గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజ బ్లాకుల వేలం కోసం రేపు ముందుస్తు వేలం సదస్సు నిర్వహించనున్న భారత గనుల మంత్రిత్వ శాఖ

Posted On: 21 DEC 2023 5:46PM by PIB Hyderabad

1వ విడత కీలక & వ్యూహాత్మక ఖనిజాల వేలం కోసం, ఈ నెల 22న, న్యూదిల్లీలోని డా.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ముందస్తు వేలం సదస్సును భారత గనుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి హైబ్రిడ్ విధానంలో ఈ సదస్సు జరుగుతుంది.

20 కీలక & వ్యూహాత్మక ఖనిజ బ్లాకులకు 1వ విడత వేలం ప్రక్రియను ఈ ఏడాది నవంబర్ 29న గనుల మంత్రి ప్రారంభించారు. ఈ బ్లాక్‌లు 8 రాష్ట్రాలు, యూటీలైన బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జమ్ము&కశ్మీర్‌లో ఉన్నాయి. వేలంలో ఉన్న ఖనిజాలు గ్లాకోనైట్, గ్రాఫైట్, పొటాష్, నికెల్, పీజీఈ, లిథియం, ఆర్‌ఈఈ, మాలిబ్డినం, ఫాస్ఫోరైట్. వేలానికి సంబంధించి పరిశ్రమ, బిడ్డర్లు, ఇతర వాటాదార్లకు ఏవైనా సందేహాలు ఉంటే గనుల మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది.

ఈ సదస్సుకు గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ వీణా కుమారి డెర్మల్ అధ్యక్షత వహిస్తారు. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సాంకేతిక సలహాదారు ఎంఈసీఎల్‌, వేలం వేదిక ప్రదాత ఎంఎస్‌టీసీ కలిసి బ్లాక్ వివరాలు, వేలం ప్రక్రియ, వేలం వేదిక గురించి వివరిస్తాయి.

ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చివరి తేదీ 5 జనవరి 2024, టెండర్ పత్రాల విక్రయానికి చివరి తేదీ 16 జనవరి 2024, బిడ్ సమర్పణకు చివరి తేదీ 22 జనవరి 2024గా నిర్ణయించారు. ఆ తర్వాత, అత్యధిక బిడ్డర్ ఎంపిక కోసం ఇ-వేలం ప్రారంభమవుతుంది. ఖనిజ బ్లాక్‌లు, వేలం నిబంధనలు, తేదీల వంటి వివరాల కోసం ఎంఎస్‌టీసీ వేలం ప్లాట్‌ఫామ్‌ www.mstcecommerce.com/auctionhome/mlcl/index.jspలో చూడవచ్చు.

కీలక & వ్యూహాత్మక ఖనిజాల రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, కీలక ఖనిజ బ్లాకుల వేలాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

***


(Release ID: 1989441) Visitor Counter : 89


Read this release in: English , Urdu , Hindi