వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023–24 ఆర్ధిక సంవత్సరం తొలి 6.5 నెలల్లో ప్రభుత్వ ఈ – మార్కెట్ ప్లేస్ ద్వారా లక్ష కోట్ల రూపాయలు దాటిన సెంట్రల్


పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ ప్రొక్యూర్మెంట్ .

గత ఏడాది (ఏప్రిల్ నుంచి నవంబర్) కన్న 166 శాతం అధిక ప్రొక్యూర్ మెంట్

కేంద్ర ప్రభుత్వ రంగ ఎంటర్ప్రైజ్ల ద్వారా ప్రొక్యూర్ మెంట్, ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ స్థూల వ్యాపార విలువలో
63 శాతం గా ఉంది..

Posted On: 14 DEC 2023 5:28PM by PIB Hyderabad

 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సిపిఎస్ఇలకు) మద్దతు నివ్వడానికి , ప్రభుత్వ ఈ – మార్కెట్ ప్లేస్ , వ్యూహాత్మక జోక్యంతో , సంక్లిష్టమైన ప్రొక్యూర్ మెంట్ విధానాలకు

సైతం ఉపయోగపడే పరిష్కారాలను అందిస్తూ, సంప్రదాయమద్దతుకు  మించి చర్యలను చేపట్టింది. 2023–24 ఆర్ధిక సంవత్సరంలో  కేవలం ఆరున్నర నెలల వ్యవధిలో సిపిఎస్ఇ ల ప్రొక్యూర్మెంట్ లక్ష కోట్ల రూపాయల మార్క్ ను దాటింది.
2023–24 ఆర్ధిక సంవత్సరంలో సిపిఎస్ఇ ల ద్వారా ప్రొక్యూర్ మెంట్, అంతకు ముందు సంవత్సరం (ఏప్రిల్ నుంచి న వంబర్)తో పోల్చిచూసినపుడు, 166 శాతం పెరుగుదలను సాధించింది.
సిపిఎస్ ఇల ద్వారా ప్రొక్యూర్మెంట్ సేవలు క్రమంగా పెరుగుతూ వచ్చాయ. ఇవి  2022–23లో సుమారు 37,000 కోట్ల రూపాయల నుంచి 2023–24 లో ((2023 ఏప్రిల్ –నవంబర్ మధ్య) రూ 66, 550 కోట్ల రూపాయలకు చేరాయి.

సిపిఎస్ఇలు , ప్రభుత్వ ఈ మార్కెట్ప్లేస్ ద్వారా జరిపిన ప్రొక్యూర్మెంట్, మొత్తం ప్రభుత్వ మర్చండైజ్ విలువలో (జిఎంవి) 63 శాతం వరకు ఉంది. 240 కి పైగా సిపిఎస్ఇలు కీలక కంట్రిబ్యూటర్లుగా ఎదిగాయి. ఇవి
ఙిఇఎంలో క్రియాశీలంగా మారాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో జి.ఇ.ఎం  రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా వార్షిక జి.ఎం.వి ని సాధించింది. 2023–24 ఆ3ర్ధిక సంవత్సరం ఒక్కదానిలోనే సిపిఎస్ఇలు కేవలం
ఙిఇఎం ద్వారా 2 లక్షల కోట్ల  రూపాయల విలువగల ప్రొక్యూర్ మెంట్లు సాధించగలవని అంచనా. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే , దీని పనితీరు రెట్టింపు కానున్నదని అంచనా.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బొగ్గు, విద్యుత్, ఉక్కు , భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖలకు చెందిన సిపిఎస్ ఇలు అత్యున్నత స్థాయి ప్రొక్యూర్చేసిన విభాగాలుగా నిలిచాయి.
విద్యుత్ మంత్రిత్వశాఖ కిందగల ఎన్.టి.పి.సి గనుల అభివృద్ధి, ఇతర కార్యకలాపాల సేవలకు సంబంధించి పలు ఆర్డర్ల
ఆర్డర్లు ఇచ్చింది. వీటి విలువ సుమారు  40,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
సరకు రవాణా సేవలు ఈ సమయంలో రెండవ అతిపెద్ద సేవలుగా నిలిచాయి. బొగ్గు మంత్రిత్వశాఖ కిందగల సిపిఎస్ఇలు
ఈ సేవలకు సంబంధించి ఉన్నత స్థాయి ప్రొక్యూర్ మెంట్ సంస్థలుగా నిలిచాయి.
వీటి వ్యయం సుమారు 30,000 కోట్ల రూపాయల వరకు ఉంది. 2021 నుంచి జిఇఎం పై 45 సిపిఎస్లు అమ్మకం దారులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నాయి..
ఇందులో 43 సిపిఎస్ ఇలు 23,800 కోట్ల రూపాయల మేరకు విజయవంతంగా ఆర్డర్లను పూర్తిచేశాయి.

వివిధ రంగాలలో కీలక సంస్థలు, సిపిఎస్ఇలు ఆవిష్కరణలు, సమర్ధత ఫలితంగా జిఇఎంల ప్రగతి సాకారమైంది.
ఈ వృద్ధిని గమనించినపుడు ఈ సంస్థలు అత్యున్నత ప్రగతికి కట్టుబడి ఉండడమే కాక, పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ డిజిటల్ వ్యవస్థకు కూడా గట్టి మద్దతు నిస్తున్నట్టు తేలుతోంది.
బిడ్ పబ్లిషింగ్ ప్రక్రియ నుంచి దానిని విజయవంతంగా అమలు చేసేంత వరకు అన్ని దశలలో జిఇఎంకు అన్ని విధాల సహకారం అందించడం జరుగుతోంది.
ఇందుకు నిబద్ధులైన నోడల్ ఆఫీసర్లు కృషిచేస్తున్నారు. వీరు సిపిఎస్ ఇ కొనుగోలు దారులతో నిరంతరం సంబంధాలు కలిగి ఉంటున్నారు.

 

***


(Release ID: 1987052) Visitor Counter : 72


Read this release in: English , Urdu , Hindi