రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ)కి చెందిన 1457 ప్రాజెక్టులను భూమి రాశి పోర్టల్‌ కిందికి తెచ్చిన ప్రభుత్వం.

Posted On: 20 DEC 2023 1:08PM by PIB Hyderabad

భారతదేశంలో జాతీయ రహదారుల మౌలికసదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రకటనలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రాసెస్‌ చేసేందుకు, భూసేకరణ పరిహారాన్ని అందించేందుకు సింగిల్‌ పాయింట్‌ ప్లాట్‌ఫారంగా భూమి రాశి పోర్టల్‌ను తీసుకువచ్చారు. 01`04`2018 నుంచి భూ సేకరణ ప్రతిపాదనలన్నింటికీ ఈ పోర్టల్‌ను తప్పనిసరి చేశారు.
అన్ని భూసేకరణ నోటిఫికేషన్లను కాంపిటెంట్‌ అథారిటీగా ప్రకటింపబడిన, సంబంధిత రాష్ట్రానికి చెందిన రెవిన్యూ అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి. వీటిని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదంతో  ఈ`గెజిట్‌ ద్వారా భారతప్రభుత్వ ప్రెస్‌కు పంపుతారు.  భూమి రాశి పోర్టల్‌ ద్వారా , ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించిన పరిహారాన్ని చెల్లిస్తారు. దీనివల్ల భూ సేకరణ నోటిఫికేషన్ల ప్రకటనలకు సంబంధించి  సమయం కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకతకు వీలుకలుగుతుంది.
ఇప్పటివరకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌.హెచ్‌.ఎ.ఐ) కిచెందిన 1467 ప్రాజెక్టులను భూమి రిషి పోర్టల్‌ పరిధి కిందికి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ......వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ సమాచారాన్ని కేంద రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరి రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

 

***(Release ID: 1989362) Visitor Counter : 66


Read this release in: English , Urdu , Marathi , Hindi