భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భారతదేశ తొలి శీతాకాల శాస్త్రీయ ఆర్కిటిక్ యాత్ర ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిరణ్ రిజిజు
Posted On:
18 DEC 2023 4:22PM by PIB Hyderabad
భారతదేశ తొలి శీతాకాల శాస్త్రీయ ఆర్కిటిక్ యాత్రను కేంద్ర భూ శాస్త్రాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు శ్రీ కిరణ్ రిజిజు 2023 డిసెంబర్ 18న ప్రారంభించారు. న్యూ ఢిల్లీ లోని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి మంత్రి యాత్రను ప్రారంభించారు ఆర్కిటిక్ లో శీతాకాలంలో ( నవంబర్ నుండి మార్చి వరకు) మొట్టమొదటిసారిగా భారత శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడతారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ధ్రువ రాత్రులు,దాదాపు 24 గంటల పాటు సూర్యకాంతి లేకుండా సున్నా కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు (-15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ) ఉన్న సమయంలో పరిశోధకులు ప్రత్యేకమైన శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తారు. రుతుపవనాలతో సహా ఉష్ణమండలంలో వాతావరణం, వాతావరణాన్ని ప్రభావితం చేసే ఆర్కిటిక్, ముఖ్యంగా వాతావరణ మార్పు, అంతరిక్ష వాతావరణం, సముద్ర-మంచు , సముద్ర ప్రసరణ డైనమిక్స్, పర్యావరణ వ్యవస్థ అనుసరణలు మొదలైన అంశాలపై మరింత అవగాహన పొందడానికి అవసరమైన సమాచారం సేకరించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తారు.
2008 నుంచి ఆర్కిటిక్‌లో భారతదేశం హిమాద్రి పేరుతో పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వేసవిలో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) శాస్త్రవేత్తలు ఇక్కడ నుంచి పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. 2023 జూన్ లో ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం నిర్వహిస్తున్న కార్యక్రమాలను నార్వేజియన్ ఆర్కిటిక్‌లోని హిమాద్రి, నై-అలెసుండ్, స్వాల్‌బార్డ్‌లో ఉన్న హిమాద్రి లో శ్రీ రిజిజు వ్యక్తిగతంగా సమీక్షించిన తర్వాత శీతాకాలంలో కూడా ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్కిటిక్ యాత్రను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి దేశ శాస్త్రీయ నైపుణ్య సామర్ద్యాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. “2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవతరించాలి అన్న పట్టుదలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉన్నారు. ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా శాస్త్రీయ కార్యకలాపాలను విస్తరించడానికి , అంతర్జాతీయ సహకారం పొందడానికి కృషి జరుగుతోంది. ఆర్కిటిక్ ప్రాంతం శాస్త్రీయ, వాతావరణ, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం.. ప్రపంచ మానవాళి జీవితం మనుగడను ప్రభావితం చేసే సమస్యలు పరిష్కరించడంలో మన శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించాలి" అని శ్రీ కిరణ్ రిజిజు అన్నారు. 2023 డిసెంబర్ 19న న్యూ ఢిల్లీ నుండి హిమాద్రికి బయలుదేరనున్న భారతదేశ ఆర్కిటిక్ యాత్ర సభ్యులతో మంత్రి మాట్లాడి వారికి అభినందనలు తెలిపి విజయం సాధించాలని ఆకాంక్షించారు. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఓషన్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరగనున్న తొలి ఆర్కిటిక్ శీతాకాల యాత్రలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోలజీ (IITM), పూణే, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు శాస్త్రవేత్తలు సభ్యులుగా వున్నారు.
ఆర్కిటిక్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం శీతాకాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధనలు నిర్వహించాలని నిర్ణయించిందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం . రవిచంద్రన్ తెలిపారు ధ్రువ ప్రాంతంలో శాస్త్రీయ సామర్థ్యాలను విస్తరించడానికి ఈ యాత్ర ఉపకరిస్తుందన్నారు. కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ విశ్వజిత్ సహాయ్, ఆర్థిక సలహాదారు శ్రీ. డి. సెంథిల్ పాండియన్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్, పోలార్ అండ్ క్రయోస్పియర్ అధిపతి డాక్టర్ తంబన్ మెలోత్, నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఓషన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ తివారీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్కిటిక్‌కు శీతాకాల యాత్రలను ప్రారంభించడం వల్ల ఆర్కిటిక్‌లో సమయానుకూలంగా కార్యకలాపాలు నిర్వహించే ఎంపిక చేసిన దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. వాతావరణ, జీవ, సముద్ర,అంతరిక్ష శాస్త్రాలు, పర్యావరణ రసాయన శాస్త్రం, క్రియోస్పియర్, భూసంబంధ పర్యావరణ వ్యవస్థ, ఖగోళ భౌతికశాస్త్ర రంగాలలో శాస్త్రవేత్తలు ప్రధానంగా పరిశోధనలు నిర్వహిస్తారు. అధ్యయనాలు ప్రాధాన్యతా పరిశోధనా రంగాలలో ఉన్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడానికి నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఓషన్ రీసెర్చ్ దరఖాస్తులు ఆహ్వానించి సమీక్షిస్తుంది. ఈ సంవత్సరం శీతాకాలపు ఆర్కిటిక్ పరిశోధన కోసం 41 ప్రతిపాదనలను అందాయని సమగ్ర సమీక్ష, నిపుణుల ఎంపిక కమిటీ 15 దరఖాస్తులను ఎంపిక చేశామని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఓషన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మెలోత్ తెలియజేశారు.
కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న PACER (పోలార్ అండ్ క్రియోస్ పియర్) పథకం కింద ధ్రువ (ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్) ప్రాంతంలో గోవా కేంద్రంగా స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR), నిర్వహిస్తోంది.
సమావేశ రికార్డింగ్ కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ యు ట్యూబ్ ఛానెల్ (https://www.youtube.com/moesgoi) https://www.youtube.com/live/bRcwlABnISc?si=eQqrTYGaxyiB_vWFలో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1987865)
Visitor Counter : 145