అంతరిక్ష విభాగం

గత మూడు సంవత్సరాలలో ఇస్రో, అంతరిక్ష పరిశోధన రంగంలో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ ను ప్రభావవంతంగా ముందుకుతీసుకు వెళుతోంది : కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 14 DEC 2023 6:24PM by PIB Hyderabad

ఇస్రో చేపట్టిన కార్యకలాపాల లక్ష్యాలు,  సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు,కార్యకలాపాలలో కృత్రిమ మేధను అమలుచేయడం, ఇందుకు సంబంధించిన  పరిష్కారాల అభివృద్ధి
ని చేపట్టడం జరుగుతోందని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆయా ప్రాజెక్టులు, కార్యక్రమాలకు కేటాయించిన మొత్తం నిధులలోనే ఈ కృత్రిమ మేథ అభివృద్ది కార్యకలాపాలు కూడా ఇమిడి ఉన్నాయని ఆయన తెలిపారు.
గగన్ యాన్ కార్యక్రమం, ఇటీవల పూర్తిఅయన చంద్రయాన్ –3 మిషన్, ఆపరేషనల్ లాంచ్ వెహికల్, స్పేస్ క్రాఫ్ట్ కార్యక్రమం, భూ పరిశీలక సమాచార విశ్లేషణ కార్యక్రమం వంటి వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఉపకరించినట్టు తెలిపారు.
అంతరిక్ష పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధించిన ఫలితాలు, కీలక విజయాలను కూడా మంత్రి ప్రస్తావించారు.


1. ఉపగ్రహ సమాచార విశ్లేషణ, భారతదేశ రిమోట్ సెన్సింగ్ ప్రాసెసింగ్, వాతావరణ సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, నావిగేషన్ ఉపగ్రహాలు.
2. భూ పరిశీలక అప్లికేషన్లను సిద్ధం చేయడం, పంట దిగుబడికి సంబంధించిన అంచనాలు, భూ వినియోగం, భూమి సంబంధించిన మ్యాప్లు, పట్టణ విస్తరణ ప్రణాళికలు, ఆక్రమణల గుర్తింపు,
 నిర్మాణ ప్రాంత పరిశీలన, పట్టణ జల వనరులు, అటవీ ప్రాంతాలలో మార్పులు, రోడ్లు, డ్యామ్లు, నౌకలు, భారీ రవాణా నౌకలు వంటి వాటికి సంబంధించిన సమాచారం
3, గ్రహాంతర పరిశీలనల మిషన్లు, చంద్రయాన్, మార్స్ మిషన్లు, ఆర్బిట్లో ప్రయాణం, చంద్రయాన్ 3 సురక్షిత లాండింగ్, ల్యాండింగ్ ప్రదేశం ఎంపిక వంటి అంశాలు.


అంతరిక్ష పరిశోధన రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరాలను చేపట్టేందుకు , అంతరిక్ష విభాగం పలు సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రోలో వీటిని అమలు చేయడంతోపాటు, పలు ప్రైవేటు
రంగాలలో వీటిని  ప్రోత్సహించనున్నట్టు ఆయన తెలిపారు. వివిధ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చిన ఆధునిక పురోగతిని అందిపుచ్చుకొని దానిని అంతరిక్ష రంగంలో వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మంత్రి తెలిపారు.
వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాలలో నైపుణ్యాభివృద్ధికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సాంకేతికత విషయంలో సిబ్బంది నైపుణ్యాలను మరింత పెంచేందుకు ప్రత్యేకించి ల్యాబ్లు ఏర్పాటు, సదస్సుల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స ఈ వెంటల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను
దీర్ఘకాలిక దృష్టితో చర్చించడం జరుగుతోందని కూడా మంత్రి తెలిపారు.

 

***



(Release ID: 1987386) Visitor Counter : 101


Read this release in: English , Hindi