యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడల కేంద్రంగా బెంగళూరు అభివృద్ధి - కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు ప్రాంతీయ కేంద్రం సందర్శించి యువత, ప్రముఖ క్రీడాకారులతో కలిసి ' మై భారత్ డైలాగ్' లో పాల్గొన్న మంత్రి
Posted On:
23 DEC 2023 5:06PM by PIB Hyderabad
సరైన వాతావరణ పరిస్థితులు, ఉత్తమ క్రీడా మౌలిక సదుపాయాలు కలిగిన బెంగళూరు త్వరలో జాతీయ క్రీడల కేంద్రంగా గుర్తింపు సాధిస్తుందని కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.బెంగళూరు ప్రజలు క్రీడలు అథ్లెటిక్స్ పట్ల చూపిస్తున్న ఉత్సాహాన్ని మంత్రి ప్రశంసించారు. అనుభవజ్ఞులైన అథ్లెట్లు చురుగ్గా పని చేస్తూ స్వంత అకాడమీలను ప్రారంభించి , శిక్షణ లేదా మూల్యాంకన శిబిరాలు నిర్వహిస్తూ క్రీడా రంగంలో దేశం అభివృద్ధి సాధించడానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు అని మంత్రి అన్నారు.
మై భారత్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం, స్వచ్చందంగా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సోషల్ మీడియాలో మంచి కార్యక్రమాలను పోస్ట్ చేయడం కోసం రూపొందించిన ' మై భారత్' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ ఠాకూర్ ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసేందుకు మై భారత్‌లో భాగంగా తమ స్ఫూర్తిదాయకమైన కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మంత్రి క్రీడాకారులను కోరారు.
3000 మంది అథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పాల్గొన్న ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించిన మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ సాధించిన విజయాలను మంత్రి వివరించారు. . తమిళనాడు లో తదుపరి రాబోయే ఖేలో ఇండియా యూత్ లో దేశం అన్ని ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం ద్వారా ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు సహకారం అందిస్తున్నామని శ్రీ ఠాకూర్ వివరించారు. వికసిత భారత్ సాధనకు క్రీడల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు సహకరిస్తాయని ఆయన అన్నారు.
ఈరోజు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్‌లో 330 పడకలు, 300 పడకలతో కొత్తగా నిర్మించిన భవనాలు, 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ను మంత్రి ప్రారంభించారు.
రూ. 28.72 కోట్ల రూపాయల ఖర్చుతో 330 పడకల హాస్టల్ను నిర్మించారు. అటాచ్డ్ టాయిలెట్‌తో కూడిన 110 గదులతో గ్రౌండ్+5 విధానంలో దీనిని నిర్మించారు.అథ్లెట్ల కోసం అన్ని సౌకర్యాలు . క్రీడలు వినోదం కోసం అన్ని సౌకర్యాలతో భావన నిర్మాణం జరిగింది. మహిళల కోసం హాస్టల్‌కు నేషనల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఫండ్ నిధులు విడుదల చేసింది. దీనికి కోల్ ఇండియా లిమిటెడ్ రూ. 25 కోట్లు అందించింది.
ఖేలో ఇండియా పథకం కింద రూ.26.77 కోట్ల రూపాయల ఖర్చుతో 300 పడకల పురుషుల హాస్టల్‌ను నిర్మించారు. . సుమారు ఒక ఎకరం స్థలంలో నిర్మించిన హాస్టల్ లో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. , గ్రౌండ్ + 4 అంతస్తులతో భవన నిర్మాణం జరిగింది.
రూ. 13.86 కోట్ల ఖర్చుతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను నిర్మించారు. ఖేలో ఇండియా కింద నిధులు విడుదల అయ్యాయి. 400మీ, 8 లేన్ , అదనంగా రెండు లేన్‌లు నేరుగా గ్రాస్ ఇన్‌ఫీల్డ్‌తో ఉంటాయి. సింథటిక్ ట్రాక్ పూర్తి PUR క్లాస్-1, కేటగిరీ-5 కోసం IAAF సర్టిఫికేషన్‌తో ఉంది. దీనితో పాటు 8 పూర్తి లేన్‌లు, 2 లేన్‌ల సింథటిక్ ట్రాక్‌లు , శిక్షణ కోసం 500m క్లే ట్రాక్ ,100m ఇసుక ట్రాక్ నిర్మాణం కూడా జరిగింది. . అథ్లెటిక్ ట్రాక్ ఉపరితలం క్రింద హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేర్ రెండూ ఏకీకృతమై టైమింగ్ గేట్స్ టెక్నాలజీ వంటి ప్రత్యేక లక్షణాలను ట్రాక్ కలిగి ఉంది. అథ్లెటిక్స్ శిక్షణా సౌకర్యం కోసం చుట్టుకొలత ఫెన్సింగ్‌తో 250 లక్స్ హై మాస్ట్‌ల లైటింగ్ సౌకర్యం కూడా కల్పించారు.
నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో బెంగళూరు సాయ్ లో 1245 మందికి వసతి కల్పించడానికి వీలవుతుంది. .
ప్రముఖ క్రీడాకారులు శ్రీమతి అశ్విని నాచప్ప, శ్రీ ఎస్.డి. ఈషాన్ మరియు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలంకరించారు.
మై భారత్ డైలాగ్‌లో భాగంగా శ్రీ ఠాకూర్ 1100 మందిని ఉద్దేశించి ప్రసంగించారు, ఇందులో నెహ్రు యువ కేంద్రాల ప్రతినిధులు, సాయ్ అధికారులు, ప్రముఖ క్రీడాకారులు, ఆసియా క్రీడల పతక విజేతలు -శ్రీ మన్‌ప్రీత్ సింగ్, శ్రీ అవినాష్ సాబ్లే, పరుల్, ప్రియాంక గోస్వామి, శ్రీమతి ఆన్సి సోజన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత, ప్రముఖ క్రీడాకారులు, ఆసియా, పారా ఆసియా క్రీడల పతక విజేతలను మంత్రి సత్కరించారు.చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 107 పతకాలు, పారా గేమ్స్‌లో 111 పతకాలు సాధించి భారత్ విజయం సాధించిందని మంత్రి తెలిపారు. . ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ సాధించిన విశేష విజయాన్ని ఆయన అభినందించారు. అథ్లెటిక్స్‌లో 29 పతకాలకు గాను 14 పతకాలు, కబడ్డీ పురుషులలో స్వర్ణం, హాకీ పురుషులలో స్వర్ణం, హాకీ ఉమెన్‌లో కాంస్యం, మహిళల డబుల్స్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం, పారా అథ్లెటిక్స్‌లో గణనీయమైన కృషితో ఆసియా క్రీడల్లో భారత్ విజయానికి సహకరించినందుకు సాయ్ బెంగళూరును అభినందించారు.
సాయ్ ప్రాంతీయ కేంద్రం బెంగళూరు వసతి గృహంలో బస చేసిన మంత్రి నేషనల్ కోచింగ్ క్యాంప్ (NCC), నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCOE) లో కల్పిస్తున్న సౌకర్యాలు, కొనసాగుతున్న శిక్షణను సందర్శించారు. భోజనశాల ను సందర్శించి క్రీడాకారులతో కలిసి భోజనం చేశారు.
***
(Release ID: 1990165)
Visitor Counter : 118