కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీలో 150 కి పైగా వర్ధమాన ఔత్సాహిక వ్యాపారవేత్త సామర్ధ్య పెంపుదల కోసం వర్క్‌షాప్ నిర్వహించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ( ఐఐసిఏ),స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్
Posted On:
16 DEC 2023 6:17PM by PIB Hyderabad
'బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్' (బిఆర్ఎస్ఆర్) అనే అంశంపై ఈరోజు ఢిల్లీలో స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ (ఎస్ఓబిఈ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ( ఐఐసిఏ) ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో పూర్తి-రోజు వర్క్‌షాప్ జరిగింది.
వర్క్‌షాప్‌లో భాగంగా 8 సాంకేతిక సదస్సులు నిర్వహించారు. బిఆర్ఎస్ఆర్ లో కీలకమైన డిస్‌క్లోజర్స్, రిజల్యూషన్ పై నిర్వహించిన వర్క్‌షాప్ కు 150 కి పైగా వర్ధమాన ఔత్సాహిక వ్యాపార అభ్యాసకులు హాజరయ్యారు. ఐఐసిఏ డీజీ,సీఈఓ శ్రీ ప్రవీణ్ కుమార్ ప్రారంభ ప్రసంగంతో ఈ వర్క్‌షాప్ ప్రారంభమైంది.ప్రతి సంస్థకు బిఆర్ఎస్ఆర్ ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా ఉంటుందని శ్రీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ఆర్ ను తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఖర్చుతో కూడిన అంశంగా పరిగణించకూడదు అని ఆయన స్పష్టం చేశారు. ఇఎస్‌జి నిపుణుల అవసరం రోజురోజుకు పెరుగుతుందని పేర్కొన్న శ్రీ సింగ్ వర్క్‌షాప్‌లో అందిస్తున్న శిక్షణ అవసరాలు తీరుస్తుందని అన్నారు.
'ఇఎస్‌జి-ఎన్‌జిఆర్‌బిసి-బిఆర్‌ఎస్‌ఆర్ ప్రిన్సిపల్స్ ఇంటర్-లింకింగ్' అనే అంశంపై జరిగిన మొదటి సాంకేతిక సదస్సులో ఐఐసిఎ అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్ఓబిఈ హెడ్ ప్రొఫెసర్ గరిమా దధీచ్ ఎన్‌జిఆర్‌బిసి సూత్రాలు,వాటి ప్రాధాన్యత వివరించారు. బిఆర్‌ఎస్‌ఆర్ లో భాగమైన 'బహిర్గతం' విధానం వల్ల తెలుసుకోవటానికి, చూపించడానికి , మెరుగుపరచడానికి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. బిఆర్‌ఎస్‌ఆర్ - పారిశ్రామిక దృక్పథంపై జరిగిన సదస్సులో వఖ్లూ అడ్వైజరీ వ్యవస్థాపక-అధ్యక్షుడు శ్రీ భరత్ వఖ్లు ప్రసంగించారు. బిఆర్‌ఎస్‌ఆర్లో .పరిశ్రమల పాత్ర, బాధ్యతను వివరించిన శ్రీ భరత్ వఖ్లు ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి సంబంధించిన ప్రధాన సమస్యలు ప్రస్తావించారు.
'ఇల్లస్ట్రేటింగ్ టాప్ కంపెనీస్ బిఆర్‌ఎస్‌ఆర్ డేటాబేస్'పై జరిగిన సదస్సులో ప్రాక్సిస్ లీడ్-ప్రోగ్రామ్స్ కు చెందిన శ్రీ ధీరజ్ బిఆర్‌ఎస్‌ఆర్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, అవసరాన్ని వివరించారు. సంస్థ అభివృద్ధికి బిఆర్‌ఎస్‌ఆర్ ఉపయోగపడుతుందన్నారు.. బిఆర్‌ఎస్‌ఆర్‌ను కఠినమైన సమ్మతి ఫార్మాట్గా కాకుండా ‘రోడ్‌మ్యాప్’ లాగా పరిగణించాలని ఆయన సూచించారు.
'మానవ హక్కులు,డీఈ అండ్ ఐ (NGRBC సూత్రం 6) ప్రాముఖ్యత' అనే అంశంపై జరిగిన సదస్సులో సెషన్‌లో పార్టనర్ ఇన్ చేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ప్రదీప్ నారాయణన్ వ్యాపారంపై ప్రభావం చూపే సామాజిక సమానత్వం, చేరిక సమస్యలపై మాట్లాడారు.
‘మహిళలు, పిల్లల స్నేహపూర్వక విధానాలు (NGRBC సూత్రాలు 3, 5 మరియు 8)’పై జరిగిన సాంకేతిక సదస్సులో యూనిసెఫ్ పబ్లిక్ ,ప్రైవేట్ పార్టనర్‌షిప్ ఆఫీసర్ శ్రీ శుభ జ్యోతి భౌమిక్ ప్రసంగించారు. మహిళలు, పిల్లల కోసం హక్కులు పరిరక్షించడం,భద్రతా చర్యలను రూపొందించాల్సిన అవసరాన్నిశ్రీ శుభ జ్యోతి భౌమిక్ వివరించారు. విధానపర పాలసీ అవసరాలను అమలు చేయడానికి పరిమితం కాకుండా నైతిక, సామాజిక బాధ్యతాయుత దృక్పధంతో వ్యాపార సంస్థలు పని చేయాలన్నారు. ప్రపంచ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా, సమాజంపై సానుకూల ప్రభావం చూపించడానికి సంస్థలు కృషి చేయాలన్నారు.
ఎస్ఓబిఈ, ఐఐసిఏ చీఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ రవి రాజ్ ఆత్రే ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన బ్రాండ్‌ను స్థాపించే సాధనంగా ఇఎస్‌జి అనే అంశంపై మరో సదస్సు జరిగింది. బాధ్యతాయుతమైన బ్రాండింగ్, సుస్థిర అభివృద్ధి మధ్య పరస్పర సంబంధాలను ఆయన వివరించారు.చెట్టు నమూనా బాధ్యతాయుతమైన ప్రవర్తనను సాధించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న అంశాన్ని ఆయన వివరించారు.
కన్సోసియా అడ్వైజరీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ శ్రీ దినేష్ అగర్వాల్ నాయకత్వంలో ఇఎస్‌జి ప్రాధాన్యతపై సదస్సు జరిగింది. వ్యాపారాలు, పెట్టుబడుల సామాజిక ప్రభావం,బాధ్యత పరిశీలించడం పై ఆయన ప్రసంగించారు. చట్టబద్ధమైన కార్మిక పద్ధతులు, వైవిధ్యం , చేరిక మరియు ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇఎస్‌జి ఉపయోగపడుతుందన్నారు. ఇఎస్‌జి వ్యవస్థ ద్వారా ' సామాజిక పరిగణనలను ఏకీకృతం చేయడం వల్ల అమలు జరిగే స్థిరమైన వ్యాపార పద్ధతులు దీర్ఘకాలిక విజయం, సానుకూల సామాజిక ఫలితాల సాధనకు ఉపయోగపడుతుందన్నారు.
ప్రొఫెసర్ గరిమా దధీచ్ వందన సమర్పణ చేశారు.
****
(Release ID: 1987385)
Visitor Counter : 85