ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎన్ఇఆర్ (ఈశాన్యప్రాంతం) కోసం ప్రధానమంత్రి అభివృద్ధి చొరవ లక్ష్యాలు
Posted On:
21 DEC 2023 2:16PM by PIB Hyderabad
రాష్ట్రాలు అవసరమని భావించిన వాటిపై ఆధారపడి మౌలిక సదుపాయ, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను అందించడం ద్వారా ఈశాన్య ప్రాంతాన్నివేగంగా, సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమలవుతున్న పథకం ప్రధాన మంత్రి ఈశాన్యప్రాంత అభివృద్ధికి చొరవ (పిఎం- డిఇవిఐఎన్ఐ).
పిఎం- డిఇవిఐఎన్ఐ పథకం లక్ష్యాలుః 1) పిఎం గతిశక్తి స్ఫూర్తితో మౌలిక సదుపాయాలకు సమీకృత నిధులు 2) ఎన్ఇఆర్ భావించిన అవసరాల ఆధారంగా సామాజికాభివృద్ధి ప్రాజెక్టులకు తోడ్పాటు 3) యువత, మహిళలకు జీవనోపాధి కార్యకలాపాలకు తోడ్పాటు 4) వివిధ రంగాలలో అభివృద్ధి పరంగా ఉన్న అంతరాలను పూడ్చడం.
పిఎం- డిఇవిఐఎన్ఐ పథకం కింద 18 డిసెంబర్ 2023వరకు కేటాయించిన ప్రాజెక్టులు (ఎఎఫ్ఎస్ జారీ చేసినవి), మంజూరు చేయాలని సూచించినవి, సూత్రప్రాయంగా సూచించిన (ఎంపిక చేసిన)వాటి వివరాలను అనెక్చర్‌లో ఇవ్వడం జరిగింది.
ఈ సమాచారాన్ని ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్. వర్మ గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబులో వెల్లడించారు.
అనుబంధం . 1
అనుబంధం . 2
అనుబంధం . 3
***
(Release ID: 1989283)
Visitor Counter : 60