హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చండీఘర్ లో రూ.368 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ పార్లమెంటు దేశంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే మూడు చారిత్రాత్మక బిల్లులను చట్టంగా మార్చింది.

మోదీ ప్రభుత్వం చేసిన ఈ మూడు చట్టాలు లొసుగులు లేని సంపూర్ణ న్యాయ వ్యవస్థను సృష్టిస్తాయి.

డిసెంబర్ 2024 నాటికి అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మూడు చట్టాల అమలు కోసం మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ వేర్, , మానవ వనరుల శిక్షణ, కోర్టుల పూర్తి కంప్యూటరీకరణ జరుగుతుంది.

క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే మూడు చట్టాలపై దేశ పార్లమెంటులో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతిని అనుకరించే హేయమైన చర్యకు పాల్పడ్డారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి గౌరవానికి మేము ఎప్పుడూ భంగం కలిగించలేదు: అలా జరగడానికి అనుమతించలేదు

మనకు బోధించే వారే రాజ్యాంగ పదవుల గౌరవాన్ని నిలబెట్టడంలో భారతదేశంలోని ప్రకాశవంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయంపై తీవ్రంగా దాడి చేశారు.

ఈ చట్టాలను అమలు చేయకముందే దేశంలోని 99.93 శాతం పోలీస్ స్టేషన్లను అంటే 16,733 పోలీస్ స్టేషన్లను ఆన్ లైన్ లో అనుసంధానం చేసే పనిని మోదీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది:

Posted On: 22 DEC 2023 8:31PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు చండీగఢ్ లో రూ.368 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.    , ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ బన్వరిలాల్ పురోహిత్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ,  ఈ రోజు రూ.368 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులను ప్రారంభించామని, రూ.32 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశామని చెప్పారు. చండీగఢ్ ఆధునిక ఊహాశక్తితో నిర్మించిన సంపూర్ణ నగరమని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల పలు నగరాలు ప్రగతి పధం లో ముందుకు సాగుతున్నాయని, ఈ పోటీలో చండీఘఢ్ తనను తాను రుజువు చేసుకోవాల్సి ఉంటుందని, మొదటి స్థానాన్ని నిలుపుకోవ డానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని శ్రీ షా అన్నారు.

ఈ రోజు సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో పరిశుభ్రత, విద్య, భద్రత, నివాస సౌకర్యాలు, ఉన్నత విద్యకు సంబంధించిన అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. చండీగఢ్ భద్రత కోసం కొన్ని వాహనాలకు కూడా పచ్చజెండా ఊపామని, 744 మంది యువతకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ గా నియామక పత్రాలు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. చండీగఢ్ పోలీసులు క్షేత్రస్థాయిలో బీట్ అనే కాన్సెప్ట్ ను చాలా మంచి పద్ధతిలో విజయవంతంగా పునరుద్ధరించారని ఆయన అన్నారు. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల పోలీసులు చండీగఢ్ పోలీసులు అనుసరిస్తున్న విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఈ వ్యవస్థను అంగీకరించారని ఆయన అన్నారు. పోలీసులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లను, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎదుర్కోవడానికి హ్యాకథాన్ ద్వారా యువతను భాగస్వామ్యం చేయడంపై చర్చలు జరిగాయని శ్రీ షా చెప్పారు. నేడు మొదటి, రెండు, మూడు స్థానాలు సాధించిన జట్లకు రివార్డులు ఇచ్చినట్టు చెప్పారు.  దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ పరిజ్ఞానాన్ని దేశ సమస్యల పరిష్కారానికి ఉపయోగించేలా స్ఫూర్తిని నింపనున్నారు. సైబర్ ఆపరేషన్ అండ్ సెక్యూరిటీ సెంటర్ (సి ఇఎన్ సి ఒ పి ) ని కూడా ఇవాళ ప్రారంభించినట్లు హోంమంత్రి తెలిపారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాలను పార్లమెంటు ఆమోదించిన మరుసటి రోజే చండీగఢ్ లోని సైబర్ ఆపరేషన్ అండ్ సెక్యూరిటీ సెంటర్ (సిఇఎన్ సిఒపిఎస్)లో చట్టాల అమలును కేంద్ర హోం మంత్రి సమీక్షించారు.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నిన్ననే దేశ పార్లమెంటు దేశంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే మూడు చారిత్రాత్మక బిల్లులను చట్టంగా మార్చిందని శ్రీ అమిత్ షా తెలిపారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా యావత్ దేశ న్యాయ వ్యవస్థ పనిచేయాలని ఆయన అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి మన చట్టాలు వాటికవి సిద్ధం చేసుకోవాలని, ఇందుకోసం కనెక్టివిటీ నుండి హార్డ్ వేర్ వరకు అన్ని సౌకర్యాలతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించాలని, తద్వారా షెడ్యూల్డ్ భాషలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి, కనెక్ట్ కావడానికి వీలవుతుందని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్, డీజీపీ కార్యాలయం, కోర్టు, జైలు, ఎఫ్ఎస్ఎల్, ప్రాసిక్యూటర్ కార్యాలయం, సచివాలయం ఒకదానికొకటి అనుసంధానం అయ్యేలా పూర్తి స్థాయి న్యాయ వ్యవస్థను రూపొందించడానికి ప్రాథమిక అంశాలను ఈ చట్టాల్లో పొందుపరిచినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ చట్టాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ క్రిమినల్ కేసు పరిష్కారానికైనా మూడేళ్లకు మించి సమయం పట్టదని చెప్పారు. దీని కోసం భాగస్వాములందరితో చాలా సంప్రదింపులు జరిపామని, ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీకి పంపామని శ్రీ షా చెప్పారు. సూచించిన అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, పూర్తి చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ప్రవేశ పెట్టినట్టు వివరించారు.

సాకులు చెప్పి ఈ మూడు బిల్లులపై చర్చను బహిష్కరించాలని ప్రతిపక్షాలు దురదృష్టకర నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర హోం మంత్రి అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే మూడు చట్టాలపై దేశ పార్లమెంటులో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతిని అనుకరించే దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, పోయాయని, అయితే రాజ్యాంగ పదవుల గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని నిలబెట్టడంలో భారతదేశంలోని ప్రకాశవంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని ఈ రోజు మనకు బోధించే వారే తీవ్రంగా దెబ్బతీశారని, ఈ దేశ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని శ్రీ షా అన్నారు. రాజ్యాంగ పదవులు దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యవస్థలనే వాస్తవాన్ని ప్రతిపక్షాలు గుర్తించడం లేదని, అందుకే వాటిని సంస్థలు, రాజకీయాలకు అతీతంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి గౌరవానికి తామెప్పుడూ భంగం కలిగించలేదని, ఎప్పుడూ అలా జరగనివ్వలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ మూడు బిల్లులను చట్టంగా మార్చే ప్రక్రియ జరుగుతుండగా రాజ్యాంగ గౌరవానికి భంగం కలిగించేలా రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రముఖులను ప్రతిపక్షాలు అవమానిస్తున్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

2024 డిసెంబర్ నాటికి అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ మూడు చట్టాల అమలు కోసం మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ వేర్ , మానవ వనరుల శిక్షణ, కోర్టుల పూర్తి కంప్యూటరీకరణ పనులు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు. సీసీటీఎన్ఎస్, ఐసీజేఎస్ ద్వారా మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఈ పనిని ప్రారంభించిందన్నారు. ఈ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చండీగఢ్ ను సిద్ధం చేయడానికి సవివరమైన కాలపరిమితితో కూడిన కార్యక్రమాన్ని రూపొందిస్తామని శ్రీ షా చెప్పారు. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల నిర్వచనాన్ని అమలు చేయడం, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఏర్పాటు, ఫోరెన్సిక్స్ కు స్థిరత్వం కల్పించడం, ఐసీజేఎస్, సీసీటీఎన్ ఎస్ లలో లొసుగులను పూడ్చడం వంటి వాటికి కాలపరిమితితో కూడిన కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. 2024 జనవరి 31 లోపు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి 2024 డిసెంబర్ 22 నాటికి ఈ చట్టాలను అమలు చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు.

ఈ చట్టాలను అమలు చేయడానికి ముందే దేశంలోని 99.93 శాతం పోలీస్ స్టేషన్లను అంటే 16,733 పోలీస్ స్టేషన్లను ఆన్ లైన్ లో అనుసంధానించే పనిని మోదీ ప్రభుత్వం  పూర్తి చేసిందని, అవి ఒకే సాఫ్ట్ వేర్ తో పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలోని 22 వేల కోర్టులు ఇ-కోర్టులుగా మారాయని, దేశంలోని రెండు కోట్ల మంది ఖైదీల డేటా ఇ- జైళ్ల ద్వారా, కోటికి పైగా ప్రాసిక్యూషన్ల డేటా ఇ- ప్రాసిక్యూషన్ ద్వారా ఆన్ లైన్ లో ఉందని, 17 లక్షల ఫోరెన్సిక్ వివరాలు కూడా ఇ- ఫోరెన్సిక్స్ ద్వారా ఆన్ లైన్ లో ఉన్నాయని హోం మంత్రి తెలిపారు. వీటితో పాటు 90 లక్షలకు పైగా వేలిముద్రల డేటా, ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఆఫ్ టెర్రరిజం (ఐఎంఓటీ), అరెస్టయిన నార్కో నేరస్థుల డేటా, నేషనల్ డేటాబేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెండర్స్ డేటా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ ను అనుసంధానం చేయడం ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, ఖైదీల బయోమెట్రిక్ డేటాను కూడా సిద్ధం చేశారు. దీని తరువాత, వారి మధ్య కమ్యూనికేషన్ భాషను నిర్ణయించడం, కమ్యూనికేషన్ సాఫ్ట్ వేర్ తీసుకురావడం, కృత్రిమ మేధస్సును ఉపయోగించి విశ్లేషించడం దేశంలో ఉగ్రవాదం ,  నేరాలను అరికట్టడం లక్ష్యమని తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం తన క్రిమినల్ న్యాయ వ్యవస్థ ను భారత ఆలోచనలతో నడపడానికి కట్టుబడి ఉందని హోం మంత్రి అన్నారు. 19వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దంలోకి దూసుకు వెళ్లేందుకు  భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ కూడా సిద్ధంగా ఉందన్నారు. ఈ చట్టాల అమలు తర్వాత మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక క్రిమినల్ జస్టిస్ వ్యవస్థగా మారుతుందని శ్రీ షా అన్నారు.

 

 ***


(Release ID: 1989810) Visitor Counter : 139


Read this release in: English , Urdu