అంతరిక్ష విభాగం
స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య డిపిఐఐటి స్టార్ట్-అప్ ఇండియా పోర్టల్ ప్రకారం 2014లో కేవలం 1 నుంచి 2023 నాటికి 189కి పెరిగిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
2023లో ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో పెట్టుబడి $124.7 మిలియన్లకు పెరిగింది: డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష రంగంలో ఎఫ్‌డిఐని ప్రోత్సహించేందుకు, డిపిఐఐటితో సంప్రదించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ అంతరిక్ష రంగం యొక్క ఎఫ్‌డిఐ పాలసీ మార్గదర్శకాలను సమీక్షించే ప్రక్రియలో ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్
2033 నాటికి భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ సుమారు 8.4 బిలియన్ డాలర్ల నుంచి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
Posted On:
20 DEC 2023 7:24PM by PIB Hyderabad
డిపిఐఐటి స్టార్ట్-అప్ ఇండియా పోర్టల్ ప్రకారం 2014లో కేవలం 1 స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య 2023లో 189కి పెరిగిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు తెలిపారు. 2023లో ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లలో పెట్టుబడి 124.7 మిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన తెలిపారు.
కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రస్తుత పరిమాణం సుమారు $8.4 బిలియన్లు (ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఇది దాదాపు 2-3%) అంచనా వేయబడింది మరియు భారత అంతరిక్ష విధానం 2023 అమలుతో, 2033 నాటికి $44 బిలియన్ల భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కు చేరగలదని అంచనా. ఆశించిన ఆర్థిక వ్యవస్థను సాధించడంలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రధానం. శాటిలైట్ తయారీ, లాంచ్ వాహనాల తయారీ, ఉపగ్రహ సేవలను అందించడం మరియు గ్రౌండ్ సిస్టమ్‌ల తయారీలో ప్రైవేట్ రంగం స్వతంత్రంగా సమగ్ర పరిష్కారాన్ని అందించగలదని భావిస్తున్నారు.
ప్రత్యేక సమాధానంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం, ఉపగ్రహ స్థాపన మరియు కార్యకలాపాల కోసం ప్రభుత్వ మార్గంలో అంతరిక్ష రంగంలో ఎఫ్‌డిఐని అనుమతించారు. అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) ప్రోత్సహించేందుకు డిపిఐఐటితో సంప్రదించి అంతరిక్ష శాఖ ఎఫ్‌డిఐ పాలసీ మార్గదర్శకాలను సమీక్షించే పనిలో ఉందని ఆయన చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు (ఎన్ జీ ఈ లు) వారి స్వంత ఉపగ్రహాలను ప్రయోగించాయి. అనేక ఇతర అంతరిక్ష పరిశ్రమలు మరియు స్టార్ట్-అప్‌లు కూడా తమ స్వంత ఉపగ్రహాలు మరియు సముదాయాలను నిర్మిస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ మొదలైన ప్రయోజనాలకు దోహదం చేస్తాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఒక ఎన్‌జిఇ తమ సబ్-ఆర్బిటల్ లాంచ్ వెహికల్‌ను ప్రారంభించగా, ఇస్రో క్యాంపస్‌లో ప్రైవేట్ లాంచ్‌ప్యాడ్ మరియు మిషన్ కంట్రోల్ సెంటర్‌ను ఎన్‌జిఇ మొదటిసారిగా ఏర్పాటు చేసింది. ఆ ఎన్ జీ ఈ ల ద్వారా ఉప కక్ష్య ప్రయోగం త్వరలో షెడ్యూల్ చేయబడింది. ప్రభుత్వం అంతరిక్ష రంగం విధానం 2023ని ప్రకటించింది, ఇది అంతరిక్ష కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఎన్‌జిఇల సంపూర్ణ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది.
డాక్టర్ జితేంద్ర సింగ్ అంతరిక్ష రంగంలో ఈ క్రింది ఇతర పరిణామాలు మరియు ప్రభావాన్ని వివరించారు:
ప్రైవేట్ కంపెనీలు శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ పరిష్కారాలను అన్వేషిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ఆధారిత అప్లికేషన్‌లు మరియు సేవలలో ఎక్కువగా పాల్గొంటున్నారు.
ప్రైవేట్ రంగంలో శాటిలైట్ అనుసంధానం మరియు టెస్టింగ్ సౌకర్యాలు వస్తున్నాయి.
శాటిలైట్ సబ్‌సిస్టమ్‌లు మరియు గ్రౌండ్ సిస్టమ్‌ల స్థానిక తయారీని ప్రైవేట్ రంగం చేస్తోంది.
భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు మరియు సంస్థలతో సహకారాలు మరియు భాగస్వామ్యాలు ఎక్కువగా నేరుపుతున్నాయి.
దేశంలోని వెనుకబడిన ప్రాంతాలకు చేరుకోవడంలోవిద్యా రంగంతో పాటు యువ స్టార్టప్‌లకు చేయూత, ఆవరణ మద్దతు మరియు పెట్టుబడి ద్వారా ఈ క్రింది ప్రయత్నాలు జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
భారతదేశంలోని విద్యాసంస్థలలో అంతరిక్ష సాంకేతిక విద్య ను చేర్చడాన్ని సులభతరం చేయడం మరియు ప్రోత్సహించడం, అవగాహన, నైపుణ్యాభివృద్ధి మరియు పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతదేశంలో అంతరిక్ష సాంకేతిక విద్యను స్వీకరించడానికి జాతీయ కమిటీని ఇన్ - స్పేస్ ను ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ ఇస్రో సబ్జెక్ట్ నిపుణుల జాబితా ఇన్-స్పేస్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ లో ప్రచురించబడింది. నిపుణుల సలహాల కోసం ఎన్ జీ ఈలు నేరుగా ఈ మెంటార్‌లను సంప్రదించవచ్చు.
అంతరిక్ష రంగంలో అనుభవం ఉన్న టెక్నోక్రాట్‌లను మెంటార్‌లుగా క్రమానుగతంగా ఆహ్వానించి మరియు వారిని ఎన్ జీ ఈలకు కనెక్ట్ చేయడం
విద్యార్థులు/విద్యాసంస్థలు అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించేలా ప్రోత్సహించేందుకు, వారి ప్రతిపాదనను మూల్యాంకనం చేసి అవసరమైన మార్గదర్శకత్వం అందించే కమిటీని ఏర్పాటు చేశారు.
అంతరిక్ష రంగంలో నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయడానికి, ఇన్-స్పేస్ సీడ్ ఫండ్ పథకంతో పాటు ఇస్రోతో కలిసి స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులను కాలానుగుణంగా నిర్వహిస్తోంది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇన్-స్పేస్ ద్వారా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు చేయూత నివ్వడానికి సీడ్ ఫండ్ స్కీమ్, ప్రైసింగ్ సపోర్ట్ పాలసీ, మెంటార్‌షిప్ సపోర్ట్, ఎన్ జీ ఈల కోసం డిజైన్ ల్యాబ్, స్పేస్ సెక్టార్‌లో నైపుణ్యాభివృద్ధి, ఇస్రో సౌకర్యాల వినియోగం మద్దతు, ఎన్ జీ ఈలకు సాంకేతికత బదిలీ వంటి వివిధ పథకాలు కూడా ప్రకటించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి.
ప్రయోగ వాహనాలు మరియు ఉపగ్రహాల తయారీలో పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంచుతుందని భావిస్తున్న అంతరిక్ష వ్యవస్థలు మరియు అటువంటి ఎన్ జీ ఈల ద్వారా రూపొందించబడిన అనువర్తనాల అమలుకు అవసరమైన మద్దతును అందించడానికి ఇన్-స్పేస్ ఎన్ జీ ఈలతో దాదాపు 45 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్ష రంగానికి సంబంధించి దేశంలో అనేక పరిశ్రమల సంఘాలు ఉన్నాయని, వాటిలో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐ స్పా) ఒకటి. పరిశ్రమల సంఘాలు చేపడుతున్న కార్యకలాపాలు ప్రభుత్వ పరిధిలోకి రావని ఆయన చెప్పారు.
***
(Release ID: 1989019)
Visitor Counter : 246