అణుశక్తి విభాగం
ఏఐ , మెషిన్ లెర్నింగ్ వినియోగం
Posted On:
21 DEC 2023 4:08PM by PIB Hyderabad
గత ఐదేళ్ల కాలంలో ఏఐ , మెషిన్ లెర్నింగ్ వినియోగించి అణు ఇంధన శాఖ చేపట్టిన పరిశోధనల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
క్ర.స
|
పరిశోధన వివరాలు
|
1.
|
ఏఐ ఆధారిత కంటెంట్ ధృవీకరణ ,అసాధారణ గుర్తింపు
|
2.
|
ఏఐ ఆధారిత ఫిజికల్ ఇంట్రూషన్ డిటెక్షన్
|
3.
|
బయోమెట్రిక్ , ఫేస్ రికగ్నిషన్
|
4.
|
వాహన గుర్తింపు, నిర్వహణ
|
5.
|
అప్లికేషన్ బిహేవియర్, అనోమలీ డిటెక్షన్
|
6.
|
మానవ ఇంటర్ఫేస్ అభివృద్ధి
|
7.
|
రోబోటిక్స్
|
8.
|
ఇమేజ్ ప్రాసెసింగ్
|
9.
|
మెడికల్ , బయో మెడికల్
|
10.
|
ఏఐ/ ఎంఎల్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్, హార్డ్‌వేర్
|
11.
|
హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ - జాబ్ షెడ్యూలింగ్, రిసోర్స్ యుటిలైజేషన్ ప్రిడిక్షన్, న్యూక్లియర్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ మరియు న్యూక్లియర్ పరిసరాలలో ఆప్టిమైజేషన్ సమస్యలు
|
12.
|
రొమ్ము క్యాన్సర్, కంటి వ్యాధులు, డయాబెటిస్ మెల్లిటస్ కోసం వైద్య థర్మల్ చిత్రాలు
|
13.
|
యాక్సిలరేటర్‌ల నియంత్రణ వ్యవస్థ కోసం ఎలక్ట్రాన్ సింక్రోట్రోన్‌ల ఆపరేటింగ్ పారామితుల సమీప సరైన విలువ గుర్తించడానికి ఏఐ - అల్గారిథమ్ ఆధారిత అప్లికేషన్
|
14.
|
యాక్సిలరేటర్ల నియంత్రణ వ్యవస్థ కోసం ఆపరేటర్ జోక్యం లేకుండా బీమ్ ఇంజెక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి స్వార్మ్ ఇంటెలిజెన్స్ మరియు ఏఐ -ఆధారిత నిపుణుల వ్యవస్థను ఉపయోగించి ఆపరేటింగ్ సపోర్ట్ సిస్టమ్ అభివృద్ధి
|
15.
|
అణు ఇంధనం, న్యూక్లియర్ ఫ్యూయల్ అసెంబ్లీ కాంపోనెంట్‌ల తనిఖీ, నాణ్యత నియంత్రణ కోసం మెషిన్ విజన్ ఆధారిత ఇన్‌స్పెక్షన్ సిస్టమ్‌లలో ఏఐ/ఎంఎల్ అల్గారిథమ్‌లు/మెథడాలజీలు వినియోగం
|
16.
|
లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ నుండి స్పెక్ట్రల్ డేటాపై శిక్షణ పొందిన ఎంఎల్ -ఆధారిత అల్గారిథమ్‌లను వర్తింపజేయడం ద్వారా వివిధ గ్రేడ్‌ల ఉక్కు గుణాత్మక, పరిమాణాత్మక విశ్లేషణ.
|
17.
|
రామన్ స్పెక్ట్రోస్కోపీ కోసం ఎంఎల్ -ఆధారిత సిస్టమ్స్/టెక్నిక్స్ అభివృద్ధి
|
18.
|
మోసపూరిత కనెక్షన్‌లను గుర్తించడానికి బహుళ-దశల ఎంఎల్ మోడల్ అభివృద్ధి
|
19.
|
పెద్ద బ్లాక్ లిస్ట్‌లలో IPv6 అడ్రస్ తెలుసుకోవడానికి ఎంఎల్ మోడల్‌లపై అధ్యయనం
|
20.
|
స్పాం గుర్తింపు కోసం ఎంఎల్ -ఆధారిత సాంకేతిక వ్యవస్థ అధ్యయనం, రూపకల్పన, అభివృద్ధి.
|
21.
|
ఆర్ఆర్ క్యాట్లోని సిహెచ్ఎస్ఎస్ మెడికల్ సమాచారం నుంచి అర్థవంతమైన అంతర్దృష్టులను సేకరించేందుకు స్టాటిస్టికల్ మోడలింగ్,ఎంఎల్ వినియోగించి వ్యాధుల వ్యాప్తి, నమూనాలు, అనారోగ్యాలు/ లక్షణాల మధ్య పరస్పర సంబంధం, కాలానుగుణ నమూనాలు,సిహెచ్ఎస్ఎస్ లబ్ధిదారుల ప్రొఫైలింగ్ మొదలైన కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
|
గత 5 సంవత్సరాలలో వివిధ ఏఐ/ఎంఎల్ సంబంధిత పరిశోధన ప్రాజెక్ట్‌లు, కార్యక్రమాల కోసం విద్యా సంస్థలతో కలిసి అను ఇంధన మంత్రిత్వ శాఖ పని చేసింది. స్మార్ట్ మల్టీ కెమెరా వీడియో సర్వైలెన్స్ కోసం బలమైన ఆకార ఆధారిత ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ , రోబస్ట్ మరియు స్కేలబుల్ కంప్యూటర్ విజన్ సిస్టమ్స్ అభివృద్ధి కోసం కార్యక్రమాలు అమలు జరిగాయి.
ఈ రంగంలో విద్యా సంస్థల సహకారంతో చేపట్టిన ప్రాజెక్ట్‌లు, కార్యక్రమాల వివరాలు:
- థర్మల్/ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ ఉపయోగించి రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం. ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల ద్వారా మ్యాప్ చేయబడిన గాయాల వర్గీకరణ కోసం ఏఐ వినియోగం
- కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్ (CNN) ఉపయోగించి డయాబెటిక్ కంటి వ్యాధుల గుర్తింపు, వర్గీకరణ.
- సైక్లోట్రాన్ వాల్ట్ లోపల రేడియేషన్ ఫీల్డ్ మ్యాపింగ్
- డ్రోన్ ద్వారా మానవ రహిత నిఘా
- భారతీయ సంకేత భాష కోడింగ్, డీకోడింగ్
- తక్కువ బిట్ రేట్ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం వీడియో కంప్రెషన్
- DAQ సిస్టమ్ కోసం న్యూట్రాన్ గామా వేరు చేయడం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సంబంధిత పరిశోధనలు గత ఐదేళ్లలో జరుగుతున్నాయి. 3 ప్రాజెక్టులకు రూ. 180 కోట్లు విడుదల అయ్యాయి. దీనిలో దాదాపు రూ. 53 కోట్లు వినియోగించారు.
అధిక పనితీరు గల కంప్యూటింగ్‌తో పాటు ఏఐ/ఎంఎల్ పరిశోధనలు పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం కల్పించాయి. దీనివల్ల అన్ని రంగాలలో అప్లికేషన్‌ల అభివృద్ధికి వీలు కలిగింది. భద్రతా, సైబర్ భద్రతా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. . సెక్యూర్డ్ నెట్‌వర్క్ యాక్సెస్ సిస్టమ్ (SNAS) వంటి దేశీయ ఉత్పత్తులు సైబర్ భద్రత కల్పిస్తున్నాయి.
అతి పెద్ద వ్యవస్థ కలిగి ఉన్న అణు విద్యుత్ శాఖలో ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. భారీ మొత్తంలో డేటాను విశ్లేషించడానికి, ప్రదర్శన కోసం సంగ్రహించిన ఫలితాలు అందించడానికిఅభివృద్ధి చేసిన . ఈవెంట్ మానిటరింగ్ సిస్టమ్ SNASతో అనుసంధానం అయ్యింది. . ఈ వ్యవస్థలు నిరంతర నిఘా, సమయానుకూల అంతర్దృష్టులను నిర్ధారిస్తూ 24 గంటలూ సేవలు అందిస్తున్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత), పీఎంఓ సహాయ మంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం తెలిపారు.
***
(Release ID: 1989348)
Visitor Counter : 128