవసరం లేకుండా సులభంగా నారతీసి దానిని వివిధ ఉత్పత్తులలో వినియోగించుకునేందుకు వీలుకల్పిస్తోంది. తద్వారా అరటికాండం వ్యర్థంగా పోకుండా దానినుంచి ఉప ఉత్పత్తులకు వీలు కలుగుతోంది.
అరటి నార నుంచి తయారు చేసిన తాళ్లను , స్థానిక మహిళలు అత్యద్భుతమైన రీతిలో , తమ కళానైపుణ్యాలను ఉపయోగించి  చాపలు, బ్యాగ్‌లు, ఇతర ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఇవి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ పరివర్తనాత్మక చర్య మహిళలకు ఆర్థికంగా అవకాశాలు మెరుగుపడడమే కాక, చేతివృత్తులను ప్రోత్సహించడానికి, వారి గృహ బాధ్యతలను నెరవేర్చేలాచేయడానికి దోహదపడుతోంది.

 చెత్తకింద పారేసే అరటి కాండం పై పొరను స్థానిక రైతులనుంచి సేకరించడం వల్ల రైతులకుఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. మరో రకంగా ఇదిపర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. అరటి కాండం వ్యర్థాలనుంచి వచ్చిన దానితో నార తయారు చేసి , తద్వారా ఉప ఉత్పత్తులు చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతోంది.
గ్రామీణాభివృద్ధికి, సుస్థిర వ్యవసాయానికి దోహదపడే ప్రాజెక్టులకు తాము మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు టిడిబి కార్యదర్శి శ్రీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. మెస్సర్స్‌ ఓమ్‌ బనానా క్రాఫ్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తన ముందుచూపుతో, వినూత్న ఆలోచనలతో వ్యవసాయ వ్యర్థాలను ఏరకంగా విలువైన ఉత్పత్తులుగా తీర్చిదిద్దవచ్చో , పర్యావరణానికి ఏరకంగా మేలు చేయవచ్చో తెలియజెప్పిందన్నారు. సాంకేతిక అభివృద్ధికి దోహదపడే చర్యలతోపాటు, రైతుల జీవితాలను మెరుగుపరిచే, గ్రామీణాభివృద్ధికి దోహదపడే చర్యలకు అలాగే ప్రభుత్వ దార్శనికత అయిన వ్యవసాయరంగానికి సాధికారత కల్పించే లక్ష్యాలకు అనుగుణంగా ఉండే చర్యలకు టిడిబి అంకితమై ఉందని ఆయన అన్నారు.

***


(Release ID: 1991064) Visitor Counter : 99


Read this release in: English , Urdu