అంతరిక్ష విభాగం
భారత్ 2014-23 మధ్య ప్రయోగించిన విదేశీ, దేశీయ ఉపగ్రహాల సంఖ్య వరుసగా 396, 70గా ఉండగా, 2003- 13 మధ్యన ప్రయోగించిన విదేశీ, దేశీయ ఉపగ్రహాల సంఖ్య వరుసగా 33 & 31గా ఉందన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష విభాగానికి కేటాయించిన బడ్జెట్ ఆర్ధిక సంవత్సరం 2013-14లో ఉన్న 6792 కోట్ల నుంచి రెట్టింపై 2023-24లో రూ. 12,544 కోట్లగా ఉందిః డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
20 DEC 2023 7:21PM by PIB Hyderabad
భారతదేశం 2003- 13 మధ్యన ప్రయోగించిన విదేశీ, దేశీయ ఉపగ్రహాల సంఖ్య వరుసగా 33 & 31గా ఉండగా, 2014-23 మధ్య ప్రయోగించిన విదేశీ, దేశీయ ఉపగ్రహాల సంఖ్య వరుసగా 396, 70గా ఉన్నాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు.
కేంద్ర శాస్త్ర&సాంకేతిక (ఇండిపెండెంట్ ఛార్జి) సహాయమంత్రి, పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ ఉపగ్రహాల ప్రయోగించడం ద్వారా 2014-23 మధ్య కాలంలో 157 మిలియన్ యుఎస్ డాలర్లు, 260 మిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించినట్టు వివరించారు. కాగా, 2003-13 మధ్య కాలంలో ఆదాయం 15 మిలియన్ల యుఎస్ డాలర్లు, 32 మిలియన్ల యూరోలుగా ఉందని ఆయన అన్నారు.
అంతరిక్ష విభాగానికి కేటాయించిన బడ్జెట్ ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 6792 కోట్ల నుంచి 2023-24కు రూ. 12,554 కోట్లకు పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
వివిధ అంతర్జాతీయ అంచనాలు, వార్తాపత్రికల ప్రకారం ఈ రంగం రానున్న కాలంలో 6-8% వృద్ధిని చవి చూడనుందని ఆయన అన్నారు.
***
(Release ID: 1989000)
Visitor Counter : 136