వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

నూతన విదేశీ వాణిజ్యవిధానం ,రుపీ ఎగుమతి రుణంలో ఎగుమతులకు ముందు, తర్వాత ఇంట్రస్ట్‌ ఈక్వలైజేషన్‌ పధకం పొడిగింపు వంటి పలు చర్యలను తీసుకున్న ప్రభుత్వం.

Posted On: 20 DEC 2023 6:18PM by PIB Hyderabad

ఎగుమతుల ప్రోత్సాహకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంది.
1.2023 మార్చి 31 వతేదీ న కేంద్ర ప్రభుత్వం నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని తీసుకువచ్చింది.  ఇది 2023 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.
2)రుపీ ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌కు సంబంధించి ఎగుమతులకు ముందు, తర్వాత ఇంట్రస్ట్‌ ఈక్వలైజేషన్‌ వెసులుబాటును 30`06`2024 వరకు పొడిగించడం జరిగింది. ఇందుకు రూ 2500 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు.
3)ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలు పథకాల ద్వారా ప్రభుత్వం సహాయం అందించింది.


3)అవి ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్స్ స్కీమ్ (టిఐఇఎస్), మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ (ఎంఎఐ) స్కీమ్ వంటివి.
4) కార్మికులు ఎక్కువగా ఉండే రంగాల ఎగుమతులను ప్రోత్సహించేందుక 07.03. 2019 నుంచి కేంద్ర , రాష్ట్ర లెవీలు, పన్నుల లో రాయితీలు ఇవ్వడం జరుగుతోంది.
5)ఎగుమతిచేసిన  ఉత్పత్తుల పథకాన్ని (ఆర్ఒ.డిటిఇపి) 2021 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నారు. 2022 డిసెంబర్ 15 నుంచి ఫార్మాసూటికల్స్, ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలు, ఐరన్ , స్టీల్ వస్తువలవంటి ఇంతకు ముందు వరకు చేరని రంగాలను ఆర్.ఒ.డి.టి.ఇ.పి కిందికి తీసుకువచ్చారు. అలాగే, 432 టారిఫ్లైన్లలో తేడాలను పరిష్కరించారు.సవరించిన రేట్లను 2023 జనవరి 16 నుంచి అమలు లోకి తెచ్చారు.

6) ఎగుమతిదారులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్.టి.ఎ)ను వాడుకోవడానికి, వాణిజ్య కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా కామన్ డిజిటల్ ప్లాట్ఫారం ఏర్పాటు
7)దేశంలోని ప్రతి జిల్లాలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఉత్పత్తులను గుర్తించి, ఆయా జిల్లాలలను ఎగుమతుల కేంద్రాలుగా   తీర్చిదిద్దడం, ఈ ఎగుమతుల విషయంలో ఎదురౌతున్న ఇబ్బందులను తొలగించడం, స్థానిక ఎగుమతి దారులు, తయారీదారులకు మద్దతునివ్వడం, జిల్లాలలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం.
8)భారతదేశ ఎగుమతుల పెంపు, భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సాంకేతికత, పెట్టుబడి లక్ష్యాల స్థాయి పెంపునకు సంబంధించి విదేశాలలోని  భారతీయ మిషన్లు క్రియాశీలంగా వ్యవహరించేలా చూడడం,
9) విదేశాలలోని వాణిజ్య మిషన్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలులు, కమాడిటీ బోర్డులు, అథారిటీలు, పరిశ్రమ అసోసియేషన్ల సహాయంతో దేశ ఎగుమతులకు
 సంబంధించిన పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
10)దేశీయ మార్కెట్ల వృద్ధికి, అంతర్జాతీయంగా అవి చేరేలా చేయడానికి ప్రభుత్వం కింది చర్యలు తీసుకుంది.
అవి
1) ప్రధానమంత్రి గతి శక్తి.
2) నేషనల్ లాజిస్టిక్ పాలసీ,
3) నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డవలప్మెంట్ ప్రోగ్రాం.
4) జిఐఎస్ అనుసంధానిత ల్యాండ్ బ్యాంక్– ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్(ఐఐఎల్బి)
5) ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ సిస్టమ్ (ఐపిఆర్ఎస్)
6)  ఉత్పాదక అనుసంధానిత ప్రోత్సాహకం (పిఎల్ఐ)
7) మేక్ ఇన్ ఇండియా
8) స్టార్టప్ ఇండియా
9) ఒక జిల్లా, ఒక ఉత్పత్తి
10) నేషనల్ సింగిల్ విండో సిస్టమ్

విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టిపి), 2023 కు లోబడి కొత్త చాప్టర్ ను ప్రారంభించారు.  ఈ కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించడం.ఈ ఎగుమతులను భారత ప్రభుత్వానికి సంబంధించి వివిధ ఎగుమతుల ప్రోత్సాహక
పథకాలకిందికి తీసుకురావడం దీని ఉద్దేశం. 2023 ఎఫ్టిపిలో ప్రత్యేకంగా ప్రస్తావించిన విధంగా ఈ కామర్స్ ఎగుమతులు, ఔట్ రీచ్ ఈవెంట్లను జిల్లాలో నిర్వహిస్తారు. ఎగుమతుల హబ్ల ఏర్పాటు చొరవ కింద ఆయా జిల్లాలలో వీటిని ఏర్పాటు చేస్తారు.
ఇది ప్రధానంగా ఆయా జిల్లాలనుంచి గుర్తించిన సరకుల విషయంలో ఈ కామర్స్ ఎగుమతులను ప్రోత్సహించడం, వివిధ స్టేక్హోల్డర్ల  సహకారంతో దీనిని చేపట్టడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతోంది.ఇందుకు
ఈ కామర్స్ ప్లాట్ఫారంలు, సంబంధిత కేంద్ర , రాష్ట్రప్రభుత్వ విభాగాలు, ఉదాహరణకు డిపార్టమెంట్ ఆఫ్ పోస్ట్స్, కేంద్ర పరోక్ష పన్నులు , సుంకాల కేంద్ర బోర్డు (సిబిఐసి), బ్యాంకుల, సూక్ష్మ, చిన్న ,మధ్యతరహా ఎంటర్ ప్రైజ్లు ,
ఎగుమతి ప్రోత్సాహక మండలులు, స్థానిక ట్రేడ్ అసోసియేషన్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్,జిల్లా పరిశ్రమల కేంద్రాలు తదితరాలు ఇందులో ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***

 



(Release ID: 1989545) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi